మసాకో ఒనో
మసాకో ఒనో | |
---|---|
జననం | టోక్యో, జపాన్ |
వృత్తి | నర్తకి |
క్రియాశీల సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
Dances | ఒడిస్సీ, సమకాలీన నృత్యం |
మసాకో ఒనో (ఆంగ్లం: Masako Ono), జపనీస్ ఒడిస్సీ నర్తకి.[1] ఆమె 1996 నుండి భారతదేశంలో నివసిస్తున్నది.[2]
2008లో న్యూస్వీక్ జపనీస్ సంచిక ఆమెను ప్రపంచంలోని వంద మంది అత్యుత్తమ జపనీస్ వ్యక్తులలో ఒకరిగా ఎంపిక చేసింది. ఫస్ట్ జపనీస్ అనే డాక్యుమెంటరీ సిరీస్ లో భాగంగా ఆమె ఆటోబయోగ్రఫీ చిత్రీకరించబడింది.[3]
ఆమె నృత్యరూపకల్పన చేసిన వాటిలో ఫ్రోజెన్ గ్రేస్, డాన్స్ ఆఫ్ ది క్రేన్, కుండలిని స్తావా, ది డే డ్రీం వంటివి ఉన్నాయి.
జీవితచరిత్ర
[మార్చు]నాలుగు సంవత్సరాల వయస్సులో మసాకో ఒనో యునైటెడ్ స్టేట్స్ లోని మార్తా గ్రాహం డాన్స్ స్కూల్ నుండి ఆధునిక నృత్యంలో గ్రాడ్యుయేట్ అయిన ఏకైక జపనీస్ బోధకుడు మసాకో యోకోయి ఆధ్వర్యంలో నృత్యం చేయడం ప్రారంభించింది.[4] ఆమె టోక్యోలోని మాట్సుయామా బ్యాలెట్లో పాశ్చాత్య శాస్త్రీయ బ్యాలెట్లో కూడా శిక్షణ పొందింది. టోక్యోలో ఉన్న కె-బ్రాడ్వే డాన్స్ సెంటర్లో జాజ్ డ్యాన్స్, హిప్ హాప్ అభ్యసించింది.
1996లో, ఆమె ప్రముఖ ఒడిస్సీ నర్తకి దివంగత ప్రొతిమా బేడి ప్రారంభించిన భారతదేశంలోని నృత్యగ్రామంలో చేరి, ఆమె చదువుకు స్కాలర్షిప్ గెలుచుకుంది. ఆమె మొదట ప్రొతిమా బేడి నుండి ఒడిస్సీలో శిక్షణ పొంది, ప్రొతిమా బేడి మరణం తరువాత సురుపా సేన్, బిజయిని సత్పతిల వద్ద తన శిక్షణను కొనసాగించింది. ఆమె యోగా, కళరిప్పయట్టు, మయూర్భంజ్ చౌ నృత్య తరగతులకు కూడా హాజరైంది. నృత్యగ్రామ్లో వోల్ఫ్గ్యాంగ్ థియేటర్, పాల్ టేలర్ 2 కంపెనీ, ది ఎక్స్ప్రెషన్స్, ఆశా కూర్లావాలా, రాబర్ట్ విలియమ్స్ నిర్వహించిన వర్క్షాప్లలో ఆమె పాల్గొన్నది.
ఒడిస్సీ, యోగాలలో ఐదేళ్ల శిక్షణ తరువాత, ఆమె సోలో పెర్ఫార్మర్ కావడానికి నృత్యగ్రామ్ ను విడిచిపెట్టింది. అప్పటి నుండి ఆమె ఒరిస్సాలో నివసిస్తూ, గురు కేళుచరణ్ మోహపాత్ర, గురు రమణి రంజన్ జెనా, గురు నబ కిషోర్ మిశ్రా ల నుండి ఒడిస్సీలో మరింత శిక్షణ పొందింది.[5]
2001 నుండి, ఆమె దేశంలోని భువనేశ్వర్ లో ఒడిస్సీ, యోగా ఉపాధ్యాయురాలిగా కెరీర్ ఎంచుకుంది. ఆమె భారతదేశంతో పాటు, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక మొదలైన దేశాలలో ప్రదర్శనలు ఇస్తోంది. ఆమె 2005, 2006లలో జపాన్ ఇద్దరు ప్రధానమంత్రులు జునిచిరో కొయ్జుమి, షింజో అబే ల కోసం కూడా ప్రదర్శనలు ఇచ్చింది. 2008లో, ఆమె బోయి శక్తి, గెరార్డ్ మోస్టార్డ్ లతో కలిసి సమకాలీన నృత్య ప్రాజెక్ట్ లో పాల్గొన్నది.
ఆమె మన దేశం, జపాన్ లలో మసాకో ఒనో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంఓపిఎ) కు దర్శకత్వం వహిస్తుంది. స్థానిక కళలు, ముఖ్యంగా హస్తకళలను ప్రోత్సహించడానికి పనిచేస్తున్న అంతర్జాతీయ కళాకారుల ప్రయత్నాలకు మద్దతుగా ఆమె 2010లో ముద్రా ఫౌండేషన్ ను ప్రారంభించింది.
మైలురాళ్ళు
[మార్చు]- 2008లో వారి వారి రంగాలలో ప్రపంచంలోని 100 మంది అత్యంత గౌరవనీయమైన జపనీస్ వ్యక్తులలో ఒకరిగా న్యూస్ వీక్ జపాన్ ఆమెను ఎంపిక చేసింది.[6]
- 2007లో ఫస్ట్ జపనీస్ సిరీస్ లో భాగంగా మసాకో ఒనోపై ఒక డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది.[7]
- జపాన్ మాజీ ప్రధానమంత్రులు జునిచిరో కొయ్జుమి, షింజో అబే కోసం ఆమె ప్రదర్శన ఇచ్చింది.
- 2007లో అమెరికా వాషింగ్టన్, డి.సి.లోని కెన్నెడీ సెంటర్ లో ఆమె ప్రదర్శన ఇచ్చింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Rajan, Anjana (12 November 2010). "Face of India". The Hindu. Chennai, India. Retrieved 31 January 2011.
- ↑ "Married to a foreign culture". Financial Express. Retrieved 31 January 2011.
- ↑ "Natyanjali Australia presents Masako Ono dance performance". The Japan Foundation, Sydney. Archived from the original on 21 జూలై 2011. Retrieved 31 January 2011.
- ↑ Dash, Jatindra (3 July 2010). "Dance beyond boundaries". Gulf News. Retrieved 31 January 2011.
- ↑ John, Karuna, "Power of Ono," Archived 2012-10-30 at the Wayback Machine Time Out Delhi, 2010.
- ↑ "100 most respected Japanese in the world," Newsweek Japan, 2007, 17:59. (in Japanese) Archived సెప్టెంబరు 15, 2008 at the Wayback Machine
- ↑ "First Japanese" Archived 2011-08-11 at the Wayback Machine documentary film produced by NHK BS. (in Japanese)
- ↑ "Masako Ono | Explore the Arts," Archived 2012-09-29 at the Wayback Machine Kennedy Center for the Performing Arts, 1 April 2007.