Jump to content

బి. వెంకట్రామరెడ్డి

వికీపీడియా నుండి
బి. వెంకట్రామరెడ్డి
బి.వెంకట్రామరెడ్డి
జననంబొమ్మిరెడ్డి వెంకట్రామరెడ్డి
1944
మరణంమే 12, 2019 (వయసు 75)
ఇతర పేర్లుబొమ్మిరెడ్డి వెంకట్రామరెడ్డి
ప్రసిద్ధితెలుగు, తమిళ సినీనిర్మాత
పిల్లలుఒక కుమారుడు (రాజేష్), ఇద్దరు కుమార్తెలు (ఆరాధన, అర్చన)
తండ్రిబి.నాగిరెడ్డి

బి. వెంకట్రామరెడ్డి (1944 - మే 12, 2019) భారతీయ చలనచిత్ర నిర్మాత. తమిళ, తెలుగు చిత్రాలను నిర్మించాడు. విజయా హెల్త్‌ సెంటర్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీగా పనిచేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

వెంకట్రామరెడ్డి 1944లో జన్మించాడు. ఇతను బి.నాగిరెడ్డి చిన్న కుమారుడు.[1] ఇతనికి భారతిరెడ్డితో వివాహం జరిగింది.[2] వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సినిమారంగం

[మార్చు]

బి. వెంకట్రామరెడ్డి[3] కొన్నాళ్లు చందమామ పత్రిక నిర్వహణ బాధ్యతలు చూసుకొన్న తరువాత 'చందమామ విజయా కంబైన్స్' పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తొలిచిత్రంగా 1992లో రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బృందావనం అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత నందమూరి బాలకృష్ణ, రోజా జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భైరవ ద్వీపం (1994), శ్రీకృష్ణార్జున విజయం 1996) వంటి తెలుగు సినిమాలు, ఉళైప్పలి (1993), ప్రొఫెసర్ విశ్వం (1997), తామిరభరణి (2007), వీరుడొక్కడే (2014) వంటి తమిళ చిత్రాలను నిర్మించాడు.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

తమిళం

మరణం

[మార్చు]

బి. వెంకట్రామరెడ్డి తన 75 సంవత్సరాల వయసులో 2019, మే 12న చెన్నైలోని స్వగృహంలో మరణించాడు.[6][4][5]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, సినిమా (24 February 2018). "నేటి సినిమాలో శృంగారం తక్కువ.. అంగారం ఎక్కువ". andhrajyothy.com. Archived from the original on 17 September 2020. Retrieved 17 September 2020.
  2. "Film producer dead". The Hindu. 13 May 2019. Retrieved 17 September 2020.
  3. "Film producer Venkatarama Reddy passed away". United News of India. 12 May 2019. Retrieved 17 September 2020.
  4. 4.0 4.1 4.2 "Bhairava Dweepam producer Venkatarami Reddy no more". Telangana Today. 13 May 2019. Retrieved 17 September 2020.
  5. 5.0 5.1 "Producer B Venkatrama Reddy dies at 75 after prolonged illness". The Times of India. 13 May 2019. Retrieved 17 September 2020.
  6. "Veteran producer B Venkatarama Reddy passes away at 75". in.com. 13 May 2019. Archived from the original on 5 డిసెంబరు 2019. Retrieved 17 September 2020.