మచ్చా వీరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మచ్చా వీరయ్య
జననం
మరణం1949, జనవరి 17
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు

మచ్చా వీరయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు.[1] ఆంధ్ర మహాసభ ముఖ్య కార్యకర్తగా 1943-46 మధ్య ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కమ్యూనిస్టు పార్టీకి దళ నాయకుడిగా కూడా పనిచేశాడు.[2]

జననం

[మార్చు]

వీరయ్య తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని గోకినేపల్లి గ్రామంలో జన్మించాడు.[3]

సాయుధ పోరాటం

[మార్చు]

ఆంధ్ర మహాసభలలో చేరిన వీరయ్య ఆ ఆంధ్రమహా సభ అధ్వర్యంలో పటేల్, పట్వారి వస్త్రాలను కాల్చివేత ఉద్యమంలో పాల్గొన్నాడు. నిజాం నిరంకుశ విధానాలను ఎదిరించి పోరాడిన వీరయ్య స్ఫూర్తితో అనేకమంది సాయుధ పోరాటంలో చేరారు. 1944లో ఖమ్మంలో నిర్వహించబడిన ఆంధ్రమహా సభ సమావేశానికి ముఖ్య భూమిక పోషించాడు. ఆంధ్ర మహాసభ నిర్వహించిన అనేక భూమి, భుక్తి పోరాటాలలో ప్రత్యక్ష్య నాయకత్వం వహించాడు.

ఖమ్మం తాలుక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆకర్షితులయ్యేలా ప్రభావం చూపాడు. పిండిప్రోలు ప్రాంతంలోని దళాలతో కలిసి నైజాం మిలటరీ బలగాలను తరిమికొట్టాడు. మండలంలోని బాణాపురం, వెంకటాపురం, ముత్తారం, పమ్మి, కమలాపురం, గంధసిరి, అమ్మపేట, నేలకొండపల్లి ప్రాంతాల్లో కమ్యూనిస్టు గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటుచేసి నెహ్రూ సైన్యాలను తరిమికొట్టి, గ్రామాల్లో కాంగ్రెస్‌ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజలను ఒక్కటి చేసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాడు.[4]

మరణం

[మార్చు]

భారత స్వాతంత్య్రం అనంతరం నెహ్రూ సైన్యాలు వీరయ్యను పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి, రెండు కళ్ళు పొడవడంతోపాటు 1949, జనవరి 17ఖమ్మం రూరల్‌ మండలంలోని కాచిరాజుగూడెం అనే గ్రామంలో కాల్చి చంపేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణ సాయుధ పోరాటం అజరామరమైనది". NavaTelangana. 2020-09-30. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.
  2. 2.0 2.1 "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మచ్చా వీరయ్య". NavaTelangana. 2021-01-17. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  3. "ముదిగొండ అమరుల త్యాగం వృథా కాలేదు.. కాదు." NavaTelangana. 2015-07-28. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  4. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గోకినేపల్లి, మన తెలంగాణ, 2016 సెప్టెంబరు 17.