Jump to content

బల్వీందర్ సంధు

వికీపీడియా నుండి
బల్వీందర్ సంధు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బల్వీందర్ సింగ్ సంధు
పుట్టిన తేదీ (1956-08-03) 1956 ఆగస్టు 3 (వయసు 68)
బొంబాయి
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 162)1983 జనవరి 14 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1983 నవంబరు 12 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 42)1982 డిసెంబరు 3 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1984 అక్టోబరు 31 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81–1986/87బొంబాయి
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 8 22 55 42
చేసిన పరుగులు 214 51 1,003 159
బ్యాటింగు సగటు 30.57 12.75 21.80 17.66
100లు/50లు 0/2 0/0 0/8 0/0
అత్యుత్తమ స్కోరు 71 16* 98 32*
వేసిన బంతులు 1,020 1,110 9,277 2,178
వికెట్లు 10 16 168 36
బౌలింగు సగటు 55.70 47.68 27.91 40.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 5 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/87 3/27 6/64 3/27
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 5/– 19/– 12/–
మూలం: CricketArchive, 30 September 2008

బల్వీందర్ సింగ్ సంధు (జననం 1956 ఆగస్టు 3) భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. అతను బంతిని స్వింగ్ చేయగల మీడియం పేస్ బౌలరుగా, ఉపయోగకరమైన బ్యాట్స్‌మెన్‌గా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సంధు సభ్యుడు.

కెరీర్

[మార్చు]

క్రికెట్‌ ఆలస్యంగా ఆడడాం మొదలుపెట్టాడు. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ యశ్వంత్ 'బాబా' సిధయే, బల్వీందర్‌ను సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో చూసాడు. మరుసటి సంవత్సరం, అతను ప్రసిద్ధ కోచ్ రమాకాంత్ అచ్రేకర్, ఆ తరువాతి కాలంలో రంజీ ఆటగాడు హేము దాల్వీల ప్రభావం లోకి వచ్చాడు.

1980-81లో బొంబాయికి రెగ్యులర్ ఓపెనింగ్ బౌలర్ అయిన కర్సన్ ఘావ్రీ జాతీయ జట్టులో చేరినపుడు, సంధుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అవకాశం వచ్చింది. సంధు ఈ సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడలేదు కానీ గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అతను ఆ సీజన్‌లో ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో ఆడే పదకొండు మందిలో భాగం కాదు. కానీ, మొదట ఎంపికైన రవి కులకర్ణిని తప్పించడంతో చివరి క్షణంలో జట్టులో చేరాడు. ఆ మ్యాచ్‌లో అతను, సంచలనాత్మక స్పెల్‌లో మొదటి రోజు ఉదయం ఢిల్లీని 18–5కి తీసుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసాడు. ఆ సీజన్‌లో 18.72 సగటుతో 25 వికెట్లు తీసాడు.

1982–83 సీజన్ ప్రారంభంలో, వెస్ట్ జోన్ జట్టులో ఆడుతూ సౌత్‌తో జరిగినదులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సంధు ఎనిమిది వికెట్లు పడగొట్టడమే కాకుండా, నం.11 వద్ద బ్యాటింగ్ చేస్తూ 56 పరుగులు చేశాడు. ఇరానీ ట్రోఫీలో మరో ఐదు వికెట్లు తీసి పాకిస్థాన్‌లో పర్యటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.


మదన్ లాల్‌కు మడమ ఎముక గాయమవడంతో సంధు, హైదరాబాద్‌లో జరిగిన నాల్గవ టెస్టులో అరంగేట్రం చేశాడు. మొహ్సిన్ ఖాన్, హరూన్ రషీద్‌లను అవుట్ చేయడంతో అతని మొదటి రెండు వికెట్లు వరుస బంతుల్లో వచ్చాయి. ఆ తరువాత జావేద్ మియాందాద్, ముదస్సర్ నాజర్‌లు ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ మ్యాచ్‌లో నం.9 వద్ద బ్యాటింగ్ చేస్తూ సంధు, 71 పరుగులు చేశాడు.

అతను వెస్టిండీస్‌పై బ్రిడ్జ్‌టౌన్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో, అతని ఓపెనింగ్ స్పెల్ కారణంగా వెస్టిండీస్‌ ఒక పరుగుకు మూడు వికెట్లు కోల్పోయింది.

1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సంధు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఫైనల్‌లో నెం.11 వద్ద బ్యాటింగ్ చేస్తూ, అతను సయ్యద్ కిర్మాణితో కలిసి 22 పరుగులు చేసాడు. ఆ సమయంలో అతని తలపై బౌన్సర్ తగిలింది. తర్వాత అతను గార్డన్ గ్రీనిడ్జ్‌ను భారీ ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 నెలల్లో అతను గ్రీనిడ్జ్‌ని బౌల్డ్ ఔట్‌ చెయ్యడం అది మూడోసారి. వెస్ట్ జోన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన 1983 మ్యాచ్‌లో నాలుగోసారి గ్రీనిడ్జ్‌ను బౌల్డ్ చేశాడు. అతని చివరి టెస్టు కూడా ఆ సంవత్సరం చివర్లో అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తోనే ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒకే ఒక్క వికెట్ తీశాడు. అదే ఇన్నింగ్స్‌లో 83 పరుగులకు 9 వికెట్లు తీసిన కపిల్ దేవ్ నుండి తప్పించుకున్న ఏకైక వికెట్ ఇది. ఆ తర్వాత సంధు క్రికెట్‌లో ఏ రూపంలోనూ పెద్దగా ఆడింది లేదు. 1984-85 రంజీ సెమీఫైనల్‌లో బాంబే మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంలో తమిళనాడుపై అతని 98 పరుగులు ముఖ్యమైనవి.


అతను ముంబై, పంజాబ్‌లకు కోచ్‌గా పనిచేశాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేశాడు. 1990లలో అతను కెన్యాలో క్లబ్ క్రికెట్ ఆడాడు. అక్కడ కొంత కోచింగ్ కూడా చేశాడు.

అతను కొంతకాలం పాటు ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL)తో కలిసి పనిచేసాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు.

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]

1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 83 (2021) లో పంజాబీ గాయకుడు, నటుడు అమీ విర్క్ సంధు పాత్రను పోషించాడు.

మూలాలు

[మార్చు]
  • ప్రదీప్ విజయకర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వ్యాసం, ఇండియన్ క్రికెట్ 1983, pp. 121–125