Jump to content

బొంత జెముడు

వికీపీడియా నుండి

బొంత జెముడు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
E. antiquorum
Binomial name
Euphorbia antiquorum
బొంతజెముడు

బొంతజెముడు ఒక ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయనామం యుఫోర్బియా యాంటికోరం (ఆన్టిక్ యుఫోర్బియా). ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆంధ్రప్రదేశ్‍లోని కొండ దిగువ ప్రాంతాలైన గలసనేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టును గీరినప్పుడు తెల్లని పాలు కారుతాయి. ఇది కొమ్మలు కొమ్మలుగా పైకి ఎదుగుతుంది. ఇది పైకి ఎదిగేకొలది కింది కొమ్మలు రాలిపోతుంటాయి. ఈ చెట్టు ముళ్ళను కలిగి ఉంటుంది. ఈ చెట్టు కాండం, త్రిభుజాకారంలో ఉండే ఆకుల వంటి కొమ్మలు చాలా మృదువుగా ఉంటాయి. ఇది అడవి ప్రాంతాలలో కనిపించే ఒక అందమైన చెట్టు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

నాగ జెముడు

భారతీయ నాగజెముడు

బ్రహ్మజెముడు

సన్న జెముడు

బయటి లింకులు

[మార్చు]