బోరిస్ పాస్టర్‌నాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోరిస్ పాస్టర్‌నాక్
పుట్టిన తేదీ, స్థలంబోరిస్ లియోనిడోవిచ్ పాస్టర్‌నాక్
ఫిబ్రవరి 10, 1890
మాస్కో, రష్యన్ సామ్రాజ్యం
మరణంమే 30, 1960
పెరెడెల్కినో, సోవియట్ యూనియన్
వృత్తికవి, రచయిత, అనువాదకుడు
పౌరసత్వంరష్యన్ సామ్రాజ్యం (1890–1917)
సోవియట్ రష్యా (1917-1922) (1917–1922)
సోవియట్ యూనియన్ (1922–1960)
గుర్తింపునిచ్చిన రచనలుమై సిస్టర్, లైఫ్, ది సెకండ్ బర్త్, డాక్టర్‌ జివాగో
పురస్కారాలునోబెల్ బహుమతి (1958)

బోరిస్ పాస్టర్‌నాక్ (ఫిబ్రవరి 10, 1890 - మే 30, 1960) రష్యా దేశానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు. 1957లో బోరిస్ రాసిన డాక్టర్‌ జివాగో నవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చింది.[1]

జననం[మార్చు]

బోరిస్ 1890, ఫిబ్రవరి 10న రష్యన్ సామ్రాజ్యంలోని మాస్కోలో జన్మించాడు.[2] తండ్రి చిత్రకారుడు, తల్లి పియానో విద్వాంసురాలు. తన తల్లి ప్రభావంతో 14వ ఏట నుంచి దాదాపు ఆరేండ్లపాటు సంగీతంను నేర్చుకున్నాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

అల్బేనియా 2015లో విడుదలచేసిన బోరిస్ పాస్టర్‌నాక్ స్టాంప్

సంగీతాన్ని పక్కన పెట్టిన బోరిస్ సాహిత్యం వైపు అడుగులు వేశాడు. గోయిదే, షేక్స్పియర్ రచనలను, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కవితలను రష్యన్ భాషలోకి అనువదించాడు. 1905 కాలపు రష్యా విప్లవానికి, రెండో ప్రపంచ యుద్ధానికి మధ్యకాలంలో జరిగిన రష్యన్ దేశ పరిణామాలను, కమ్యూనిస్టుల పాలనలోని నేతల తీరును, ప్రజల్లోని నైరాశ్యాన్ని, కమ్యూనిస్ట్ స్వర్గంలోని చీకటి కోణాలను ప్రపంచానికి వెల్లడిచేస్తూ 1957లో డాక్టర్ జివాగో నవల రాశాడు. ఈ నవల ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరును తీసుకురావడమేకాకుండా, సినిమాగా కూడా తీయబడింది.

కవిత్వం[మార్చు]

 1. ట్విన్ ఇన్ ది క్లౌడ్స్ (1914)
 2. ఓవర్ ది బారియర్స్ (1916)
 3. థీమ్స్ అండ్ వేరియేషన్స్ (1917)
 4. మై సిస్టర్, లైఫ్ (1922)
 5. ఆన్ ఎర్లీ ట్రైన్స్ (1944)
 6. సెలెక్టెడ్ పోయమ్స్ (1946)
 7. పోయెమ్స్ (1954)
 8. వెన్ ది వెదర్ క్లియర్ (1959)
 9. ఇన్ ది ఇంటర్లీడ్: పోయెమ్స్ 1945-1960 (1962)

ఇతర పుస్తకాలు[మార్చు]

 1. సేఫ్ కండక్ట్ (1931)
 2. సెకండ్ బర్త్ (1932)
 3. ది లాస్ట్ సమ్మర్ (1934)
 4. చైల్డ్ హుడ్ (1941)
 5. సెలెక్టెడ్ రైటింగ్స్ (1949)
 6. సెలెక్టెడ్ వర్క్స్ (1945)
 7. గోథేస్ ఫౌస్ట్ (1952)
 8. ఎస్సే ఇన్ ఆటోబయోగ్రఫీ (1956)
 9. డాక్టర్ జివాగో (1957)

పురస్కారాలు[మార్చు]

బోరిస్‌కు 1958లో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. కానీ రష్యన్ ప్రభుత్వం బోరిస్‌పై ఆంక్షలనుప్రకటించడంతో, బోరిస్ నోబెల్ బహుమతిని తిరస్కరించాడు.

మరణం[మార్చు]

బోరిస్ 1960, మే 30న సోవియట్ యూనియన్ లోని పెరెడెల్కినోలో మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

 1. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (18 February 2019). "బోరిస్ పాస్టర్‌నాక్". మామిడి హరికృష్ణ. Archived from the original on 29 March 2019. Retrieved 29 March 2019.
 2. "Boris Leonidovich Pasternak Biography". Jewishvirtuallibrary.org. Retrieved 29 March 2019.
 3. Ivinskaya (1978), pp 323–326

ఇతర లంకెలు[మార్చు]