బాలాంత్రపు వేంకటరావు
Appearance
బాలాంత్రపు వేంకటరావు జంటకవులుగా ప్రసిద్ధులైన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం, మల్లాములో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు 1880లో (విక్రమ నామ సంవత్సరంలో) జన్మించాడు[1]. ఇతడు పిఠాపురంలో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో ఓలేటి పార్వతీశంతో పరిచయం ఏర్పడి జంటగా రచనలు చేయసాగారు. 1911లో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలను తణుకులో ప్రారంభించి, నిడదవోలు, రాజమండ్రి, కాకినాడ, పిఠాపురములలో సంచారము చేసి 1980 వరకు ఈ గ్రంథమాల ద్వారా 170 గ్రంథాలను ప్రకటించారు. ఇతని కుమారులు బాలాంత్రపు నళినీకాంతరావు, బాలాంత్రపు రజనీకాంతరావు[2] ఇరువురూ ప్రసిద్ధులు.
రచనలు
[మార్చు]స్వీయ రచనలు
[మార్చు]- ధనాభిరామము (నాటకము)
- సురస (నవల)
- కాకము (నవల)
- బాలుని వీరత్వము
- సన్యాసిని
- యాచాశూరేంద్ర విజయము[3]
- భావసంకీర్తన సీస త్రిశతి [4]
- స్త్రీల వ్రతకథలు
ఓలేటి పార్వతీశంతో కలిసి జంటగా రచించినవి
[మార్చు]- ఇందిర (నవల)
- అరణ్యక (నవల)
- ఉన్మాదిని (నవల)
- సీతారామము (నవల)
- సీతాదేవి వనవాసము (నవల)
- నిరద (నవల)
- నీలాంబరి (నవల)
- ప్రణయకోపము (నవల)
- ప్రతిజ్ఞా పాలనము (నవల)
- ప్రభావతి (నవల)
- ప్రమదావనము (నవల)
- శ్యామల (నవల)
- శకుంతల (నవల)
- చందమామ (నవల)
- రాజసింహ (నవల)
- వసుమతీ వసంతము (నవల)
- వీరపూజ (నవల)
- రాజభక్తి (నవల)
- వంగవిజేత (నవల)
- లక్షరూపాయలు (నవల)
- మనోరమ (నవల)
- మాతృ మందిరము (నవల)
- మాయావి (నవల)
- హారావళి (నవల)
- రజని (నవల)
- సాధన (నవల)
- కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
- పరిమళ (నవల)
- సంతాపకుడు (నవల)
- చిత్రకథా సుధాలహరి (నవల)
- కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
- బృందావనము (పద్యకావ్యము)
- ఏకాంతసేవ (పద్యకావ్యము)
బిరుదులు
[మార్చు]- కవికులాలంకార
- కవిరాజహంస
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్ర రచయితలు ప్రథమభాగము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పుటలు 308-315
- ↑ selvi. "బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత". telugu.webdunia.com. Retrieved 2020-05-11.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి