బోరాన్ ట్రైఫ్లోరైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోరాన్ ట్రైఫ్లోరైడ్
Boron trifluoride in 2D
Boron trifluoride in 3D
పేర్లు
ఇతర పేర్లు
Boron fluoride, Trifluoroborane
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7637-07-2]
పబ్ కెమ్ 6356
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-569-5
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:33093
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య ED2275000
SMILES FB(F)F
ధర్మములు
BF3
మోలార్ ద్రవ్యరాశి 67.82 g/mol (anhydrous)
103.837 g/mol (dihydrate)
స్వరూపం colorless gas (anhydrous)
colorless liquid (dihydrate)
సాంద్రత 0.00276 g/cm3 (anhydrous gas)
1.64 g/cm3 (dihydrate)
ద్రవీభవన స్థానం −126.8 °C (−196.2 °F; 146.3 K)
బాష్పీభవన స్థానం −100.3 °C (−148.5 °F; 172.8 K)
exothermic decomposition [1] (anhydrous)
very soluble (dihydrate)
ద్రావణీయత soluble in benzene, toluene, hexane, chloroform and methylene chloride
బాష్ప పీడనం >50 atm (20°C)
ద్విధృవ చలనం
0 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1137 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
254.3 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 50.46 J/mol K
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము ICSC 0231
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు Press. GasAcute Tox. 2Skin Corr. 1A
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H330, H314
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R14, R26, R35
S-పదబంధాలు (S1/2), S9, S26, S28, S36/37/39, S45
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
1227 ppm (mouse, 2 hr)
39 ppm (guinea pig, 4 hr)
418 ppm (rat, 4 hr)[2]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
C 1 ppm (3 mg/m3)
REL (Recommended)
C 1 ppm (3 mg/m3)
IDLH (Immediate danger)
25 ppm
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Aluminium fluoride
Gallium(III) fluoride
Indium(III) fluoride
Thallium(III) fluoride
సంబంధిత సమ్మేళనాలు
Boron monofluoride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is ☑Y☒N ?)
Infobox references

బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.బోరాన్ మరియు ఫ్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన వాయు సమ్మెళన పదార్ధం.ఇది రంగులేని విష పూరిత వాయువు[4].దీని రసాయన ఫార్ములా BF3.తడివున్న గాలిలోఈ సంయోగ పదార్ధం తెల్లని పొగలను వెలువరించును.ఇది ప్రయోజనకరమైన లేవిస్ ఆమ్లం(Lewis acid).ఇతర బోరాన్ సంయోగ పదార్థాల ఉత్పత్తిలో బోరాన్ ట్రైఫ్లోరైడ్‌కు కీలకమైన పాత్ర కలదు.

ఆవిష్కారం[మార్చు]

కి.శ.1808 లో జోసెప్ లోవిస్ లుస్సాక్ మరియు లోవిస్ జాక్సిష్ థెనార్డ్(Joseph Louis Gay-LussacమరియుLouis Jacques Thénard,)కనుగొన్నారు.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుటకై వారు కాల్సియం ఫ్లోరైడ్ ను అధిక ఉష్ణోగ్రత వద్దగాజు స్థితికి కరిగించినపుడు(vitrified)బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడినది.

అణు నిర్మాణం[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ అణువు త్రికోణాకారపు సమతులనిర్మాణం కల్గివున్నది

సంశ్లేషణ[మార్చు]

హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(HF) తో బోరాన్ ఆక్సైడ్ రసాయనచర్య వలన బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడును.

→

సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు ఫ్లోరైట్((CaF2)రసాయన చర్య వలన కుడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉత్పత్తి అగును. సంవత్సరానికి అందాజుగా 2300-4500టన్నుల బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉత్పత్తి చేయబడు చున్నది. ప్రయోగ శాలల్లో,పరిశోధన శాలల్లో డైజోనియం(diazonium)లవణాలను ఉష్ణవియోగం చెందించడం ద్వారా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉత్పత్తి చేస్తారు.

→

ప్రత్నామ్యాయంగా సోడియం టెట్రాఫ్లోరోబోరేట్,బోరాన్ ట్రైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లాల నుండి సంశ్లేషణ చేస్తారు.

6 NaBF4 + B2O3 + 6 H2SO4 → 8 BF3 + 6 NaHSO4 + 3 H2O

భౌతిక ధర్మాలు[మార్చు]

నిర్జల/అనార్ద్ర బోరాన్ ట్రైఫ్లోరైడ్ బాష్పీభవన స్థానం/ఉష్ణోగ్రత −100.3 C.మరియు క్లిష్టఉష్ణోగ్రత −12.3 C.దీనిని అందువలన ఈ రెండు ఉష్ణోగ్రతల మధ్య శీతలికరణ ద్రవస్థితిలో నిల్వ ఉంచవలయును.అలాగే దీనిని ఎక్కడికైనా రవాణా చేయునపుడు,వాహనాన్ని దీని యొక్క అంతర్గతవత్తిడిని నిలువరించు విధంగా రూపకల్పన చేయవలెను.ఎందుకనగా ఈ రసాయనాన్ని వుంచిన శీతలీకరణపరికరం విపలమైన,ఈ రసాయన పదార్ధం వత్తిడి క్లిష్టవత్తిడి 49.85బార్(4.985 MPa)కు చేరును.బోరాన్ ఫ్లోరైడ్ పదార్థాలను క్షయించు గుణం(పదార్థాలను కరిగించి,తిను గుణం)కల్గి ఉన్నది.

తేమసమక్షంలో ఇది ఉక్కు,తుప్పుపట్టని ఉక్కు/స్టెయిన్‌లెస్‌స్టీల్ లోహాలను తినివేయును.ఇది పాలి అమైడులతో,పాలి టెట్రాఫ్లోరోఇథైలిన్, polyvinylidene fluorideలతో రసాయన చర్య జరుపును

అణుభారం[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ రసాయన పదార్థం అణుభారం :67.81 గ్రాములు/మోల్[5]

ద్రవీభవన ఉష్ణోగ్రత[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం:-196.1°F(-127°C)[4]

బాష్పీభవన ఉష్ణోగ్రత[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క మరుగు/బాష్పీభవన స్థానం:-148°F(−100.3°C) [4]

సాంద్రత[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క వాయు స్థితి సాంద్రత:3.07666 గ్రాములు/లీటరు (ప్రామాణీక వత్తిడి,ఉష్ణోగ్రతలవద్ద).ద్రవస్థితిలో సాంద్రత1.57 గ్రాములు/సెం.మీ3(100.4°C)[4]

రసాయన చర్యలు[మార్చు]

అల్యూమినియం ,గాలియం ట్రై హైలైడుల కాకుండా బోరాన్ ట్రైహాలైడులు అన్ని మోనోమెరిక్(monomer)పదార్థాలు.ఇవి వేగంగా హలైడు మార్పిడి చర్యను జరుపును.

BF3 + BCl3 → BF2Cl + BCl2F

ఈ పరస్పర హాలైడ్ మార్పిడి చర్య కారణంగా ఈమిశ్రమ హలైడులను శుద్ధరూపంలో పొందలేము. బోరాన్ ట్రై ఫ్లోరైడ్ విభిన్నమైన లేవిస్ ఆమ్లం. లేవిస్ క్షరాలతో చర్యల వలన సంక్లిష్ట సంయోగ పదార్థాలైన adducts ను ఏర్పరచును.

CsF + BF3 → CsBF4
O(C2H5)2 + BF3 → BF3O(C2H5)2

జలవిశ్లేషణ[మార్చు]

బోరాన్ ట్రైఫ్లోరైడ్ నీటితో జరిపే జలవిశ్లేషణ చర్య(Hydrolysis)వలన బోరిక్ ఆమ్లం మరియు ఫ్లోరోబోరిక్ ఆమ్లం ఏర్పడును.ఈ చర్యలో మొదట అక్వో అడక్ట్(aquo adduct) అయిన H2O-BF3 ఏర్పడును.ఇది HF ను కోల్పోయి బోరాన్ ట్రై ఫ్లోరైడ్ తో ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.

4 BF3 + 3 H2O → 3 HBF4 + "B(OH)3"

Adduct అనగా రెండు సంయోగ పదార్థాల మధ్య అదనపు సంకలన చర్య వలన ఏర్పడిన రసాయన పదార్ధం

వినియోగం[మార్చు]

సేంద్రియ రసాయన శాస్త్రంలో బోరాన్ ట్రైఫ్లోరైడ్ వినియోగం[మార్చు]

సేంద్రియ సంశ్లేషణలో బోరాన్ ట్రైఫ్లోరైడ్ ను రసాయన కారకం,ముఖ్యంగా లీవిస్ ఆమ్లం(Lewis acid)గా ఉపయోగిస్తారు. లీవిస్ ఆమ్లం అనగా రసాయనపదార్థం నుండి(దాత)రింగు/జంట/జత ఎలక్ట్రానులను స్వికరించునది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఇవికూడా చూదండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. http://www.nap.edu/openbook.php?record_id=4911&page=266
  2. "Boron trifluoride". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. http://www.newenv.com/resources/nfpa_chemicals
  4. 4.0 4.1 4.2 4.3 "BORON TRIFLUORIDE". pubchem.ncbi.nlm.nih.gov. https://pubchem.ncbi.nlm.nih.gov/compound/boron_trifluoride#section=Odor. Retrieved 27-04-2017. 
  5. "Boron trifluoride". sigmaaldrich.com. http://www.sigmaaldrich.com/catalog/product/aldrich/295027?lang=en&region=IN. Retrieved 27-04-2017.