బేతవోలు (చిలుకూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బేతవోలు, నల్గొండ జిల్లా, చిలుకూరు మండలానికి చెందిన గ్రామము. బేతవోలు గ్రామం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని చిలుకూరు మండలంలో ఉంది. బేతవోలు గ్రామము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో కెల్లా పెద్ద గ్రామము. ఈ గ్రామము సూర్యాపేట రెవెన్యూ డివిజన్ క్రిందకు వచ్చును. ఈ గ్రామము కోదాడ శాసనసభ నియోజకవర్గం మరియు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం క్రిందకు వచ్చును.

బేతవోలు (చిలుకూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం చిలుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి తాళ్ళూరి పద్మ
జనాభా (2011)
 - మొత్తం 15,257
 - పురుషుల సంఖ్య 7,629
 - స్త్రీల సంఖ్య 7,628
 - గృహాల సంఖ్య 4,292
పిన్ కోడ్ 508204
ఎస్.టి.డి కోడ్ 08683

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 15,257 - పురుషుల సంఖ్య 7,629 - స్త్రీల సంఖ్య 7,628 - గృహాల సంఖ్య 4,292

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

ఆదాయ వనరులు[మార్చు]

బేతవోలు గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంద కూలీ పనులు. ఈ గ్రామంలో ప్రధాన వ్యవసాయ పంట వరి. ఈ గ్రామంలో పండించిన వరి ధాన్యానికి మంచి ధర లభించును. ఇక్కడ పండించిన ధాన్యం ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరమునకు ఎగుమతి అగును. గ్రామంలోని రైతులు వ్యవసాయం ద్వారానే కాక పాలు, కూరగాయలు అమ్మటం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటారు. గ్రామంలో 5 పాల కేంద్రాలు ఉన్నాయి. ఈ గ్రామం యొక్క రెవెన్యూ మండలంలోని మిగతా గ్రామాలన్నింటి కన్నా ఎక్కువ.

గ్రామంలో రెండు చెరువులు ఉండటం వలన బెస్త వారు (గంగపుత్రులు)చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పెంచి అమ్ముకొనుటకు ప్రభుత్వం చెరువుని లీజుకి ఇస్తుంది. ఈ చెరువులో ఇలా పెంచి పట్టిన చేపలను కోల్‌కతా (కలకత్తా) నగరానికి ఎగుమతి చేస్తారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును 'వీర్లదేవి చెరువు' అని అంటారు. వీర్లదేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుచున్నది. చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుచున్నది. కానీ ప్రస్తుతం దీనిని రైతులు ఆక్రమించుట వలన విస్తీర్ణం కుచించుకు పోయింది. దీంతో ఎపుడూ నిండుకుండలా ఉండే బేతవోలు పెద్దచెరువు ప్రస్తుతం.. వట్టిపోయింది పైగా దీని చుట్టూ వందల సంఖ్యలో మోటార్లు పెట్టడం వల్ల నీరు అడుగంటి పోతోంది

మౌళిక సదుపాయాలు[మార్చు]

బేతవోలులో దాదాపు ప్రధాన వీధులన్నీ సిమెంటు వీధులుగా మార్చబడ్డాయి. సిమెంటు వీధులుగా మార్చిన వీధులు పెద్ద బడి నుండి చెన్నారి గూడెం మలుపు వరకు, గ్రామ పంచాయతి నుండి తోట వరకు, దేవాలయం వీధి, సాలె బజారు, గడీ బజారు, గౌండ్ల బజారు, గుర్రం బజారు.గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అమలులో ఉంది. గ్రామంలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిల సౌకర్యం కల్పించటం కూడా జరిగింది. గ్రామంలో మురుగు నీరు పోవుటకు కాలువలు ఉన్నాయి.

విద్య మరియు విద్యాలయాలు[మార్చు]

బేతవోలు గ్రామంలో సగానికి పైగా ప్రజలు చదువుకున్నవారే. ఈ గ్రామస్థులు చాలామంది వివిధ ఉద్యోగాలలో చేరి రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గ్రామస్థులు సాఫ్ట్‌వేర్, మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి ప్రైవేట్ ఉద్యోగాలు పోలీసు, ఉపాధ్యాయ, అధ్యాపక వంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. బేతవోలు గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రైవేటు ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రభుత్వ ప్రాథమిక విద్యా పాఠశాల, ఐదు ప్రైవేటు ప్రాథమిక విద్యా పాఠశాలలు మరియు ఒక అంగన్ వాడి పాఠశాల ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద తెలుపబడినవి. వీటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించి సుమారు 39 సంవత్సరములు అయినది. ఈ పాఠశాల మొదట అప్పర్ ప్రైమరీ స్కూల్ గా ప్రారంభమైంది. ఈ పాఠశాల ప్రారంభించటానికి కృషి చేసిన వ్యక్తులలో ముఖ్యమైన వారు అంకతి సత్యనారాయణ.

  1. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
  2. ప్రతిభ ఉన్నత పాఠశాల
  3. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
  4. ప్రతిభ ప్రాథమిక పాఠశాల
  5. త్రీ ఏంజిల్స్ స్కూల్ (ఆంగ్ల మాధ్యమం)

దేవాలయములు[మార్చు]

బేతవోలు గ్రామంలో రామాలయం, శివాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కనక దుర్గ ఆలయం, ముత్యాలమ్మ గుళ్లు ఉన్నాయి. బేతవోలు గట్టు మీద నరసింహ స్వామి ఆలయం, గుట్ట దగ్గర ముత్యాలమ్మ ఆలయం ఉంది. రామాలయం ప్రక్కన సాయిబాబా గుడి కూడా ఉంది. రామాలయం నిర్మాణం జరిగి దాదాపు 500 సంవత్సరములు దాటింది.ఇది పూర్తిగా రాతితో కట్టబడింది. ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు మూడు మసీదులు, మూడు చర్చిలు కూడా ఉన్నాయి. అయితే శివాలయం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉంది. ఈ భూముల సాగు ద్వారా వస్తున్న ఆదాయంతో.. ఆ కుటుంబ సభ్యులు.. ఇపుడు కోట్లకు పడగెత్తారు అంతేకాదు ఆ ఆలయానికి ఎదురుగానే భారీ భవంతులు కూడా నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం గురించి గానీ లెక్కపత్రాల గురించి గానీ పట్టించుకునే నాథుడే లేడు., ఆకుటుంబం వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది

పండుగలు[మార్చు]

అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, శివరాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహాశివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ముక్కోటి ఏకాదశికి రామాలయంలో 24 గంటల హరే రామ సంకీర్తన చేస్తారు. శ్రీ రామ నవమికి శ్రీరాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు. మహాశివ రాత్రికి శివాలయంలో శివుని కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును.

దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు. బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను పళ్లెంపై గుండ్రంగా పేరుస్తూ పైకి వెళ్లిన క్రొద్దీ వ్యాసం తగ్గిస్తూ పేర్చుతారు. ఇలా పేర్చిన పూలని బ్రతుకమ్మ అని అంటారు. ఇలా అందరూ చేసిన బ్రతుకమ్మలను ఒక చోట ఉంచి దాని చుట్టూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ తిరుగుతారు. ఈ ఆటను మహిళలు మాత్రమే ఆడుతారు. ఈ ఆటను పెళ్ళిల్లు కాని అమ్మాయిలు కూడా ఆడుతారు. మొదటి రోజు నుండి రోజుకి కొంత ఎత్తు చొప్పున బ్రతుకమ్మ ఎత్తును పెంచుతూ తొమ్మిదవ రోజుకి చేరుకొనే సరికి బ్రతుకమ్మ పెద్దగా అవుతుంది. తొమ్మిదవ రోజున ఎవరు పెద్ద బ్రతుకమ్మను చేస్తారు అని ఊరి జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఈ బ్రతుకమ్మ పండుగను కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుపుకొంటారు. హిందువుల పండుగలే కాక ముస్లిం సోదరులురంజాన్, ఈద్-ఉల్-ఫితర్ లను క్రైస్తవ సోదరులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లను జరుపుకొంటారు.

రహదారులు[మార్చు]

ఈ గ్రామం మండల కేంద్రమైన చిలుకూరుకు 7 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామమును కోదాడ-మిర్యాలగూడ రాష్ట్ర రహదారికి కలుపుతూ 6 కి.మీ.ల మేర తారు రహదారి ఉంది. ఈ గ్రామము నుండి జెర్రి పోతుల గూడెం, చెన్నారి గూడెంలకు తారు రహదారులు, పోలేని గూడెంనకు ఇటీవలే తారురోడ్డు వేశారు దీంతో కోదాడ ఆకుపాముల మునగాల కోదాడకు వెళ్లడానికి దూరం కూడా తగ్గింది

గ్రామ సరిహద్దులు[మార్చు]

బేతవోలు గ్రామమునకు తూర్పున వీర్ల దేవి చెరువు.

పడమరన చిన్న చెరువు.

వాయువ్యమున చెన్నారి గూడెం, ఆచార్యుల గూడెం గ్రామాలు.

నైఋతిన జెర్రి పోతుల గూడెం.

ఆగ్నేయమున బేతవోలు గట్టు.

ఈశాన్యమున కొండాపురం.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 15,257 - పురుషుల సంఖ్య 7,629 - స్త్రీల సంఖ్య 7,628 - గృహాల సంఖ్య 4,292


భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు