బానోతు శంకర్ నాయక్

వికీపీడియా నుండి
(బానోతు శంకర్‌ నాయక్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బానోతు శంకర్‌ నాయక్‌
బానోతు శంకర్ నాయక్


పదవీ కాలం
 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
బాలాజీ తండా, రాయపర్తి మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కెవ్లా నాయక్, బాజు భాయ్
జీవిత భాగస్వామి డాక్టర్ సీతామహాలక్ష్మి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

బానోతు శంకర్‌ నాయక్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు.[1] భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం

[మార్చు]

శంకర్ నాయక్ 1968లో కెవ్లా నాయక్, బాజు భాయ్ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, రాయపర్తి మండలంలోని బాలాజీ తండా గ్రామంలో జన్మించాడు. 1985-1990 వరకు వరంగల్‌లోని ఆర్.ఈ.సి. ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదివాడు. 2009లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఏ పూర్తి చేసాడు.[4] వ్యవసాయ కుటుంబానికి చెందిన శంకర్, రాజకీయాల్లోకి రాకముందు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శంకర్ నాయక్ కు డాక్టర్ సీతామహాలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన శంకర్, ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 2009లోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితపై 9,315 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్పై 13,534 ఓట్ల మెజారిటీతో రెండవసారి ఎన్నికయ్యారు.[7][8]

ఇతర వివరాలు

[మార్చు]
  1. తన స్వస్థలమైన రాయపర్తి మండలంలోని బాలాజీ తండాలో డబుల్ బెడ్రూమ్ పథకంలో ఇళ్ళు వచ్చిన 25 మంది లబ్ధిదారులకు రూ. 50 వేలు బహుమతిగా ప్రకటించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-20.
  2. "Banoth Shankar Nayak MLA of Mahabubabad (ST) Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
  3. "Mahabubabad Assembly Election Result 2018: TRS' Banoth Shankar Nayak wins by an impressive margin". www.timesnownews.com. Retrieved 2021-08-20.
  4. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  5. 5.0 5.1 "MLA Shankar Naik to gift Rs 50K each to 25 double bedroom beneficiaries". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-05. Retrieved 2021-08-20.
  6. "Banoth Shankar Nayak(TRS):Constituency- MAHABUBABAD(WARANGAL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-20.
  7. "Banoth Shankar Naik(TRS):Constituency- MAHBUBABAD(MAHABUBABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-20.
  8. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.