Jump to content

బ్రిజేందర్ నాథ్ గోస్వామి

వికీపీడియా నుండి
బి. ఎన్. గోస్వామి
జననం
బ్రిజిందర్ నాథ్ గోస్వామి

(1933-08-15)1933 ఆగస్టు 15
సర్గోధ, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2023 నవంబరు 17(2023-11-17) (వయసు 90)
చండీగఢ్, భారతదేశం
వృత్తికళా చరిత్రకారుడు, విమర్శకుడు
జీవిత భాగస్వామికరుణా గోస్వామి
పిల్లలు1 కుమార్తె; 1 కుమారుడు
తల్లిదండ్రులుబి. ఎల్. గోస్వామి
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
పద్మభూషణ్ పురస్కారం
విద్యా నేపథ్యం
చదువుకున్న సంస్థలుపంజాబ్ విశ్వవిద్యాలయం
పరిశోధక కృషి
పనిచేసిన సంస్థలుపంజాబ్ విశ్వవిద్యాలయం
మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్.

బ్రిజేందర్‌ నాథ్‌ గోస్వామి (ఆంగ్లం:B. N. Goswamy; 1933 ఆగష్టు 15 - 2023 నవంబరు 17) భారతీయ కళా విమర్శకుడు, విఖ్యాత చిత్రకళ చరిత్రకారుడు. కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్‌ను నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సారాభాయ్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్.[1] పహారీ పెయింటింగ్,[2] ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్‌[3]పై పాండిత్యానికి ఆయన ప్రసిద్ధి చెందాడు.

ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు శక్తి బర్మన్ జీవితం, రచనలపై మోనోగ్రాఫ్, శక్తి బర్మన్: ఎ ప్రైవేట్ యూనివర్స్,[4], మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్ 1100 -1900, భారతీయ సూక్ష్మ కళపై ఒక గ్రంథం[5] ఇలా ఆయన కళలు, సంస్కృతిలపై 20కి పైగా పుస్తకాలు రచించాడు.[6]

భారత ప్రభుత్వం అతనికి 1998లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది, దానిని 2008లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో అందించింది.[7]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

బ్రిజేందర్ నాథ్ గోస్వామి 1933 ఆగస్టు 15న బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) సర్గోధాలో జన్మించాడు.[8]

స్థానికంగా హైస్కూల్ చదువు పూర్తిచేసిన ఆయన అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో తన ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. 1954లో పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి బీహార్ కేడర్‌లో పనిచేశాడు. అయితే, తన చదువును కొనసాగించడానికి 1958లో రాజీనామా చేశాడు.[9]

పంజాబ్ యూనివర్శిటీకి తిరిగి వచ్చిన ఆయన 1961లో పీహెచ్‌డీ పొందేందుకు ప్రఖ్యాత చరిత్రకారుడు హరి రామ్ గుప్తా మార్గదర్శకత్వంలో దిగువ హిమాలయాల కాంగ్రా పెయింటింగ్, దాని సామాజిక నేపథ్యంపై పరిశోధన చేశాడు. అతని ఎగ్జామినర్లుగా ఆర్థర్ లెవెల్లిన్ బషమ్, డబ్ల్యూ.జి. ఆర్చర్ ఉన్నారు.[10]

కెరీర్

[మార్చు]

తన పరిశోధన సమయంలో, అతను పంజాబ్ యూనివర్శిటీలో ఆర్ట్ హిస్టరీ ఫ్యాకల్టీగా చేరాడు. అక్కడే ఆయన ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందాడు. 1973 నుండి 1981 వరకు హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్‌లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఆయన కాలిఫోర్నియా, బర్కిలీ, పెన్సిల్వేనియా, జ్యూరిచ్ వంటి అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[11]

పంజాబ్ విశ్వవిద్యాలయంలో, అతను డైరెక్టర్‌గా మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను అభివృద్ధి చేశాడు.[12] మ్యూజియంలో సమకాలీన భారతీయ కళకు సంబంధించి 1200 క్రియేషన్స్ ఉన్నాయి.[13] ఆయన ప్రొఫెసర్ గానే కాకుండా, భారతీయ సంస్కృతిపై విద్యా కార్యక్రమాలలో పాల్గొనే విద్యావేత్తలకు శిక్షణను అందించే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) వైస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. అతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) పాలక కమిటీ సభ్యుడు. చండీగఢ్ లలిత కళా అకాడమీకి కూడా ఆయన అధ్యక్షత వహించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన కరుణ అనే కళా చరిత్రకారిణి, విద్యావేత్త, పంజాబ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ని వివాహం చేసుకున్నాడు.[14] ఈ దంపతులకు ఒక కుమారుడు అపూర్వ, ఒక కుమార్తె మాళవిక ఉన్నారు.

గుర్తింపు

[మార్చు]

బ్రిజేందర్ నాథ్ గోస్వామిని పదవీ విరమణ తరవాత, పంజాబ్ విశ్వవిద్యాలయం అతన్ని ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా చేసింది.[15] ఆయన 1969 నుండి 1970 వరకు జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్[16], 1994లో సారాభాయ్ ఫెలోషిప్‌లను పొందాడు. అలాగే, ఆయన నార్త్ కరోలినాలోని నేషనల్ హ్యుమానిటీస్ సెంటర్‌లో మెల్లన్ సీనియర్ ఫెలో కూడా.

భారత ప్రభుత్వం అతనికి 1998లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది.[17] 2008లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది.[18]

మరణం

[మార్చు]

శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్న 90 ఏళ్ల బ్రిజేందర్‌ నాథ్‌ గోస్వామి చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌- రీసెర్చ్‌ సంస్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 నవంబరు 17న తుదిశ్వాస విడిచాడు.[19]

ఆయన భార్య కళా చరిత్రకారిణి కరుణా గోస్వామి 2020లో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. pp. 413 of 1490. ISBN 9788126008735.
  2. "The master of small things". Times of India. 21 December 2014. Retrieved 25 October 2015.
  3. Sethi, Sunil (5 December 2014). "The big world of miniatures". Business Standard. Retrieved 25 October 2015.
  4. Brijinder Nath Goswamy; Rosa Maria Falva (2015). Rosa Maria Falva (ed.). Sakti Burman: A Private Universe. Skira. p. 216. ISBN 978-8857226194.
  5. Milo Beach; B. N. Goswamy; Eberhard Fischer (2011). Masters of Indian Painting 1100-1900. University of Washington Press. p. 800. ISBN 9783907077504.
  6. "Amazon profile". Amazon. 2015. Retrieved 24 October 2015.
  7. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  8. "Rejecting babudom for the love of art". The Tribune. 9 August 2003. Retrieved 24 October 2015.
  9. "Brijinder Nath Goswamy". Roopinder Singh. 2015. Archived from the original on 20 జూన్ 2017. Retrieved 25 October 2015.
  10. "Rejecting babudom for the love of art". The Tribune. 9 August 2003. Retrieved 24 October 2015.
  11. "Rejecting babudom for the love of art". The Tribune. 9 August 2003. Retrieved 24 October 2015.
  12. Newsletter, East Asian Art and Archaeology, Issues 57-70. University of Michigan Libraries. 1998.
  13. "Department of Art History and Visual Arts". Punjab University. 2015. Retrieved 25 October 2015.
  14. "Rejecting babudom for the love of art". The Tribune. 9 August 2003. Retrieved 24 October 2015.
  15. Sethi, Sunil (5 December 2014). "The big world of miniatures". Business Standard. Retrieved 25 October 2015.
  16. "Official list of Jawaharlal Nehru Fellows (1969-present)". Jawaharlal Nehru Memorial Fund.
  17. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  18. Darpan, Pratiyogita (March 2008). "Padma Bhushan Awardees". Pratiyogita Darpan. 2 (21).
  19. "చిత్రకళా విశ్లేషకుడు గోస్వామి అస్తమయం |". web.archive.org. 2023-11-18. Archived from the original on 2023-11-18. Retrieved 2023-11-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)