బినోయ్ విశ్వమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బినోయ్ విశ్వమ్
2010లో బినోయ్ విశ్వమ్
భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రాజ్యసభ
Assumed office
2019 జూలై 24
అంతకు ముందు వారుడి. రాజా
పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), కేరళ
Assumed office
2018 జూలై 2
అంతకు ముందు వారుపి. జె. కురియన్
అటవీ, వన్యప్రాణుల మంత్రి, కేరళ
In office
2006 మే 18 – 2011 మే 18
అంతకు ముందు వారుఎ. సుజనాపాల్
తరువాత వారుకె. బి. గణేష్ కుమార్
నియోజకవర్గంనాదపురం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ సభ్యుడు, కేరళ
In office
2001–2011
అంతకు ముందు వారుసత్యన్ మొకేరి
తరువాత వారుఇ. కె. విజయన్
నియోజకవర్గంనాదపురం శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1955-11-25) 1955 నవంబరు 25 (వయసు 68)
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)
జీవిత భాగస్వామిశైలా సి. జార్జ్
సంతానంరష్మి, సూర్య
తల్లిసి.కె. ఓమన
తండ్రిసి. కె. విశ్వనాథన్
నివాసంముత్తుచిప్పి, తొండయాడ్, నెల్లికోడ్, కోజికోడ్, కేరళ, భారతదేశం-673016
చదువుబి.ఎ., ఎల్.ఎల్.బి.
కళాశాలసెయింట్ పాల్స్ కాలేజ్, కలమస్సేరి,
మహారాజా కాలేజ్, ఎర్నాకులం
కేరళ లా అకాడమీ, లా కాలేజ్, త్రివేండ్రం

బినోయ్ విశ్వమ్ కేరళ నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యుడు.[1] ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు కూడా. ఆయన నాదపురం నియోజకవర్గం నుండి కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన 2006 నుండి 2011 వరకు కేరళ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసాడు.[2] నియోజకవర్గ డీలిమిటేషన్ కమిటీలోని ఐదుగురు సభ్యులలో ఒకడిగా వ్యవహరించిన ఆయన కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా కూడా చేసాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన శైలా సి. జార్జ్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె కేరళలోని తిరువనంతపురంలో కేరళ గ్రామీణ బ్యాంకులో అధికారిగా పనిచేసింది. ఆమె క్రియేటివ్ రైటింగ్‌లో నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి కోర్సు పూర్తి చేసింది.

బినోయ్ విశ్వమ్, శైలా సి. జార్జ్ ఇద్దరు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పిల్లలు.[3] ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న సి.కె.విశ్వనాథన్ కుమారుడు. కాగా, ఆమె టీచర్‌గా మారిన పార్టీ నాయకురాలు కూతట్టుకులం మేరీ కుమార్తె.

ఈ దంపతులకు రష్మి, సూర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రష్మి ది హిందూలో పని చేస్తోంది. సూర్య కొలంబియా యూనివర్శిటీ నుండి లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి కేరళ హైకోర్టు ఎర్నాకులంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Parliament".
  2. "Council of Ministers - Kerala". Kerala Legislative Assembly. Retrieved 20 December 2009.
  3. "Kerala State - Everything about Kerala". Archived from the original on 2023-11-11. Retrieved 2023-11-11.