బిర్జిస్ ఖాదర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Birjis Qadr
Birjis Qadr.jpg
Nawab of Awadh [note 1]
Reign5 July 1857 – 3 March 1858
PredecessorWajid Ali Shah
SuccessorMonarchy abolished
RegentBegum Hazrat Mahal
జననం(1845-08-20)1845 ఆగస్టు 20
Qaisar Bagh, Lucknow, Oudh (present-day Uttar Pradesh, India)
మరణం1893 ఆగస్టు 14(1893-08-14) (వయసు 47)
Arabagh Palace, Calcutta, Bengal Presidency, British India (present-day West Bengal, India)
Burial
Sibtainabad Imambara, Kolkata
SpouseMehtab Ara Begum
Issue5
తండ్రిWajid Ali Shah
తల్లిBegum Hazrat Mahal
మతంIslam
బిర్జిస్ కద్ర్
Birjis Qadr.jpg
అవధ్ నవాబు [note 2]
Reign1857 జూలై 5 – 1858 మార్చి 3
Predecessorవాజిద్ అలీ షా
Successorరాచరికం నశించింది
Regentబేగం హజరత్ మహల్
జననం(1845-08-20)1845 ఆగస్టు 20
కైసర్ బాగ్, లక్నో
మరణం1893 ఆగస్టు 14(1893-08-14) (వయసు 47)
ఆరాబాగ్ ప్యాలెస్, కోల్‌కతా
Burial
సిబ్తైనాబాద్ ఇమాంబారా, కోల్‌కతా
Spouseమెహతాబ్ ఆరా బేగం
Issue5
తండ్రివాజిద్ అలీ షా
తల్లిబేగం హజరత్ మహల్
మతంఇస్లాం

బిర్జీస్ ఖాదర్ (1845 ఆగస్టు 20 - 1893 ఆగస్టు 14) 1857 నుండి 1858 వరకు అవధ్ రాజ్యాన్ని పాలించిన నవాబు.

సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తరువాత, ఖాదర్ తల్లి 1857 లో అతడిని రాజ్యానికి రాజుగా నియమించింది. ఆమె అతని ప్రతినిధిగా మారింది. వారు బ్రిటిషు దళాలకు గట్టిగా ప్రతిఘటించినప్పటికీ, 1858 లో బ్రిటిషు వారు లక్నోను స్వాధీనపరచుకున్నారు. దాంతో వారు నేపాల్‌లోని ఖాట్మండుకు పారిపోయారు. ఖాట్మండులో అతను కవిగా మారి, ముషాయిరా (పద్య పఠనాలు) నిర్వహించాడు.

1887 లో, అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. కోల్‌కతా పొరుగున ఉన్న మెటియాబ్రూజ్‌కు వెళ్లాడు. 1893 లో, సొంత బంధువులే అతన్ని హత్య చేసారు.

ప్రారంభ జీవితం, పట్టాభిషేకం[మార్చు]

Photograph showing Qadr with is father Wajid Ali Shah and his mother Begum Hazrat Mahal
ఎడమ నుండి కుడికి: ఖాదర్ తండ్రి వాజిద్ అలీ షా, ఖాదర్, ఖాదర్ తల్లి బేగం హజ్రత్ మహల్

ఖాదర్ 1845 ఆగస్టులో లక్నో లోని కైసర్ బాగ్‌లో [1] నవాబ్ వాజిద్ అలీ షా, బేగం హజ్రత్ మహల్ దంపతులకు జన్మించాడు. [2] 1856 లో, ఖాదర్ తండ్రి నవాబ్ వాజిద్ అలీ షాను దుష్పరిపాలన అనే సాకుతో బ్రిటిషు వారు పదవి నుండి తొలగించారు. అతన్ని కలకత్తా పరిసర ప్రాంతమైన మెటియాబ్రూజ్‌కు బహిష్కరించారు.. [3]

1857 లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటుచెలరేగింది, అవధ్‌లో తిరుగుబాటుదారులకు బేగం హజ్రత్ నాయకత్వం వహించారు. చిన్హాట్ యుద్ధంలో తిరుగుబాటు దళాల నిర్ణయాత్మక విజయంతో బ్రిటిష్ వారు వారి రెసిడెన్సీలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి ఇది లక్నో ముట్టడికి దారితీసింది. జూన్ 5 న, తిరుగుబాటు సైన్యానికి ప్రధాన ప్రతినిధి జైలాల్ సింగ్ అంగీకారంతో పదకొండేళ్ల ఖాదర్‌ను అతని తల్లి బేగం హజ్రత్ అవధ్ నవాబుగా ప్రకటించింది. అతని పట్టాభిషేకానికి దర్బారులో అందరూ విస్తృతంగా మద్దతు ఇచ్చారు. [4] చరిత్రకారుడు రుద్రాంగ్షు ముఖర్జీ, ఖాదర్ తరఫున రాజ్యాన్ని పాలించడానికి బేగమ్ హజ్రత్‌ని తిరుగుబాటు సైన్యం అనుమతించినప్పటికీ, వారు చాలా స్వయంప్రతిపత్తిని సాధించుకున్నారు. [5] [4] అనంతరం, తన పాలనను ధృవీకరించమని కోరుతూ ఖాదర్, మొగల్ చక్రవర్తి బహదూర్ షా II కి రాసాడు. ఇది మంజూరై, అతనికి వజీర్ బిరుదు లభించింది. [4]

సెప్టెంబర్ 1857 లో, జేమ్స్ అవుట్రమ్, హెన్రీ హావ్‌లాక్ ల నాయకత్వం లోని బ్రిటిషు రెజిమెంటు తిరుగుబాటు దళాలను చీల్చుకుని రెసిడెన్సీలోకి ప్రవేశించింది. అయితే, వారి బలం బాగా తగ్గిపోయింది. పెద్దగా ఉపశమనమేమీ కలగలేదు. బలమైన కోటకు ప్రక్కనే ఉన్న భూభాగాన్ని నియంత్రించలేకపోయారు. [4] ఖాదర్, బేగం హజ్రత్ లు బ్రిటిషు వారు చేసిన అన్యాయాలను నొక్కిచెబుతూ ప్రకటనలు జారీ చేశారు. సామాన్యుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, క్రైస్తవ మతాన్ని బలవంతంగా రుద్దడమ్నుం, వాజిద్ అలీ షాను అకారణంగా పదవి నుండి తొలగించడం, సందేహాస్పదమైన కారణాలతో స్థానిక స్వతంత్ర రాజ్యాలను పడగొట్టడం. వంటి కారణాలను తమ ప్రకటనల్లో చూపారు. [4] తిరుగుబాటుదారులు గొప్ప ఉత్సాహంతో ఉన్నారని, రెసిడెన్సీని అత్యంత ప్రభావవంతంగా దిగ్బంధించారనీ ముఖర్జీ పేర్కొన్నాడు. [4] తిరుగుబాటుకు ప్రజల నుండి బలమైన మద్దతు లభించింది. చర్చల కోసం, సహాయం కోసం బ్రిటిషు వారు చేసిన అన్ని విజ్ఞప్తులనూ పూర్తిగా విస్మరించారు. [4] మొత్తంమీద, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో సిపాయి తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేసినప్పటికీ, లక్నో (అవధ్) భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక దళాలకు చివరి ప్రధాన కోటగా మిగిలిపోయింది. నానా సాహిబ్, హోల్కర్ లతో సహా అనేక మంది తిరుగుబాటుదారులను ఆకర్షించింది. [4]

1857 నవంబరులో, కోలిన్ కాంప్‌బెల్ నేతృత్వంలో మరొక బ్రిటిషు రెజిమెంటు, రెసిడెన్సీ జనాభా సహాయంతో, లక్నో శివార్లలో ఉన్న బహుళ రక్షణలను ఛేదించి, స్థానిక తిరుగుబాటు దళాలను ఓడించి, ముట్టడిలో ఉన్న వారిని సురక్షితంగా విడిపించింది. [4] ఆ తరువాత, క్యాంప్‌బెల్ తిరుగుబాటుదారుల దాడి ముప్పులో ఉన్న ఇతర నగరాలను (ముఖ్యంగా అలంబాగ్) రక్షించడానికి తరలివెళ్ళాడు. కానీ లక్నోలో బలమైన రక్షణను ఏర్పాటు చేయలేదు. [4] తిరుగుబాటుదారులు లక్నోలో పెద్ద సంఖ్యలో గుమికూడడం కొనసాగించారు. ఇది భౌగోళికంగా వ్యూహాత్మకంగా వారి భవిష్యత్తు వ్యూహాలకు ప్రయోజనకరంగా మారింది. [4] అల్రాంబాగ్ వద్ద, ఔట్రామ్ తన చివరి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, 30,000 పైచిలుకు బలం కలిగిన తిరుగుబాటు దార్లు అతనిపై ఆరు సార్లు దాడి చేసారు. [4]

డిసెంబరు నాటికి, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను, తిరుగుబాట్లనూ పూర్తిగా అణిచివేసారు. తిరుగుబాటు నాయకులను వేరుచేసారు. తిరుగుబాటుదారులు ఓటమి తప్పని యుద్ధాలు చేసారు. [4] అదే నెలలో, తిరుగుబాటుదారులు అంతర్గత వైరాలను కూడా ఎదుర్కొన్నారు. ఫైజాబాద్ మౌల్వీ అయిన అహ్మదుల్లా షా, దైవ సంకల్పం సాకుతో ఖాదర్ నాయకత్వాన్ని సవాలు చేశాడు. తద్వారా తిరుగుబాటుదారులను విభజించాడు. [4] ఈ వర్గాలు కనీసం ఒక్కసారైనా ఘర్షణ పడ్డాయి. వారి సైనిక వ్యూహాలు పరస్పరం విరుద్ధంగా ఉంటూ, యుద్ధాలను ప్రభావితం చేసాయి. [4] ఫిరాయింపులు చాలా సాధారణమైనవి. [4] అయితే, ఆ విభేదాలను తాము ఎలాంటి ప్రయోజనాలకూ ఉపయోగించుకోలేమని అంతర్గత నిఘా నివేదికల ద్వారా బ్రిటిష్ అధికారులకు తెలిసింది. [4]

1858 ఫిబ్రవరి చివరలో కాంప్‌బెల్ లక్నోలో ముందడుగు వేసాడు. మార్చి 16 నాటికి, తీవ్రమైన వీధి-యుద్ధాల తరువాత, బ్రిటిషు దళాలు లక్నోను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. బేగం, ఆమె మద్దతుదారులు, ఖాదర్ నగరం విడిచి వెళ్ళవలసి వచ్చింది. [4] క్యాంప్‌బెల్ తప్పించుకునే మార్గాలను మూసెయ్యడంలో విఫలమయ్యాడు. తిరుగుబాటుదారులు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లారు. దానర్థం, లక్నో పతనమైనంత మాత్రాన, అవధ్ రాజ్యం లొంగిపోలేదు. [4]

బేగం హజ్రత్ బ్రిటిషు వాళ్ళిచ్చిన క్షమాపణ, పింఛను అవకాశాన్ని తిరస్కరించింది. తద్వారా ఆమె తన కుమారుడి రాజ్యాధికార హక్కులను వదులుకోడానికి నిరాకరించింది. [1] వారు బౌండి గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళిపోయారు. [4] ముఖ్యంగా, లక్నో పతనంతో మౌల్వీ వర్గం నాశనమై పోగా, బేగం హజ్రత్ మాత్రం స్థానిక కోట నుండి తన పూర్వ పాలనను కొనసాగించింది: శిస్తు సేకరించడం, దర్బారునిర్వహించడం, ఖాదర్ పేరుతో ఆదేశాలు జారీ చేయడం చేసింది. [4] వారు తిరుగుబాటు దళాలను సమీకరించడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా మరో సాయుధ పోరాటానికి ప్రణాళిక వేశారు. [4] స్థానికంగా బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేయడానికి పిలుపునిచ్చారు. యుద్ధంలో గాయపడిన లేదా మరణించిన వారికి డబ్బులు ఇస్తామని ఖాదర్ హామీ ఇచ్చాడు. [4]

1858 మేలో, ఖాదర్ నేపాల్ ప్రధాన మంత్రి జంగ్ బహదూర్ రాణాకు ఒక లేఖ రాశాడు. బ్రిటిషు వారు రాజ్యం లోని హిందువులు, ముస్లింల విశ్వాసాలను భ్రష్టుపట్టించారని, వారితో పోరాడటానికి సైన్యాన్ని అవధ్‌కు పంపమనీ కోరాడు. [6] రాణా ఈ ఆరోపణలను తిరస్కరించి, ఖాదర్‌కు సహాయం చేయడానికి నిరాకరించాడు. పైగా, లక్నో కమిషనర్ హెన్రీ మోంట్‌గోమేరీ లారెన్స్‌కు లొంగిపోయి క్షమాపణ అడగమని చెప్పాడు. [7]

ఇంతలో, చాలా మంది స్థానిక తిరుగుబాటుదారులు ఓడిపోయారు. బ్రిటిషు వారి శిక్షకు గురయ్యారు. ఖాదర్, బేగం హజ్రత్‌లు పశ్చిమ రప్తి నదిని దాటి నేపాల్‌ పారిపోయి, ఖాట్మండులో ఆశ్రయం పొందారు. [1] [8]

నేపాల్‌లో బహిష్కరణ[మార్చు]

Photograph of Qadr in Calcutta in 1893
కలకత్తాలో 1893 లో తీసిన ఈ అరుదైన ఫోటోలో బిర్జీస్ ఖాదర్ (ఎడమ) కుమారుడు ఖుర్షీద్ ఖాదర్ (కుడివైపు), ముగ్గురు అంగరక్షకులు ఉన్నారు.

ఖాట్మండుకు వచ్చిన తరువాత, ఆశ్రయం కోసం ఖాదర్ మళ్లీ రాణాకు రాశాడు. తొలుత అతడు సంకోచించినప్పటికీ, ఖాదర్‌కు, అతని తల్లికీ ఆశ్రయమిచ్చాడు. థపథలి దర్బార్ సమీపంలోని ప్యాలెస్‌లోని బార్ఫ్ బాగ్‌లో ఉండటానికి అనుమతించాడు. [9] వారితో పాటు సహాయకులు, సైనికుల కోటరీ కూడా వచ్చారు, [10]

అదే సమయంలో రాణా, దాదాపు 40,000 రూపాయల విలువైన వారి ఆభరణాలను కేవలం 15,000 రూపాయలకు కొనుగోలు చేసాడు. [11] అప్పటి నుండి రాణా, తనకు డబ్బు చెల్లించిన తిరుగుబాటుదారులకు మాత్రమే ఆశ్రయం కల్పించాడని, ఈ ప్రక్రియలో విలువైన ఆభరణాలను సంపాదించాడనీ చరిత్రకారులు గమనించారు. [11]

ఖాట్మండులో ఉంటున్నప్పుడు, ఖాదర్ షాయర్ (కవి) అయ్యాడు. నగరంలో మెహఫిల్స్ (కవి సమ్మేళనాలు) నిర్వహించాడు. వీటిలో మొదటివి 1864 లో జరిగినట్లు నమోదు చేయబడ్డాయి. [8] అతను తారాహి ముషైరాల్లో (కవిత్వ పఠనాలు) కవితలు రాశాడు. [8] ఖాదర్ కవితలను ఖాట్మాండులో నివసిస్తున్న కాశ్మీరీ ముస్లిం ఖ్వాజా నయీముద్దీన్ బడకాశీ రికార్డు చేశాడు. [8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నేపాల్‌లో ఉన్నప్పుడు, అతను బహదూర్ షా జాఫర్ మనుమరాలు మెహతాబ్ అరా బేగమ్‌ను వివాహం చేసుకున్నాడు. [12] వారికి ఖుర్షీద్ ఖాదర్, మెహర్ ఖాదర్ అనే ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు. [12] [2]

భారతదేశానికి తిరిగి రాక, మరణం[మార్చు]

1893 లో, తండ్రి మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత, ఖాదర్ కోల్‌కతాకు తిరిగి వచ్చాడు. [8]

అతను 1893 ఆగస్టు 14 న ఆరాబాగ్ ప్యాలెస్‌లో మరణించాడు. [13] అతని మనవడు కౌకాబ్ ఖాదర్ ప్రకారం విందులో అతనికి విషమిచ్చారు. అతని సోదరులు, అసూయపడే బేగమ్‌లు (ఉన్నత స్థాయి మహిళలు) ఈ పని చేసారు. బిర్జీస్ ఖాదర్, అతని కుమారుడు ఇతర అనుచరులు ఆ విందులో మరణించారు. బిర్జీస్ భార్య మెహతాబ్ అరా బేగం మాత్రమే ఆ హత్యలకు సాక్షి. ఆమె గర్భవతిగా ఉన్నందున, ఆ విందుకు హాజరు కాలేదు. [2]

మూలాలు[మార్చు]

 


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు

 1. 1.0 1.1 1.2 Mahmood, Parvez. "The Begum's War". The Friday Times. Retrieved 13 April 2019.[dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "TFT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "TFT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 2. 2.0 2.1 2.2 "As children, we wanted revenge on the British". The Times of India. 30 September 2016. Retrieved 13 April 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "TOI" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. Ghosh, Deepanjan (26 July 2018). "Forgotten history: How the last Nawab of Oudh built a mini Lucknow in Calcutta". Scroll.in. Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.
 4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 4.15 4.16 4.17 4.18 4.19 4.20 4.21 4.22 Mukherjee, Rudrangshu (2002). Awadh in Revolt, 1857–1858: A Study of Popular Resistance (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788178240275. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 5. Safvi, Rana (19 November 2018). "The Forgotten Women of 1857". The Wire. Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.
 6. Jafri2009, p. 101.
 7. Jafri2009, p. 102.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 Gautam, Prawash (9 June 2018). "Birjis Qadr's Kathmandu Mehfil". Kathmandu Post. Archived from the original on 13 April 2019. Retrieved 14 April 2019.Gautam, Prawash (9 June 2018). "Birjis Qadr's Kathmandu Mehfil". Kathmandu Post. Archived from the original on 13 April 2019. Retrieved 14 April 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Nepal" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Nepal" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 9. Jafri2009, p. 103.
 10. "Forgotten in Kathmandu". kathmandupost.com (in English). Retrieved 2021-06-13.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 11. 11.0 11.1 Jafri2009, p. 105.
 12. 12.0 12.1 Rajmohan Gandhi (2009). A Tale of Two Revolts. Penguin. p. 194. ISBN 9788184758252.
 13. Mahmood, Parvez. "The Begum's War". The Friday Times. Retrieved 13 April 2019.[dead link]