భారత ప్రభుత్వ ముద్రణాలయం, నీలోఖేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత ప్రభుత్వ ముద్రణాలయం, నీలోఖేరి
Established1948–2015
వ్యవస్థాపకులుభారత ప్రభుత్వం
రకంప్రభుత్వ సంస్థ
చట్టబద్ధతసంస్థ
కేంద్రీకరణప్రచురణ
కార్యస్థానం
సేవలుప్రభుత్వ డిమాండ్ల మేరకు ప్రత్యేకంగా ముద్రించడం
సభ్యులుడైరెక్టరేట్ ఆఫ్ ప్రింటింగ్, హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
ముఖ్యమైన వ్యక్తులుపి.ఎన్. శ్రీవాస్తవ
బడ్జెట్7 కోట్లు (2011–12 సమాచార హక్కును బట్టి)
సిబ్బంది294


భారత ప్రభుత్వ ముద్రణాలయం, నీలోఖేరి అనేది హర్యానా రాష్ట్రం, కర్నాల్ జిల్లా, నీలోఖేరిలో ఉన్న ఒక ప్రింటింగ్ ఏజెన్సీ. భారత ప్రభుత్వానికి చెందిన ఈ ముద్రణాలయంలో జాతీయ, పబ్లిక్ డాక్యుమెంట్‌లను ముద్రించబడుతాయి.

చరిత్ర

[మార్చు]

1948 చివరలో పునరావాస మంత్రిత్వ శాఖ ద్వారా నీలోఖేరిలోని పునరావాస కాలనీలో 1948లో ఈ ముద్రణాలయాన్ని స్థాపించారు. భారతదేశ విభజన తర్వాత స్థానభ్రంశం చెందిన వ్యక్తులకు ఉపాధి, శిక్షణను అందించడానికి ఏర్పాటుచేసిన అనేక సంస్థలలో ఇదీ ఒకటి. 1951లో ప్లానింగ్ కమిషన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌కు 1954 ఫిబ్రవరి న్యూఢిల్లీలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ (ఇండియా) కంట్రోలర్‌కు బదిలీ చేయబడింది.[1]

1972లో, ఒక అత్యంత రహస్య విభాగం జోడించబడింది, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల కోసం రహస్య ముద్రణ ఉద్యోగాలు ప్రెస్ పనికి జోడించబడ్డాయి.

1990ల నాటికి, ఈ ముద్రణాలయం ఉపయోగించే లెటర్‌ప్రెస్ సాంకేతికత పాతబడిపోయింది, కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ ప్రింటింగ్ దశలవారీ ఆధునికీకరణను ప్రారంభించింది; మొదటి దశ 1995లో ప్రారంభమై 1996/97లో పూర్తయింది.

కంపెనీ నిర్మాణం, విధులు

[మార్చు]

ఈ ముద్రణాలయం న్యూఢిల్లీలోని ప్రెస్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రింటింగ్ పరిధిలోకి వస్తుంది. ఇందులో సుమారు 294 మంది ఉద్యోగులు ఉన్నారు.[2] ఇద్దరు డిప్యూటీ మేనేజర్లు ఉన్న మేనేజర్ నేతృత్వం వహిస్తారు.

భారతదేశ గెజిట్, ఎగ్జిమ్ పాలసీ, యూనియన్ బడ్జెట్ వర్క్, రైల్వే బడ్జెట్, ప్రతి మంత్రిత్వ శాఖ గ్రాంట్స్ కోసం డిమాండ్లు, ఏఐఆర్, సిబిఐ బులెటిన్, ఆదాయపు పన్ను, ఢిల్లీ పోలీస్ సహా ప్రభుత్వం కోసం ప్రెస్ ప్రత్యేకంగా ముద్రిస్తుంది. సైన్యం, వైమానిక దళం, లోక్‌సభ, రాజ్యసభతో సహా ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, మాన్యువల్‌లు, వార్షిక నివేదికలు, పత్రికలు, బ్యాలెట్ పత్రాలు మొదలైనవి ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. Function and Duties, Government of India Press Archived 8 నవంబరు 2013 at the Wayback Machine, updated 31 March 2012 (pdf)
  2. Directorate of Printing Archived 2 జూన్ 2014 at the Wayback Machine, Ministry of Urban Development, retrieved 28 January 2023.
  3. Documents held for Printing by Nilokheri Press (RTI 2012) Archived 8 నవంబరు 2013 at the Wayback Machine, pdf p. 23.