బి. సంజీవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. సంజీవరావు
బి. సంజీవరావు

బి. సంజీవరావు


తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభ్యుడు
నియోజకవర్గము వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మే 9
గేట్‌వనంపల్లి, నవాబ్‌పేట్‌ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ
మరణం ఫిబ్రవరి 25, 2020
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి మధురవేణి
సంతానము ముగ్గురు కుమార్తెలు (లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని)
మతం హిందూ

బేగరి సంజీవరావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2014లో వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం[మార్చు]

సంజీవరావు మే 9న దేవదాస్, కమలమ్మ దంపతులకు వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్‌ మండలం, గేట్‌వనంపల్లి గ్రామంలో జన్మించాడు. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివాడు.

ఉద్యోగం - కుటుంబం[మార్చు]

గ్రూప్‌–2 ఉద్యోగం సాధించి ఏఓగా పనిచేశాడు. సంజీవరావుకు మధురవేణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని).[2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

రాజకీయాలపై ఆసక్తితో ఉన్న సంజీవరావు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా వికారాబాద్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ. చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు.

1995లో జరిగిన వికారాబాదు పురపాలక సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 3,700 మెజార్టీతో గెలిచి వికారాబాదు పురపాలక సంఘ అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించాడు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరపున ధారూర్ జడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో టీడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలో కొంతకాలం పనిచేశాడు. 2014లో ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ పై 10124 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత సంజీవరావు అనారోగ్యానికి గురవడంతో 2018లో టికెట్‌ రాకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.[3]

1999, 2004 ఎన్నికల్లో సంజీవరావు భార్య మధురవేణి పోటీచేసి రెండుసార్లు ఏ. చంద్రశేఖర్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.

మరణం[మార్చు]

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సంజీవరావు కొద్దిరోజుల క్రితం డయాలసిస్‌ చేయించుకున్నాడు. 2020, ఫిబ్రవరి 24 సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన సంజీవరావును నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. 2020, ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, వికారాబాదు (26 February 2020). "వ్యవసాయాధికారి నుంచి ఎమ్మెల్యే వరకు." Archived from the original on 27 ఫిబ్రవరి 2020. Retrieved 27 February 2020.
  2. ఈనాడు, ప్రధానాంశాలు (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి". google.eenadu.net. Archived from the original on 27 ఫిబ్రవరి 2020. Retrieved 27 February 2020.
  3. సాక్షి, తెలంగాణ (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కన్నుమూత". Archived from the original on 27 ఫిబ్రవరి 2020. Retrieved 27 February 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం". Archived from the original on 27 ఫిబ్రవరి 2020. Retrieved 27 February 2020.