బోరాన్ సబాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోరాన్ సబాక్సైడ్
పేర్లు
IUPAC నామము
Boron suboxide
ఇతర పేర్లు
Hexaboron monoxide
ధర్మములు
B6O
మోలార్ ద్రవ్యరాశి 80.865 g/mol
స్వరూపం Reddish icosahedral twinned crystals
సాంద్రత 2.56 g/cm
ద్రవీభవన స్థానం 2,000 °C (3,630 °F; 2,270 K)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Rhombohedral, hR42
R3, No. 166[1]
a = 0.53824 nm, b = 0.53824 nm, c = 1.2322 nm
α = 90°, β = 90°, γ = 120°
6
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

'బోరాన్ సబాక్సైడ్' ఒక ఆకర్బన రసాయన సమ్మేళనం.బోరాన్, ఆక్సిజన్ మూలక పరమాణువుల సంయోగ ఫలితంగా ఏర్పడినది.ఈ సంయోగ పదార్థ రసాయనిక ఫార్ములా B6O.ఈ సంయోగపదార్ధం ఎక్కువ ఉష్ణవాహక గుణం, ఎక్కువ రసాయనిక జడత్వము, దృఢత్వం/గట్టి దనం కల్గి ఉంది.దీని దృఢత్వం రోనియం డై బోరైడ్, బోరాన్ నైట్రైడు లకు ఇంచు మించు సమానంగా వుండును.

ఉత్పత్తి

[మార్చు]

బోరాన్ ట్రైఆక్సైడ్‌ను బోరానుతో క్షయించి బోరాన్ సబాక్సైడ్‌ను ఉత్పత్తి చేయుదురు.లేదా బోరాన్‌ను జింక్ ఆక్సైడ్ లేదా ఇతర ఆక్సైడ్‌లతో ఆక్సికరించడం ద్వారా కూడా ఉత్పత్తి చెయ్యవచ్చును[2].అయితే ఈ రకపు బోరాన్ సబాక్సైడ్‌లు పరిసర వాతావరణ పీడనం వద్ద ఏర్పడం వలన సాధారణంగా ఆక్సిజన్ కొరత/oxygen deficient కల్గివుండును (B6Ox, x<0.9), స్పటికరణ అసంపూర్ణంగా చిన్న గింజల వలే (5 µmకన్నా తక్కువ). వుండును.అధిక పీడనం వద్ద ఉత్పత్తి కావించిన స్పటికరణ మెరుగ్గావుండ్ను, ఆక్సిజన్ కొరత వుండదు.బోరాన్, బోరాన్ ట్రై ఆక్సైడ్ పదార్థాల మిశ్రమాన్ని, బోరాన్ సబాక్సైడ్ ఉత్పత్తి, సంశ్లేషణ ప్రక్రియల్లో ప్రారంభ పదార్థాలుగా వినియోగిస్తారు.

భౌతిక ధర్మాలు

[మార్చు]
Atomic structure and electron micrographs of ideal (top) and twinned (bottom) B6O. Green spheres are boron, red spheres are oxygen.[3]

భౌతిక రూపం

[మార్చు]

బోరాన్ సబాక్సైడ్ రసాయన సంయోగ పదార్థం ఎర్రటి స్పటికరూపంలో ఉండును.

అణుభారం

[మార్చు]

బోరాన్ సబాక్సైడ్ యొక్క అణుభారం 80.865 గ్రాములు/మోల్

సాంద్రత

[మార్చు]

బోరాన్ సబాక్సైడ్ యొక్క సాంద్రత 2.56 గ్రాములు/సెం.మీ3[4]

బోరాన్ సబాక్సైడ్ పదార్థం ద్రవీభవన స్థానం 2,000 °C (3,630 °F;2,270K) [4]

బోరాన్ సబాక్సైడ్ బలమైన సమయోజనీయ స్వభావాన్ని పొందివున్నది.ఈ సంయోగ పదార్ధం తక్కువ సాంద్రత ఎక్కువ గట్టిదనం/కఠినత్వం వంటి ఉత్తమ గుణాలను కల్గిఉన్నది.అలాగే ఎక్కువ యాంత్రిక దృఢత్వం, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆక్సీకరణ నిరోధతత్వం, అధిక రసాయనిక జడత్వము వంటి విశిష్ట గుణాలను కల్గిఉన్నది.

వినియోగం

[మార్చు]

బోరాన్ సబాక్సైడ్ విశిష్ట శక్తివంతమైన లక్షణాలు దీని కఠినత్వం, అరుగుదలను నిరోధించు లక్షణం.అందుచే దీనినిహైస్పీడ్ కటింగ్ పరికరాల ఉపరితలం మీద అరుగుదలను నిరోధించు పూతగా ఉపయోగిస్తారు.అలాగే అరుగ దీయు (ఒరపిడి ) పదార్థాలలో, అధిక అరుగుదల కల్గినచోట అరుగుదల నిరోధకంగా వాడెదరు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. Olofsson, Malin; Lundström, Torsten (1997). "Synthesis and structure of non-stoichiometric B6O". Journal of Alloys and Compounds. 257: 91. doi:10.1016/S0925-8388(97)00008-X.
  2. "Boron suboxide". revolvy.com. Retrieved 2017-05-02.
  3. An, Qi; Reddy, K. Madhav; Qian, Jin; Hemker, Kevin J.; Chen, Ming-Wei; Goddard Iii, William A. (2016). "Nucleation of amorphous shear bands at nanotwins in boron suboxide". Nature Communications. 7: 11001. doi:10.1038/ncomms11001. PMC 4804168. PMID 27001922.
  4. 4.0 4.1 "Boron Suboxide". diracdelta.co.uk. Archived from the original on 2017-05-02. Retrieved 2017-05-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)