Jump to content

మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్

వికీపీడియా నుండి
(మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌ నుండి దారిమార్పు చెందింది)
మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్

ఎం.టి. ఖాన్‌ - మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌. పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు. మార్క్సిస్టు ముల్లా. హైదరాబాద్‌లో పురానాపుల్‌ వంతెన దగ్గర మియాపైసా దర్గా, అబూహాషిమ్‌ మదానీ దర్గా. వీరిద్దరూ నిజాంల కాలం నాటి సూఫీ సాధువులు. వీరి వారసుడే ఎం.టి. ఖాన్‌. ఈ సూఫీ ఫకీర్ల వలెనే ఖాన్‌ సాబ్‌ కూడా ఫకీర్‌ జీవితమే గడిపారు. దర్గాల ముత్తవలి (ధర్మకర్త) అయిన ఖాన్‌ సాబ్‌ మగ్దూం మొహియుద్దీన్ తో ప్రభావితుడై కమ్యూనిస్టు అయినారు. దర్గా లకు, మసీదు లకు దూరమైనా మార్క్సిస్టు ముల్లాలాగా జీవించారు. ఖాన్‌ సాబ్‌ పూర్వీకులు 400 ఏండ్ల క్రితం గుల్‌బర్గా నుంచి వలస వచ్చారు. గుల్‌బర్గాలోని బందే నవాజ్‌ (భక్తుల పెన్నిధి) దర్గా ముత్తవలి హుసేన్‌ షా వలీని కుతుబ్‌షా నవాబు ఇబ్రహీం కులి గోల్కొండ కు రప్పించి తన కూతురు ఖైరతున్నీసాను ఇచ్చి పెళ్ళి చేశారు. పసి వయసులోనే తల్లి చనిపోతే గొల్ల స్ర్తీ పోషణలో ఖాన్‌ సాబ్‌ పెరిగారు. ఫలితంగా ఇస్లామ్‌, హిందూ మతాల సంస్కృతుల పట్ల గౌరవం పెంచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో మగ్దూం, రాజబహదూర్‌ గౌర్‌ల శిష్యరికంలో తెలంగాణ కామ్రేడ్స్‌ సంఘంలో చేరారు. మగ్దూం ప్రభావంతో ఉర్దూ, పార్శీ సాహిత్యం అధ్యయనం చేశారు. యాకుత్‌పురాలోని ధర్మవంత్‌ కాలేజీలో ఆయన ఇంగ్లీష్‌ టీచర్‌. ‘ఇంగ్లీషు ఏ గాడిదైనా నేర్పుతుంది. ముందు మీరు మానవత్వం నేర్చుకోండి. నీతి నేర్చుకోండి’ అని మార్క్సిస్టు పాఠాలు నేర్పేవారు. ఉర్దూ, పార్శీ, అరబ్బీ, హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అపార ప్రావీణ్యం గల ఖాన్‌ సాబ్‌ న్యూస్‌ టైమ్‌లో సియాసత్‌లో సంపాదకీయాలు రాశారు. ఎం.టి. ఖాన్‌ గుండెపోటుతో హైదరాబాదులో [[ఆగష్టు 20] , 2014 న మరణించారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]