మహాబలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాబలుడు
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రవికాంత్
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన సి.నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ భారతి పిక్చర్స్
భాష తెలుగు

మహాబలుడు 1969 లో రవికాంత్ దర్శకత్వంలో విడుదలైన జానపద కథాచిత్రం. ఇందులో కృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]
  • కృష్ణ
  • వాణిశ్రీ
  • త్యాగరాజు
  • రావి కొండలరావు
  • పెమ్మసాని రామకృష్ణ
  • నాగయ్య
  • పొట్టి ప్రసాద్
  • రాజ్‌బాబు
  • రామచంద్రరావు
  • లక్ష్మీ
  • కోళ్ల సత్యం
  • శేషయ్య
  • ఉదయలక్ష్మి
  • సుంకర లక్ష్మి
  • ప్రభావతి
  • వడ్లమాని విశ్వనాథం
  • గీతాంజలి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: కె అప్పలాచార్య
  • కెమెరా: విఎస్‌ఆర్ కృష్ణారావు
  • నృత్యం: శ్రీను
  • సంగీతం: ఎస్ కోదండపాణి
  • కూర్పు: ఎస్‌ఎస్ ప్రకాశం
  • కళ: ఎస్ కృష్ణారావు
  • పోరాటాలు: ఎఆర్ భాషా
  • డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రాఫ్: వి శివరాం
  • డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
  • నిర్మాత: పి మల్లికార్జునరావు

తల్లిదండ్రుల కోరిక మేరకు యువరాజు ప్రతాపసింహుడు (కృష్ణ) ధర్మపురి యువరాణి ఇంద్రప్రభ (వాణిశ్రీ) స్వయంవరానికి వెళ్తాడు. ఇంద్రప్రభ వద్దనున్న ఇంద్రమణిని అపహరించేందుకు మాంత్రికుడు సర్వజిత్ (త్యాగరాజు) శిష్యుడు దుర్ముఖి (రావి కొండలరావు) అక్కడికి వస్తాడు. అతని మాయతో ప్రతాపుడు యువరాణి వద్దవుండటం, ఇంద్రమణి నల్లగా మారటం, ఇంద్రప్రభ అచేతనమవటం జరుగుతుంది. వీటన్నింటికీ ప్రతాపుడు కారణమని భావించిన మహారాజు ఆజ్ఞమేరకు ప్రతాపుడిని రాజభటులు హింసించి నగరం వెలుపల పడేస్తారు. దాహంతో ఓ గుహచేరతాడు ప్రతాపుడు. అక్కడ దొరికిన పానీయం తాగి మహాబలుడవుతాడు. యువరాణిని రక్షించే ప్రయత్నంలో మరుగుజ్జు కోయరాజును కలుస్తాడు. అక్కడినుంచి మారువేషంలో దుర్ముఖి ద్వారా చంద్రమణి, సూర్యమణుల జాడ తెలిసికొని సాహసంతో వాటిని సాధిస్తాడు. దుర్ముఖి వలన మాయచే మధువు తాగి తన శక్తికి కారణం వెల్లడించటంతో తిరిగి అశక్తుడౌతాడు ప్రతాపుడు. అతడిని చిలకగా మార్చి మణులతో సహా దుర్ముఖి, సర్వజిత్ వద్దకు వెళ్లటం, అక్కడ మూడు మణులను ఏకం చేయటంతో ఇంద్రప్రభ, కోయయువతి, సూర్యప్రభ ముగ్గురూ ఒకటిగా మారతారు. ప్రతాపుని సంహరించాలనుకున్న సర్వజిత్ ప్రాణ రహస్యాన్ని దుర్జయుడు (పెమ్మసాని రామకృష్ణ) సాయంతో తెలిసికొని, మాంత్రికుని సంహరించి ఇంద్రసేనతో రాజ్యానికి రావటం, వారి కల్యాణంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

పాటలు

[మార్చు]
  1. ఏమె ఒప్పులకుప్పా నిను ప్రేమిస్తే అది తప్పా, రచన: ఆరుద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  2. ఓ విశాలగగనంలో చందమామా - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. రావేలా ఓ ప్రియా, రచన: సి నారాయణ రెడ్డి గానం. పి సుశీల
  4. ఇక్కడే ఉన్నది చక్కని చిన్నది రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల ,బృందం
  5. చూడండీ మీకు నేడు, రచన: దాశరథి కృష్ణమాచార్య , గానం.పులపాక సుశీల
  6. మగాడంటే మాజాఉన్న, రచన ఆరుద్ర ,గానం.పి.సుశీల, రాజబాబు .

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గానామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.
"https://te.wikipedia.org/w/index.php?title=మహాబలుడు&oldid=4204784" నుండి వెలికితీశారు