Jump to content

జిల్లెల చిన్నారెడ్డి

వికీపీడియా నుండి
జిల్లెల చిన్నారెడ్డి
జిల్లెల చిన్నారెడ్డి


తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఫిబ్రవరి 24 - ప్రస్తుతం
ముందు బి. వినోద్ కుమార్

మాజీ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2018
నియోజకవర్గం వనపర్తి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-07) 1956 జూలై 7 (వయసు 68)
జయన్న తిరుమలాపూర్, గోపాలపేట మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాద్

జిల్లెల చిన్నారెడ్డి (Jillela Chinnareddy) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. గోపాల్ పేట మండలానికి చెందిన చిన్నారెడ్డి ఉన్నత పాఠశాల వరకు వనపర్తిలో విద్యనభ్యసించాడు. 1970లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు.

రాజకీయ నేపథ్యం

[మార్చు]

జి. చిన్నారెడ్డి 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ వనపర్తి టికెట్ సాధించి తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓడిపోయాడు. ఆయన 1989లో బాలకృష్ణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు. జి. చిన్నారెడ్డి 1994లో మూడవసారి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు. ఆయన 1999లో రావుల చంద్రశేఖర్ రెడ్డిపై 3500 మెజారిటీతో విజయం సాధించాడు. జి. చిన్నారెడ్డి 2004లో ఐదవసారి పోటీలో దిగి వరుస విజయం సాధించి మూడో సారి శాసన సభ్యులు అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు.

జి. చిన్నారెడ్డి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. జి. చిన్నారెడ్డి 2021లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో వనపర్తి అభ్యర్థిగా ప్రకటించి ఆ తరువాత అభ్యర్థిని మార్చారు [1][2]

జి. చిన్నారెడ్డిని 2024 ఫిబ్రవరి 24న తెలంగాణ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.[3][4] ఆయన ఫిబ్రవరి 29న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Eenadu (28 October 2023). "కొత్తవారికి అభయహస్తం". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  3. EENADU (25 February 2024). "రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి". Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.
  4. A. B. P. Desam (24 February 2024). "చిన్నారెడ్డికి కీలక పదవి - ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  5. NT News (1 March 2024). "ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.