Jump to content

బాదమ్‌రావ్ పండిట్

వికీపీడియా నుండి
బాదంరావు పండిట్

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రి
పదవీ కాలం
2009 – 2014

పదవీ కాలం
2009 – 2014
ముందు అమర్‌సింహ పండిట్
తరువాత లక్ష్మణ్ పవార్
నియోజకవర్గం జియోరాయ్
పదవీ కాలం
1995 – 2004
ముందు శివాజీరావు అంకుశరావు పండిట్
తరువాత అమర్‌సింహ పండిట్

వ్యక్తిగత వివరాలు

జననం 1955 మే 3
దోయితాన్, బీడ్, మహారాష్ట్ర 413207
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లాహురావ్ పండిట్, రాజాబాయి పండిట్
జీవిత భాగస్వామి గిరికా పండిట్
సంతానం యుధాజిత్ పండిట్, యష్రాజ్ పండిట్
వృత్తి రాజకీయ నాయకుడు

పండిట్ బాదమ్‌రావ్ లాహుజీ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జియోరాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాదమ్‌రావ్ పండిట్ స్వతంత్రంగా రాజకీయాల్లోకి వచ్చి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పండిట్ శివాజీరావు అంకుశరావుపై 40,267 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పండిట్ అమరసింహ శివాజీరావుపై 18,665 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బాదమ్‌రావ్ పండిట్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పండిట్ అమర్‌సింహ శివాజీరావు చేతిలో 16,600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పండిట్ అమర్‌సింహ శివాజీరావుపై 2,347 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1][2] రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

బాదమ్‌రావ్ పండిట్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ పవార్ చేతిలో 60,001 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2017లో శివసేన పార్టీలో చేరాడు[4] అనంతరం పార్టీలో జరిగిన పరిణామాలతో ఆయన శివసేన (యుబిటి) వర్గంలో చేరి 2024 శాసనసభ ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విజయసింహ పండిట్ 42,390 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "NCP faces exodus as leaders join Sena, Congress ahead of polls" (in ఇంగ్లీష్). 18 January 2017. Retrieved 8 January 2025.
  5. "Maharastra Assembly Election Results 2024 - Georai" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  6. "Georai Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.