బి.దేవేంద్రప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.దేవేంద్రప్ప
జననం3 జూన్ 1899
ఆయనూరు, శివమొగ్గ జిల్లా, మైసూరు రాజ్యం
మరణం1986 జూన్ 6(1986-06-06) (వయసు 87)
వృత్తికర్ణాటక శాస్తీయ సంగీత విద్వాంసుడు
తల్లిదండ్రులుబి.ఎస్.రామయ్య, తులసమ్మ

బి.దేవేంద్రప్ప (1899-1986),మైసూరు మహారాజు జయచామరాజ ఒడయార్ ఆస్థాన సంగీత విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1899లో మైసూరు రాజ్యం (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం), శివమొగ్గ జిల్లా ఆయనూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి బి.ఎస్.రామయ్య కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు. ఇతడు తొలుత తన తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. తరువాత 'తాళబ్రహ్మ' బిడారం కృష్ణప్ప వద్ద గాత్ర సంగీతాన్ని, వీణ సుబ్బణ్ణ, వీణ శేషణ్ణల వద్ద వీణ, వయోలిన్, దిల్‌రుబా, జలతరంగ్ వంటి వాధ్యాలను నేర్చుకున్నాడు. ఇంకా తిత్తే నారాయణ అయ్యంగార్ వద్దకూడా శిక్షణను పొందాడు[1]. ఇతని శిష్యులలో కడూర్ వెంకటలక్షమ్మ వంటి వారున్నారు. 1953లో ఇతడు చైనా దేశంలో పర్యటించి అక్కడ తన ప్రదర్శనలతో దేశాంతర ఖ్యాతిని సంపాదించాడు. ఇతడు రామదూత దాస, దేవేంద్ర ముద్రలతో అనేక సంగీత రచనలు చేశాడు.[2]

అవార్డులు

[మార్చు]

ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక గాత్రసంగీత విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును 1963లో ప్రదానం చేసింది.[3] 1971లో "బెంగళూరు గాయన సమాజ" వారు ఇతనికి సంగీత కళారత్న బిరుదును ప్రదానం చేసింది.[4] మైసూరు విశ్వవిద్యాలయంవారు గౌరవ డాక్టరేటుతో సత్కరించారు. ఇంకా ఇతనికి "గాన విశారద", "రాగాలాపన చతుర", "గానకేసరి", "గాయక సార్వభౌమ" మొదలైన బిరుదులు ఎన్నో ఉన్నాయి[2].

మరణం

[మార్చు]

ఇతడు 1986,జూన్ 6వ తేదీన మైసూరులో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "సంగీత నాటక అకాడమీ సైటేషన్". Archived from the original on 2021-03-04. Retrieved 2021-02-12.
  2. 2.0 2.1 శంకర నారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా-వసంతా ట్రస్టు. p. 139. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 12 February 2021.
  3. "B. Devendrappa - oi". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. Sangeetha Kalarathna Awardees