Jump to content

మర్కూక్ వరదరాజస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°45′11″N 78°43′11″E / 17.753064°N 78.719820°E / 17.753064; 78.719820
వికీపీడియా నుండి
మర్కూక్‌ వరదరాజస్వామి దేవాలయం
మర్కూక్‌ వరదరాజస్వామి దేవాలయం is located in Telangana
మర్కూక్‌ వరదరాజస్వామి దేవాలయం
మర్కూక్‌ వరదరాజస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:17°45′11″N 78°43′11″E / 17.753064°N 78.719820°E / 17.753064; 78.719820
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:వరదరాజాపూర్, మర్కూక్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వరదరాజస్వామి

మర్కూక్‌ వరదరాజస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, మర్కూక్ మండలం, వరదరాజాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం.[1]

చరిత్ర

[మార్చు]

శనిగరం గ్రామానికి చెందిన గూడ ఆచార్య పండితుడు తమ ఊళ్లో వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించాలనుకొని, కంచి నుంచి భూనీలా సమేత వరదరాజస్వామి విగ్రహాలను తీసుకొస్తుండగా ఇక్కడికి వచ్చేసరికి చీకటిపడింది. దాంతో తన పరివారంతో ఇక్కడే ఆ పండితుడు విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటిరోజు స్వామి విగ్రహానికి అర్చనలు నిర్వహించి ప్రయాణానికి సిద్ధమవ్వగా విగ్రహం కదలలేదు. స్వామి ఒక వ్యక్తిలోకి వచ్చి తనకు ఇక్కడే దేవాలయం నిర్మించాల్సిందిగా ఆదేశించడంతో శనిగరంలో కట్టించదలచిన దేవాలయాన్ని గూడ ఆచార్య పండితుడు ఇక్కడే నిర్మింపజేశాడు. అలా ఈ ప్రాంతానికి వరదరాజపూర్‌ అన్న పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడున్న వాగుకు తరచుగా వరదలు వచ్చి నీరు పొంగి స్థానికులకు తీవ్ర ఆస్తి నష్టం కలిగించేది, గ్రామస్తులు విష్ణుమూర్తిని శరణువేడగా వరదరాజస్వామిగా ఈ ప్రాంతంలో వెలిశాడని పురాణ కథ.[1]

నిర్మాణం

[మార్చు]

ఈ దేవాలయం దాదాపు 600 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం దాదాపుగా తిరుమల దేవాలయ నిర్మాణాలను పోలివుంది. చాలా ఎత్తైన ధ్వజస్తంభం, మూడంతస్తుల గోపురం, దివ్యమైన గర్భాలయం, శోభాయమానంగా అర్ధమండపం, రాతి స్తంభాలపై హైందవ సంస్కృతిని చాటే విధంగా గాంధార శైలిని పోలిన శిల్పాలు, విశాలమైన ప్రాకారాలు, రెండు వందల మీటర్ల పొడవుతో రాజగోపురం వీధి, ప్రహారీలు నిర్మించబడ్డాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో పెద్ద కోనేరు కూడా ఉంది. దేవాలయ మంటపంలో బంగారు బల్లి, వెండి తొండ ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత వీటిని చూసి దండం పెట్టుకుంటారు.

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి శనివారం ఈ దేవాలయంలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ అష్టమి నుండి బహుళ విదియ వరకు సంప్రదాయ బద్ధంగా బ్రహ్మోత్సవం, రథోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు.[1]

ఇతర వివరాలు

[మార్చు]

కొండపోచమ్మ జలాశయంకు సంబంధించిన మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించడానికి 2020, మే 29న వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "కావవే వరదా". Dailyhunt (in ఇంగ్లీష్). 2021-04-24. Archived from the original on 2021-11-25. Retrieved 2021-11-25.
  2. Velugu, V6 (2020-05-29). "కొండపోచమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-15. Retrieved 2021-11-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)