బోట్ గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడలో గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బోట్ లైబ్రరీ నడిపారు. ప్రజలకు పుస్తకపఠణం, గ్రంథాలయాల మీద ఆసక్తి పెరగాలనే ఆలోచన దీని ప్రారంభానికి నాంది పలికింది.

ప్రారంభం[మార్చు]

బోటు గ్రంథాలయ ప్రారంభ ఉత్సవం పెదపాలెం వద్ద మొదలుపెట్టారు. అక్కడ కల ఆర్యబాల సమాజంలో పూజలు నిర్వహించారు. సేవాశ్రమవాణీ మందిరం నుండి సంచార గ్రంథాలయ పెట్టెలను ఊరేగించారు. ఈ ఉత్సవంలో పెద్దలు, గ్రామ ప్రముఖులు, చుట్టు ప్రక్కల గ్రామాల వారు పాల్గొన్నారు. కాలువ వాద సభ నిర్వహించి ప్రముఖుల ఉపన్యాసాల అనంతరం గ్రంథాల పెట్టెలను బోటులో అమర్చారు.

ఈ గ్రంథాలయం కృష్ణా బ్యాంక్ కాలువ గుండా పెదవడ్లపూడి నుండి కొల్లూరుల మద్య తిప్పేవారు. రేవులలో ఆగుతూ పాఠకులకు పఠనా సౌకర్యాన్ని కలిగించేవారు.

పాలొన్న ప్రముఖులు[మార్చు]

దీని ఆలోచనకు అమలుకు కృషిచేసిన వారు పాతూరి నాగభూషణం గారు. ఆర్యబాల సమాజం, సేవాశ్రమవాణీ మందిరంల సహకారంతో బొట్ గ్రంథాలయాన్ని ప్రారంభింపజేసారు. కాలువ వడ్డున సభ సభ జరిగిన అనంతరం గుంటూరు గ్రంథాలయ అద్యక్షులు శరణు రామస్వామి చౌదరి గారి చేతుల మీదుగా అక్టోబరు 1935లో దీనిని ప్రారంబించారు.

సేవలు[మార్చు]

ఈ గ్రంథాలయం విశేష ప్రాచుర్యం పొందటంతో ఇలాంటి మరొక గ్రంథాలయాన్ని నవంబరు 15 వతేదీన పెదవడ్లపూడి మరియు పిడపర్రు గ్రామాల నడుమ ప్రారంభించారు.

మూలాలు, బయటి లింకులు[మార్చు]