Coordinates: 18°52′55″N 77°55′15″E / 18.8819968°N 77.9208459°E / 18.8819968; 77.9208459

బాసర ట్రిపుల్ ఐటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాసర ట్రిపుల్ ఐటి
ప్రతిభావంతులైన తెలంగాణ గ్రామీణ యువత విద్యా అవసరాలను తీర్చడం
ఇతర పేర్లు
రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర
రకంరాష్ట్ర విశ్వవిద్యాలయం
స్థాపితం2008
వైస్ ఛాన్సలర్వి. వెంకటరమణ (ఐ/సి)
విద్యార్థులు7500+
స్థానంబాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ, తెలంగాణ, 504107, భారతదేశం
18°52′55″N 77°55′15″E / 18.8819968°N 77.9208459°E / 18.8819968; 77.9208459
కాంపస్పట్టణ
రంగులు 

బాసర ట్రిపుల్ ఐటి (రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని బాసర పట్టణంలో ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయం.[1] విశ్వవిద్యాలయంలో వివిధ సాంకేతిక విద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్.డి డిగ్రీలను అందిస్తోంది.[2]

చరిత్ర[మార్చు]

2008 మార్చిలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు టెక్నాలజీలో కోర్సులను చదువుకోవడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 2008లోనే ప్రభుత్వం శాసనసభ చట్టం ద్వారా దీనిని పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందించింది. 2008 ఆగస్టు నెలలో పదోతరగతి పాసైన సుమారు 6,000 మందితో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ మొదటి బ్యాచ్ ప్రారంభించబడింది.

అకాడమిక్[మార్చు]

10వ తరగతి పరీక్షలు పాసయిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటి ఆరు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విద్యను అందిస్తోంది. ఇందులో ఇంటర్మీడియట్ డిగ్రీకి సమానమైన రెండేళ్ళ ప్రీ-యూనివర్సిటీ కోర్సుతోపాటు ఇంజినీరింగ్ కోర్సులో నాలుగేళ్ళ డిగ్రీ కోర్సు ఉంటుంది.[3] ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులను కూడా అందించబడుతాయి.[3]

అనుబంధం[మార్చు]

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో బోధన, పరిశోధన విభాగంలో ప్రత్యేకించబడిన స్వయంప్రతిపత్త సంస్థల పరిధిలోకి బాసర ట్రిపుల్ ఐటి వస్తుంది. భారత ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు కాకుండా ఈ సంస్థ దాని స్వంత నిబంధనలను అనుసరిస్తుంది.[4]

కార్యకలాపాలు[మార్చు]

కళలు, గాత్ర సంగీతం, కూచిపూడి నృత్యం, యోగా వంటి అనేక అదనపు విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.[5] పాఠ్యప్రణాళికలో భారతదేశంలోని శాస్త్రీయ కళారూపాలను కూడా చేర్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్ట్ నిర్వహించబడుతోంది.

విభాగాలు[మార్చు]

విద్యార్థుల ఆందోళన, పరిష్కారం[మార్చు]

విద్యాసంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు యూనిఫామ్స్‌, మెస్ కాంట్రాక్ట్ రద్దు, ల్యాప్‌టాప్‌లు, ఛాన్స్‌లర్‌ల భర్తీ వంటి డిమాండ్లతో 2022 జూన్ నెలలో వారంరోజులపాటు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడగా జూన్ 20న ఆందోళనను విరమించారు. 2022 సెప్టెంబరు 26న తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో లంచ్ చేసి వారితో స‌ర‌దాగా చర్చించాడు. ట్రిపుల్ ఐటీలో టీ హబ్ సెంటర్ ఏర్పాటుతోపాటు, మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయడం, మోడర్న్ క్లాస్ రూముల వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]

2022 డిసెంబరు 10న జరిగిన స్నాతకోత్సవంలో కేటీఆర్ పాల్గొని 570మంది విద్యార్థులకు ఇంజినీరింగ్‌ పట్టాలు, గత మూడేళ్ళలో ఆయా విభాగాల్లో వర్సిటీ టాపర్లుగా నిలిచిన 36 మంది విద్యార్థులకు స్వర్ణపతకాలు, 2200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 1500 డెస్క్ టాప్ కంప్యూటర్లను అందజేశాడు.[8][9]

మూలాలు[మార్చు]

  1. "IIIT-Basara students call off strike".
  2. "Knowledge Cluster". Times of India. 1 Jun 2014. Retrieved 2022-10-04.
  3. 3.0 3.1 "Academic Programmes". Rajiv Gandhi University of Knowledge Technologies. Archived from the original on 2016-07-24. Retrieved 2022-10-04.
  4. "University". University Grants Commission. Retrieved 2022-10-04.
  5. Reddy, J Deepthi Nandan (14 July 2014). "RGUKT Nuzvid Students Take to Performing Arts to Beat Stress". The New Indian Express. Archived from the original on 2016-03-05. Retrieved 2022-10-04.
  6. "Basara IIT Students Great.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-26. Archived from the original on 2022-09-26. Retrieved 2022-10-04.
  7. telugu, NT News (2022-09-26). "బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కేటీఆర్ మాటముచ్చట". Namasthe Telangana. Archived from the original on 2022-10-01. Retrieved 2022-10-04.
  8. "Basara: ఘనంగా బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవం". EENADU. 2022-12-10. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-14.
  9. telugu, NT News (2022-12-11). "ట్రిపుల్‌ ఐటీలో మినీ టీ హబ్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-14.