Jump to content

బరూచ్ స్పినోజా

వికీపీడియా నుండి

బరూచ్ స్పినోజా (నవంబర్ 24, 1632 - ఫిబ్రవరి 21, 1677) పోర్చుగీసు-యూదు మూలాలు కలిగిన తత్వవేత్త. జ్ఞానోదయ యుగానికి ఆద్యుడిగా పరిగణించదగిన స్పినోజా ఆధునిక బైబిల్ విమర్శలను, 17వ శతాబ్దపు హేతువాదాన్ని, డచ్ మేధో సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాడు. ఆధునిక కాలంలోని అత్యంత ముఖ్యమైన, రాడికల్ తత్వవేత్తలలో ఒకరిగా పేరు పొందాడు. స్టోయిసిజం, థామస్ హాబ్స్, రెనీ దెకార్త్ నుంచి స్ఫూర్తి పొందిన[1] స్పినోజా డచ్ స్వర్ణయుగంలో ప్రముఖ తత్వవేత్తగా పేరుగాంచాడు.

స్పినోజా ఆమ్‌స్టర్‌డ్యామ్ లోని ఒక మరానో (బలవంతంగా క్రైస్తవంలోకి మార్చబడిన స్పానిష్, పోర్చుగీసు యూదులు) కుటుంబంలో జన్మించాడు. వీరు పోర్చుగల్ లో తమ మీద సాగుతున్న వేధింపులు భరించలేక డచ్ గణతంత్ర రాజ్యంలోకి వలస వచ్చినవారు. ఇతను యూదుల సాంప్రదాయ విద్యనభ్యసించాడు. హీబ్రూ భాషను నేర్చుకుని పోర్చుగీసు యూదు సమాజం వారి పవిత్ర గ్రంథాలను చదివాడు. అక్కడ అతని తండ్రి పేరు పొందిన వ్యాపారి. యువకుడిగా ఉండగానే యూదుల సిద్ధాంతాల్ని, అధికారాల్ని సవాలు చేశాడు. ఫలితంగా 1656 లో యూదు సమాజం నుంచి వెలివేయబడ్డాడు. దాంతో అతను మత సంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కేవలం తాత్విక వివేచనలో సమయం గడపడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అనుచరగణం ఏర్పడింది. వారు అతని రచనలు అధ్యయనం చేస్తూ అతనితో పాటూ సత్యశోధనలో భాగం అయ్యారు.

తన రచనలను నిషేధించి, వేధిస్తారేమోనని స్పినోజా తన రచనలను ప్రచురించలేదు.

మూలాలు

[మార్చు]
  1. Schmitter, Amy M. (8 Apr 2021). Zalta, Edward N. (ed.). "Spinoza on the Emotions". Stanford Encyclopedia of Philosophy.