బులుసు సూర్యనారాయణ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.ఎస్.ఎన్.మూర్తి పేరుతో తెలుగు సాహితీ ప్రియులందరికీ పరిచయులైన బులుసు సూర్యనారాయణ మూర్తి మంచి కథకులు. విశాఖపట్టణం లోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్య విద్యనభ్యసించిన తరువాత చిరకాలంగా విజయనగరం జిల్లాలోని సాలూరులో రోగులకు విశిష్ట సేవలందిస్తున్నారు.

మూర్తి గారి కథలు విజయ, గీతాంజలి, జ్యోతి, స్వాతి, ఆహ్వానం, చందమామ, మందాకిని మొదలైన మాసపత్రికలలోను, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, కృష్ణాపత్రిక, స్రవమ్తి, స్వాతి వారపత్రికలలోను, ఈనాడు దినపత్రికలోను ప్రచురించబడ్డాయి. జూలై 2000 సంవత్సరంలో తన కథలలో ఆణిముత్యాలుగా గుర్తించబడిన 36 కథలతో 'గాంధీ మేకు' అనే కథాసంపుటిని జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు ద్వారా పాఠకులకు అందించారు.

సగటు మనిషి జీవితంలోని దారిద్ర్యం, భయం, అజ్ఞానం, నైరాశ్యం, రాజకీయం లాంటి ఇబ్బందులున్నా ప్రేమ, కృషి, ఆశ, హాస్యం లాంటి వాటితో ఊరట చెందే స్నేహవాది డా.మూర్తి. పంతుల జోగారావు, పోతుబరి నారాయణరావు గార్లతో స్నేహం, ప్రోత్సాహం తనను కథకుడిగా నిలబెట్టాయని అంటారీయన.

మూర్తి గారి కథలలో గాంధీమేకు, జీవిత చరిత్రలు, బ్రెయిన్ ఫర్ సేల్, బ్ర బాబాగారి దర్శనం, రంగుల రాట్నం, గదిలో చేమంతి, కాకి-కుక్క, మహానటుడు, జాంగీరు జమా జమా కథలు తప్పక చదవవలసినవి.

మూలాలు[మార్చు]

  • కథా కిరణాలు: మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.