కొండపోచమ్మ జలాశయం
కొండపోచమ్మ జలాశయం | |
---|---|
ప్రదేశం | మర్కూక్ - పాములపర్తి, సిద్ధిపేట జిల్లా |
స్థితి | వాడుకలో ఉంది |
ప్రారంభ తేదీ | 29 మే, 2020 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
జలాశయం | |
సృష్టించేది | కొండపోచమ్మ జలాశయం |
మొత్తం సామర్థ్యం | 15 టీఎంసీ |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | జలాశయం |
కొండపోచమ్మ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సిద్ధిపేట జిల్లా, మర్కూక్ - పాములపర్తి గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో రూ.1,540 కోట్ల వ్యయంతో 15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన ఈ జలాశయం ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. 2020, మే 29న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా ఈ జలాశయం ప్రారంభించబడింది.[1] కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 10వ లిఫ్టు.
నిర్మాణం
[మార్చు]దీని నిర్మాణానికి దాదాపు 5,696 ఎకరాల భూమి కావలసివుండడంతో మామిడాయల (2,033 ఎకరాలు), బైలంపూర్ (1,009 ఎకరాలు), తానేధార్ పల్లి (539 ఎకరాలు), మర్కూక్ (960 ఎకరాలు), పాములపర్తి (826 ఎకరాలు), కొత్యాల (327 ఎకరాలు) గ్రామాల నుండి భూమిని సేకరించారు.
నీటిని తరలించడానికి కాలువలు తవ్వి అవసరమైన గొట్టాలు, ఎత్తిపోతలకు మోటార్లు ఏర్పాటుచేసారు. గజ్వేల్ మండలం, అక్కారం వద్ద 27 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లతో ఆరు గొట్టాలనుంచి నీరు మర్కూక్ పంప్ హౌజ్‌కు చేరుకునేలా ఏర్పాటుచేశారు. 15.8 కిలోమీటర్లు వలయాకారంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం వద్ద 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటుచేశారు.
ప్రారంభం
[మార్చు]2020, మే 29న జలాశయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ దేవాలయంలో జరిగిన చండీయాగం పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నాడు.[2]
సిద్ధిపేట జిల్లా, మర్కూక్ గ్రామం దగ్గర సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ కొండపోచమ్మ జలాశయానికి సంబంధించిన మర్కూక్ పంప్‌హౌస్‌ను స్విచ్చాన్ చేసి ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.[3][4]
వివరాలు
[మార్చు]కొండపోచమ్మ జలాశయం వివరాలు[5]
- సామర్థ్యం: 15 టీఎంసీలు
- వలయాకారం కట్ట: 15.8 కిలోమీటర్లు
- ప్రాజెక్టు ఖర్చు: 1,540 కోట్లు
- మొత్తం ఆయకట్టు: 2,85,280 ఎకరాలు
- జలాశయం ఎఫ్ఆర్ఎల్: 618 మీటర్లు
- కట్ట ఎత్తు: 46 మీటర్లు
- కట్ట వెడల్పు: 6 మీటర్లు
- రెగ్యులేటర్లు: 4
- ముంపు ప్రాంతం: 4,636 ఎకరాలు
- ముంపు గ్రామాలు: 3 (మామిడాయల, బైలంపూర్, తానేధార్ పల్లి)
- ప్రధాన స్లూయిస్‌లు: సంగారెడ్డి ప్రధాన కెనాల్, కేశవపూర్ కెనాల్, జగదేవ్‌పూర్ కెనాల్
- లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి
- ప్రధాన కాల్వలు: రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్‌పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి
ప్రత్యేకతలు
[మార్చు]- 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీరు చేరవేసే ఈ రిజర్వాయర్ దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది.
- కాలువ ద్వారా కేశవాపూర్ జలాశయంకు నీటిని తరలించి, అక్కడ 10 టీఎంసీల నీటిని శుద్ధిచేసి గోదావరి రింగ్ మెయిన్ పైపులైన్‌లతో హైదరాబాదు నగరానికి తాగునీటిని సరఫరా చేస్తారు.[6]
ఇవికూడా చూడండి
[మార్చు]- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
- మేడిగడ్డ బ్యారేజి
- మేడారం బ్యారేజీ
- అన్నారం బ్యారేజి
- సుందిళ్ళ బ్యారేజి
- రంగనాయకసాగర్ జలాశయం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (29 May 2020). "కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం". www.andhrajyothy.com. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (29 May 2020). "కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు". Sakshi. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.
- ↑ ఈనాడు, తాజావార్తలు (29 May 2020). "మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్, చినజీయర్ స్వామి". www.eenadu.net. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (29 May 2020). "కొండపోచమ్మకు గోదావరి జలాలు." Sakshi. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (29 May 2020). "కొండపోచమ్మ రిజర్వాయర్ వివరాలివే." ntnews. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.
- ↑ నమస్తే తెలంగాణ, హైదరాబాదు (29 May 2020). "హైదరాబాద్‌కు జలప్రదాత 'కొండపోచమ్మ' రిజర్వాయర్". ntnews. Archived from the original on 29 May 2020. Retrieved 29 May 2020.