Jump to content

మర్రి శశిధర్ రెడ్డి

వికీపీడియా నుండి
మర్రి శశిధర్‌ రెడ్డి
మర్రి శశిధర్ రెడ్డి


మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1992-1994,1994-1999,2004-2009,2009-2014(4 సార్లు)
నియోజకవర్గం సనత్‌నగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 24 ఆగష్టు 1955
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మర్రి చెన్నారెడ్డి, సావిత్రి దేవి
జీవిత భాగస్వామి ఇందిరా రెడ్డి
సంతానం 2 కుమారులు, 1 కూతురు
నివాసం తార్నాక, హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ

మర్రి శశిధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ ఛైర్మన్‌. మర్రి శశిధర్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మర్రి శశిధర్‌రెడ్డి 24 ఆగష్టు 1955న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి , సావిత్రి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన సెయింట్. స్టీఫెన్స్ కాలేజీ, యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ నుండి 1967లో బిఎ (ఇంగ్లీష్) , 1971లో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ (అగ్రికల్చర్), 1973లో అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ (అగ్రోనోమి) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మర్రి శశిధర్‌ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1992లో సనత్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ పై 6162 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. మర్రి శశిధర్‌ రెడ్డి 1999లో టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ చేతిలో 16031 ఓట్ల తేడాతో ఓటమి పాలై, 2004లో టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ పై 9546 ఓట్ల మెజారిటీతో, 2009లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ పై 8325 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

మర్రి శశిధర్‌ రెడ్డి 2004లో జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్‌గా నియమితుడై 19 జూన్ 2014న ఆ పదవికి రాజీనామా చేశాడు.[1] ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో 27461 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[2] ఆయన నవంబర్ 8, 2020న టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడై,[3] 28 జూన్ 2021న ఆ పదవికి రాజీనామా చేశాడు.[4]

మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు 2022 నవంబర్ 19న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి ప్రకటించాడు.[5] మర్రి శశిధర్ రెడ్డి 2022 నవంబర్ 25న న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరగా, ఆయనకు కేంద్ర మంత్రి శర్భానంద్ సోనేవాల్ బీజేపీ సభ్యత్వం అందించాడు.[6]

మర్రి శశిధర్‌ రెడ్డిని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 June 2014). "మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.
  2. Sakshi (16 May 2014). "మర్రి శశిధర్ రెడ్డిపై తలసాని గెలుపు". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.
  3. Andrajyothy (8 November 2020). "మర్రి శశిధర్‌రెడ్డి చైర్మన్‌గా. . కాంగ్రెస్‌ మేనిఫెస్టో". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.
  4. Sakshi (28 June 2021). "ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి రాజీనామా". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.
  5. Sakshi (19 November 2022). "కాంగ్రెస్‌ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  6. Eenadu (25 November 2022). "భాజపాలో చేరిన కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి". Archived from the original on 2022-11-25. Retrieved 27 November 2022.
  7. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.