Jump to content

రావుల చంద్రశేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
రావుల చంద్రశేఖర్ రెడ్డి
వృత్తిరాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు
రావుల చంద్రశేఖర్ రెడ్డి

రావుల చంద్రశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1982లో కానాయపల్లి సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించి 1985లో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.[1] 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశాడు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రావుల చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి బీజేపీ పార్టీ మద్దతుతో కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సర్పంచ్‌గా తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఆ తరువాత టీడీపీ ఆవిర్భావంతో 1982లో సర్పంచ్ హోదాలో ఆ పారీలో చేరాడు. ఆయన టిడిపిలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1987 నుంచి 89 వరకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా పని చేశాడు.

రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్‌‌గా పని చేశాడు. ఆయన 2002 నుండి 2008 వరకు టిడిపి తరపున రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. చంద్రశేఖర్ రెడ్డి ఆ తరువాత టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీ తరపున వనపర్తిలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులో ఆయనకు పోటీ చేసే అవకాశం లభించలేదు. ఆ తరువాత పార్టీ కీలక నేతగా దాదాపు 40 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆయన ఆ పార్టీని వీడి 2023 అక్టోబర్ 20న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. సూర్య దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబాయిడ్, తేది 17-05-2009
  2. Namasthe Telangana (20 October 2023). "బీఆర్ఎస్‌లో చేరిన రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి.. గులాబీ కండువా క‌ప్పి ఆహ్వానించిన కేటీఆర్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  3. Eenadu (20 October 2023). "నేడు భారాసలోకి రావుల, జిట్టా". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.