Jump to content

బొల్లి లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
బొల్లి లక్ష్మీనారాయణ
జననంఏప్రిల్‌ 15, 1944
మరణంఫిబ్రవరి 23, 2018
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత, అనువాదకుడు, చిత్రకారుడు, నాటకకర్త

బొల్లి లక్ష్మీనారాయణ (ఏప్రిల్‌ 15, 1944 - 2018 ఫిబ్రవరి 23) ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, చిత్రకారుడు, నాటకకర్త.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

లక్ష్మీనారాయణ 1944, ఏప్రిల్‌ 15న మహారాష్ట్ర లోని షోలాపూర్లోని చేనేత కుటుంబంలో జన్మించాడు. ఈయన పూర్వీకులు సిద్ధిపేట జిల్లా, బెజ్జంకి మండలం, గుండారం గ్రామానికి చెందినవారు. మరాఠీ మాధ్యమంలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

మరాఠి మాధ్యమంలో చదువుకున్న లక్ష్మీనారాయణ తెలుగు భాషపై పెంచుకున్న అభిమానంతో తెలుగు నేర్చుకోవడమేకాకుండా, తెలుగు సాహిత్యాన్ని విరివిగా చదివాడు. మరాఠీ సాహిత్యంలో అగ్రశ్రేణి రచయితగా పేరుపొందిన లక్ష్మినారాయణ సాహిత్యాన్ని మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న లక్ష్మినారాయణ రచనలు ఎంఏ విద్యార్థులకు బోధనాంశాలుగా ఉన్నాయి.

మరాఠీలో రచనలు చేస్తూనే తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. 'బాలభారతి తెలుగు పాఠ్యపుస్తక సమితి'ను స్థాపించి, అధ్యక్షుడిగా ఉంటూ మహారాష్ట్రలో తెలుగు పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం ఉద్యమించి విజయం సాధించాడు. అంతేకాకుండా 'తెలుగు భాషా రక్షణ సమితి'ని కూడా స్థాపించాడు. పూణే విద్యాపీఠం, ముంబై సాహిత్య అకాడమీ, గోవా విద్యాపీఠం, కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వంటి పలు విద్యాలయాల్లో ఈయన రచనలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సన్మానించారు.

రచనలు

[మార్చు]

లక్ష్మీనారాయణ 28 గ్రంథాలు వెలువరించాడు.

స్వంత రచనలు

  1. తెలుగు ఫూలాంచే మరాఠీ సుగంధ్‌ (తులనాత్మక గ్రంథం)
  2. ఏక్‌ శాల్యానే.. (ఆత్మకథాశ్రిత గ్రంథం)
  3. మైఫల్‌
  4. ఝుంబర్‌
  5. సావ్‌లీ
  6. విరహిణి వాసవదత్త
  7. గవాక్ష్‌
  8. లక్ష్మినారాయణ బొల్లిచ్యా కవిత
  9. గవ్‌తాచే ఫూల్‌
  10. గీత్‌ మార్కండేయ
  11. కవిరాయ రామ్‌జోషి
  12. దక్షిణ్‌ భాషేతీల్‌ రామాయణే
  13. కృష్ణదేవరాయ
  14. కవితేచా ఆత్మస్వర్‌ దత్తా హల్‌సగీకర్‌
  15. షిరిడి సాయిబాబా అనుభవ రహస్య్‌
  16. షిరిడి సాయిబాబా సేవా రహస్య్‌
  17. శ్రీ అమ్మ భగవాన్‌
  18. శ్రీ సాయి చరిత్ర పోథీ

అనువాద రచనలు

  1. అభంగ్‌ కలశ్‌
  2. పంచపది (సినారె పంచపదులు)
  3. రాత్ర్‌ ఏకా హౌడిత్‌లీ
  4. ఏకా పండితాచ్యే మృత్యుపత్ర్‌
  5. సంత్‌కవి వేమన
  6. యకృత్‌
  7. కమలపత్ర్‌
  8. రాజర్షి షాహూ ఛత్రపతి
  9. రాత్రీచా సూర్య్‌ (ప్రముఖ కవి జగదీశ్‌ కేరె రాత్రి సూర్యుడు)
  10. స్వర్‌ లయ
  11. శ్రీపాద వల్లభ
  12. కవిరత్న కాళిదాస్‌ (చరిత్రాత్మక నవల)

మరణం

[మార్చు]

ఈయన 2018, ఫిబ్రవరి 23న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ, దర్వాజ, స్టోరి (26 February 2018). "తెలుగు మరాఠీ భాషల వారథి". సంగెవేని రవీంద్ర. Retrieved 26 February 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]