మహీంద రాజపక్స

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mahinda Rajapaksa
මහින්ද රාජපක්ෂ
மகிந்த ராசபக்ச
మహీంద రాజపక్స


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
19 November 2005
ప్రధాన మంత్రి Ratnasiri Wickremanayake
D. M. Jayaratne
ముందు Chandrika Kumaratunga

పదవీ కాలము
6 April 2004 – 19 November 2005
అధ్యక్షుడు Chandrika Kumaratunga
ముందు Ranil Wickremasinghe
తరువాత Ratnasiri Wickremanayake

వ్యక్తిగత వివరాలు

జననం మూస:Bda
Weerakatiya, British Ceylon
రాజకీయ పార్టీ United People's Freedom Alliance
Freedom Party
జీవిత భాగస్వామి Shiranthi Rajapaksa
(nee Wickremesinghe)
సంతానము Namal
Yoshitha
Rohitha
పూర్వ విద్యార్థి Richmond College
Nalanda College Colombo
Thurstan College
Sri Lanka Law College
వృత్తి Politician, Lawyer
మతం Buddhism
వెబ్‌సైటు Official website

పెర్సీ మహేంద్ర "మహీంద" రాజపక్స (సింహళ මහින්ද රාජපක්ෂ, మూస:IPA2 తమిళం மகிந்த ராசபக்ச; జననం 1945 నవంబరు 18) 6వ మరియు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు, ఆయన శ్రీలంక సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్‌గా (సర్వసైన్యాధ్యక్షుడిగా) ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రాజపక్స మొదటిసారి 1970లో శ్రీలంక పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు, 2004 ఏప్రిల్ 6 నుంచి 2005 అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 నవంబరు 19న ప్రమాణస్వీకారం చేయడం ద్వారా అధ్యక్షుడిగా ఆరేళ్ల పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2010 జనవరి 27న రెండోసారి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.[1] ఆయన రెండు గౌరవ డాక్టరేట్‌లు పొందారు. 2009 సెప్టెంబరు 6న కొలంబో విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టర్ ఆఫ్ లా ప్రదానం చేసింది.[2] రెండో పట్టాను పీపుల్స్ ఫ్రెండ్‌షిప్ యూనివర్శిటీ ఆఫ్ రష్యా 2010 ఫిబ్రవరి 6న ఆయనకు ప్రదానం చేసింది, ప్రపంచ శాంతికి చేసిన సేవలు మరియు తీవ్రవాదంపై చిరస్మరణీయ విజయం సాధించినందుకు గుర్తుగా ఆయనకు ఈ డాక్టరేట్ అందించారు.[3]

బాల్యం మరియు వృత్తి జీవితం[మార్చు]

శ్రీలంకలోని దక్షిణ గ్రామీణ ప్రాంత జిల్లా హంబన్‌తోటలోని వీరకటియాలో రాజపక్స జన్మించారు.[4] ఆయన శ్రీలంకలో ఒక ప్రసిద్ధ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి డి.ఎ. రాజపక్స ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్యోద్యమ ఆందోళనకారుడు, పార్లమెంట్ సభ్యుడు, అంతేకాకుండా విజయనందా దహనాయకే ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మరియు భూముల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మహీంద రాజపక్స పెదనాన్న డి.ఎం. రాజపక్స 1930వ దశకంలో హంబన్‌తోట రాష్ట్ర కౌన్సిలర్‌గా పనిచేశారు, ఈ ప్రాంతంలో ప్రజల ద్వారా జీవితమంతా విజయవంతమైన వ్యక్తిగా నిలిచిన ఆయన వారు పండించే కురాక్కన్‌ను (రాగి (పంట) ) సూచించే గోధుమరంగు శాలువాను ధరించడం మొదలుపెట్టారు. రాజపక్స ధరించే శాలువా అలవాటు కూడా ఆయన నుంచి స్వీకరించడం జరిగింది.[4]

రాజపక్స గాలేలోని రిచ్‌మండ్ కళాశాలలో చదువుకున్నారు, తరువాత నలందా కాలేజ్, కొలంబో మరియు ఆపై థర్‌స్టాన్ కాలేజ్, కొలంబోలో ఆయన చదువు సాగింది.[4] సింహళ చలనచిత్రాల్లో నటుడిగా ఆయన కొన్ని హాస్యరస పాత్రలు పోషించారు, విద్యోదయా విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ సహాయకుడిగా కూడా పనిచేశారు.[5]

1967లో తన తండ్రి మరణం తరువాత, రాజపక్స బెలియాట్ట నియోజకవర్గం నుంచి ఆయన స్థానంలో SLFP అభ్యర్థిగా నిలబడ్డారు, 1970లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు, అతి పిన్నవయస్కుడిగా 24 ఏళ్ల వయస్సులోనే ఆయన మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.[5] తరువాత ఆయన శ్రీలంక లా కాలేజ్‌లో న్యాయ విద్యను అభ్యసించారు, నవంబరు 1977లో న్యాయవాది పట్టా స్వీకరించారు.[6] మంత్రిగా పనిచేసిన 1994-2001 మధ్య కాలంలో మినహా, పార్లమెంటరీ జీవితం మొత్తం ఆయన టాంగాలేలో న్యాయవాద వృత్తి కొనసాగించారు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

ప్రతిపక్షంలో[మార్చు]

SLFP అభ్యర్థిగా 1977లో భారీ పరాజయం చవిచూసిన ఆయన తన పార్లమెంటరీ సీటు కోల్పోయారు, [4] 1989లో హంబన్‌తోట జిల్లా పరిధిలో దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఆయన తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తమనితాము దేశప్రేమి జాతికా వ్యాపారయ లేదా పాట్రియోటిక్ నేషనల్ మూమెంట్‌గా పిలుచుకునే ఒక తిరుగుబాటు సంస్థ ప్రోద్బలంతో సాగిన 1988-90 కాలానికి చెందిన వైట్ టెర్రర్‌ కారణంగా కనిపించకుండా పోయినవారి తల్లులను ఏకతాటిపైకి తెచ్చిన మదర్స్ ఫ్రంట్‌కు చెందిన మనోరాణి శరవణ్‌ముత్తుతో కలిసి ఆయన ఒక ప్రముఖ నేతగా ఎదిగారు.[4]

కేంద్ర మంత్రిగా నియామకం[మార్చు]

1994లో, చంద్రికా కుమారతుంగా నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటయిన ఒక రాజకీయ కూటమి పీపుల్స్ అలయన్స్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత, రాజపక్స కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1997 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు, ఆ తరువాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఆయన మత్స్య మరియు జల వనరుల శాఖ మంత్రిగా నియమించబడ్డారు.[4]

ప్రతిపక్ష నేత[మార్చు]

యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) 2001 ఎన్నికల్లో పీపుల్స్ అలయన్స్‌ను ఓడించింది, రాజపక్స ప్రభుత్వంలో తన పదవిని కోల్పోయారు. మార్చి 2002లో ఆయన ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు.[4]

ప్రధానమంత్రి[మార్చు]

2004 పార్లమెంటరీ ఎన్నికలు తరువాత, యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ పార్లమెంట్‌లో కొద్దిస్థాయి మెజారిటీ సాధించింది. 2004 ఏప్రిల్ 6న శ్రీలంక 13వ ప్రధానమంత్రిగా రాజపక్స ప్రమాణస్వీకారం చేశారు.[4] ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజపక్స రహదారుల శాఖ మంత్రిత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.

అధ్యక్షుడు (2005 - ప్రస్తుతం)[మార్చు]

Presidential styles of
Mahinda Rajapaksa
Reference styleHis Excellency President Mahinda Rajapaksa
His Excellency Mahinda Rajapaksa, President of Sri Lanka
Spoken stylePresident Rajapaksa
Alternative styleH.E.

శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ మహీంద రాజపక్సను తమ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఎన్నుకుంది, 2005 నవంబరు 17న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నేత, యునైటెడ్ నేషనల్ పార్టీ నేత రాణిల్ విక్రమసింఘేపై ఆయన పోటీ చేశారు. UNP భారీస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, మహీంద రాజపక్స 190,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. LTTE (ఎల్టీటీఈ) తీవ్రవాద సంస్థ తమ ఆధీనంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో తమిళ ఓటర్లకు అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం తమ పరాజయానికి కారణమైందని ప్రతిపక్షం పేర్కొంది. ఈ ప్రాంతాల్లోని అనేక మంది ఓటర్లు బలవంతంగా ఎన్నికలకు దూరంగా ఉంచబడ్డారు, ఈ ఎన్నికల్లో UNP పార్టీకి, రాణిల్ విక్రమసింఘేకు అనుకూలంగా వారు ఓటు వేసేవారనే అభిప్రాయాలు ఉన్నాయి.[7] రాజపక్సకు 50.3% ఓట్లు లభించాయి.

శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాజపక్స మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు, కొత్త మంత్రివర్గంలో రక్షణ మరియు ఆర్థిక శాఖల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్నారు, ఈ మంత్రిత్వ శాఖల బాధ్యతల్లో 2005 నవంబరు 23న ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

శరత్ ఫోన్సెకాతో విభేదాలు[మార్చు]

రాజపక్స మరియు ఆయన మాజీ సాయుధ దళాల అధిపతి శరత్ ఫోన్సెకా మధ్య వివాదం ఒకటి ఇటీవల తెరపైకి వచ్చింది. రాజకీయ నాయకుడు లేదా సైనిక నేత ఇద్దరిలో ఎవరు వాస్తవానికి LTTEపై విజయానికి మరియు ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కారకులనే అంశం చుట్టూ ప్రధానంగా ఈ వివాదం నెలకొంది. వాస్తవానికి, ఫోన్సెకా మరియు శ్రీలంక ప్రభుత్వం ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధ్యక్షుడు మరియు ఆయన పాలనా యంత్రాంగం యుద్ధ నేరాల ఆరోపణలపై ఆధారాలు అందించాలని ఆయనను కోరింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసింది, ఈ సమావేశంలో ఎటువంటి రహస్య సమాచారాన్ని వెల్లడించేందుకు ఆయనకు అనుమతి లేదని పేర్కొంది. అధ్యక్షుడు మరియు ఆయన జనరల్ మధ్య సంబంధాలు ప్రస్తుతం సరిగా లేవనేందుకు ఇదొక బలమైన ఆధారంగా అనేక మంది సూచించారు.ఉదహరింపు పొరపాటు: సరైన <ref> ట్యాగు కాదు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ

అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారు వీరిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేదని చెబుతున్నారు, అయితే వారి మధ్య విభేదాలు ఉన్నాయనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్మీని ఉద్దేశించి జనరల్ చేసిన ప్రసంగంలో, LTTEపై ఆర్మీ సాధించిన ఇటీవలి సైనిక విజయంలో తన వ్యక్తిగత పాత్రను పదేపదే ప్రస్తావించారు.[8]

2009 నవంబరు 15న, తన పదవి మరియు ఆర్మీలో బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకోవాలని ఫోన్సెకాకు తన కార్యదర్శి ద్వారా ఒక లేఖ పంపడం ద్వారా రాజపక్స ఆదేశాలు జారీ చేశారు.[9]

తరువాతి రోజు, వైమానిక దళ అధిపతి రోషన్ గూనటిలకెను డిఫెన్స్ స్టాఫ్ కొత్త అధిపతిగా నియమించారు.[10]

ఈ అన్ని వివాదాలతో, రాజపక్స అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సపై ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ప్రతిపక్ష అభ్యర్థిగా జనరల్ పోటీ చేశారు, [8] జనరల్‌ను బలపరిచిన కూటమిలో దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి.

హంబన్‌తోట అభివృద్ధి[మార్చు]

దక్షిణాసియా నడిబొడ్డు నౌకాశ్రయంగా తన హంబన్‌తోట నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు మహీంద ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఒక నౌకాశ్రయాన్ని నిర్మించడంలో సాయం కోరేందుకు ఆయన మొదట భారతదేశం వెళ్లారు, తరువాత USA మరియు చైనాలకు కూడా ఆశ్రయించారు.[11] చైనా ఆయనకు అనుకూలమైన ఒప్పందాన్ని అందించింది.

రాజకీయ విధానాలు[మార్చు]

శాంతికాముకుడిగా మరియు చర్చలకు సుముఖత గల వ్యక్తిగా తననితాను వర్ణించుకున్నప్పటికీ రాజపక్స, సింహళ జాతీయవాద జనతా విముక్తి పెరామునా మరియు జథికా హేల ఉరుమయాలతో ఒప్పందం కుదుర్చుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి ప్రక్రియను ముగించే ఉద్దేశాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. JVP అసలు 2002 శాంతి ప్రక్రియను వ్యతిరేకించింది, దీనిని దేశద్రోహంగా అది పరిగణించింది.

జోర్డాన్‌లో 2009 మే 15న జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో అధ్యక్షుడు మహీంద రాజపక్స, LTTE అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్ మరణానికి మూడు రోజుల ముందు ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు

రాజపక్సతో కుదుర్చుకున్న ఒప్పందంలో LTTEపై పోరుకు సైన్యానికి విస్తృత అధికారులు అందించేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని, తమిళ పౌరులకు ఎటువంటి అధికార సంక్రమణ జరగకుండా చూడాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, LTTE ఆధీనంలోని సునామీ ప్రభావిత ప్రాంతాలకు సాయాన్ని నిలిపివేయాలని, ఎల్టీటీఈ పక్షపాతులనే ఆరోపణలతో నార్వే దూతలను పక్కనబెట్టాలనే డిమాండ్‌లు కూడా దీనిలో ఉన్నాయి. [1]

ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వెంటనే, దేశంలో అనుమానాస్పద LTTE దాడుల ఫలితంగా వరుసగా జరిగిన గని పేలుళ్లలో అనేక మంది ప్రభుత్వ సిబ్బంది మరియు పౌరులు మృతి చెందారు, దీంతో దేశం యుద్ధం కోరల్లోకి జారుకుంది.[12] నీరు సరఫరా చేసే ఒక జలాశయాన్ని మూసివేయడం ద్వారా LTTE, దానిపై ఆధారపడిన "మావిర్ అరు" అని పిలిచే ప్రభుత్వ నియంత్రణ ప్రాంతాల్లోని 15,000 మంది పౌరులకు ఇబ్బందులు సృష్టించింది, [13] దీని తరువాత శ్రీలంక సైన్యం LTTEపై పోరాటం జరిపి జలాశయాన్ని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంది. తరువాతి సైనిక కార్యకలాపాల్లో దేశంలోని తూర్పు ప్రావీన్స్‌కు LTTE చెరనుంచి విముక్తి కల్పించబడింది, దీంతో వారి ఆధీనంలోని 95% భూభాగం ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.[14][15][16][17]

UNలో అధ్యక్షుడు తమిళంలో చారిత్రాత్మక ప్రసంగం చేయడం ద్వారా శ్రీలంకలోని తమిళ మైనారిటీ వర్గంతోపాటు, అందరు పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజానేతనని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు.

మాతృ భాష సింహళ అయినప్పటికీ, కొన్ని భావాలను నేను తమిళంలో వివరించాలనుకుంటున్నాను. సింహళ మరియు తమిళం శ్రీలంక పౌరుల ఉపయోగించే రెండు భాషలు. శతాబ్దాలుగా ఈ రెండు భాషలను ఉపయోగిస్తున్నారు, సాహిత్యంలో ఇవి సంపన్న భాషలు, వీటికి దేశంలో అధికారిక భాషల గుర్తింపు ఉండటంతోపాటు, వాటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆయన తమిళంలో ఈ విషయాన్ని చెప్పారు,

మా దేశంలో ప్రజాస్వామ్యాన్ని విస్తరించడంతో, శ్రీలంక సింహళ మరియు తమిళ పౌరుల మధ్య బంధాలు బలపడతాయి, అంతేకాకుండా భవిష్యత్ అభివృద్ధికి ప్రధాన కారకంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ఒక దేశంగా సంపన్నమైన స్వాతంత్ర్యం మరియు చిరస్థాయి ఐకమత్యంవైపు అడుగులేస్తామని చెప్పారు.”[ఉల్లేఖన అవసరం]

కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం[మార్చు]

రాజపక్స మాజీ అందాల సుందరి శిరంథీ విక్రమసింఘేను వివాహం చేసుకున్నారు, ఆమె కమ్మోడోర్ ఇ.పి. విక్రమసింఘే, SLN మరియు వైలెట్ విక్రమసింఘే [18] దంపతుల కుమార్తె. రాజపక్స, శిరంథీ విక్రమసింఘే దంపతులు ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు, వారి పేర్లు నామల్, యోషిథా మరియు రోహిథా. నామల్ రాజపక్స రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు, శ్రీలంక నౌకా దళంలో మార్చి 2009లో తాత్కాలిక సబ్ లెఫ్టినెంట్‌గా ఉన్నారు [19] మరియు 2006లో అధ్యక్షుడికి ఒక ఎయిడ్-డి-క్యాంప్‌గా నియమించబడ్డారు.

వివాదాలు[మార్చు]

హెల్పింగ్ హంబన్‌తోట కేసు[మార్చు]

మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు ప్రతిపక్షం ఆయనపై అవినీతి ఆరోపణలు చేసింది, హెల్పింగ్ హంబన్‌తోట (హంబన్ తోటకు సాయం అందించడానికి సంబంధించిన) కేసులో ఆయన సుమారుగా USD 830,000 నిధులను ఒక కోశాగార ఆమోదిత ప్రైవేట్ నిధి రూపంలో మంజూరు చేసినట్లు ప్రతిపక్షం ఆరోపించింది, హెల్పింగ్ హంబన్‌తోటగా సూచించే ఈ వివాదంలో ఆయన తన సొంతపట్టణం మరియు తన ఎన్నికల నియోజకవర్గం హంబన్‌తోటలో బాక్సింగ్ డే సునామీ బాధితులకు సాయం చేసేందుకు ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎన్నికకు ముందు, శ్రీలంక సుప్రీంకోర్టు ఈ కేసుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత ప్రధాన న్యాయమూర్తి శరత్ సిల్వా ఈ కేసును కొట్టివేశారు, అధ్యక్ష అభ్యర్థిగా రాజపక్స పేరు ప్రకటించిన వెంటనే ఆయనపై ఈ కేసు పెట్టడం జరిగిందని శరత్ సిల్వా తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. "[UNP నేత] రాణిల్ విక్రమసింఘేకు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నంగా మరియు మహీంద రాజపక్సకు ప్రతికూలత ఏర్పాటు చేసే ప్రయత్నంగా కోర్టు ఈ కేసును పరిగణిస్తుంది. హెల్పింగ్ హంబన్‌తోట నిధి యొక్క ఉనికి గురించి మంత్రివర్గం తమకు తెలుసని పార్లమెంట్‌లో తెలియజేసింది.[ఉల్లేఖన అవసరం] 2004 డిసెంబరు 26 హిందూ మహాసముద్ర సునామీ బాధితులకు సాధ్యమైంత త్వరగా సహాయక నిధులు అందేందుకు ప్రక్రియను వేగవంతం చేయడానికి హంబన్‌తోట నిధి సేకరించేందుకు విరాళాలు సేకరించినట్లు ఆయన కార్యాలయం చెప్పింది. ఈ డబ్బును దేశ ఖాతాలో చేర్చడం జరిగింది, రాజపక్స దీనిలో తన ఉపయోగం కోసం ఒక్క సెట్ కూడా తీసుకోలేదని తరువాత ప్రధాన మంత్రి కార్యదర్శి లలిత్ వీరతుంగా AFP వార్తా సంస్థతో ఆ సమయంలో చెప్పారు.[20]

పత్రికా స్వేచ్ఛ[మార్చు]

రాజపక్స పాలనా కాలంలో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండెక్స్ తమ యొక్క ప్రపంచవ్యాప్త పత్రికా స్వేచ్ఛ సూచీలో మొత్తం 173 దేశాల్లో శ్రీలంకకు 165వ స్థానం ఇచ్చింది.[21] హ్యూమన్ రైట్స్ వాచ్ ఒక పరిశోధన ద్వారా దేశంలో విస్తృత అపహరణలకు శ్రీలంక ప్రభుత్వమే కారణమని ఆరోపించింది.[22]

ఆరోపిత ఎన్నికల మోసాలు[మార్చు]

2005 అధ్యక్ష ఎన్నికలు[మార్చు]

దేశంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు LTTEకి రాజపక్స లంచాలు ఇచ్చినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ప్రాంతాల్లోని అనేక మంది ఓటర్లు LTTE చేత బలవంతంగా ఎన్నికలకు దూరం చేయబడ్డారు, వారు ప్రతిపక్ష అభ్యర్థి రాణిల్ విక్రమసింఘేకు మద్దతు ఇచ్చివుండేవారనే అభిప్రాయాలు ఉన్నాయి.[23]

2010 అధ్యక్ష ఎన్నికలు[మార్చు]

రాజపక్స కంప్యూటర్‌లను ఉపయోగించి ఎన్నికల ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.[24]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • డి. ఎ. రాజపక్స
 • చమల్ రాజపక్స
 • గోటాభాయ రాజపక్స
 • బాసిల్ రాజపక్స
 • ప్రపంచ రాజకీయ కుటుంబాలు

సూచనలు[మార్చు]

 1. (BBC)
 2. http://www.colombopage.com/archive_091/Sep1252248219RA.html
 3. లుంవుంబా యూనివర్శిటీ హానర్స్ ప్రెసిడెంట్ రాజపక్స విత్ ఎ డాక్టరేట్ ఇన్ మాస్కో, రష్యా
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 ప్రెసిడెంట్స్ ఫండ్ ఆఫ్ శ్రీలంక , ప్రెసిడెంట్స్ ప్రొఫైల్
 5. 5.0 5.1 వెన్ మహీంద బికమ్ ది యంగస్ట్ MP తిలికరత్నే, ఇండీవారా, ది సండే అబ్జర్వర్
 6. ప్రెసిడెంట్ మహీంద రాజపక్స, president.gov.lk
 7. "Hardliner wins Sri Lanka election". BBC News. November 2005 18, 2005. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 8. 8.0 8.1 "Trouble at the top in Sri Lanka?". BBC News. November 10, 2009. Retrieved May 12, 2010.
 9. "S Lanka army head leaves abruptly". BBC News. November 16, 2009. Retrieved May 12, 2010.
 10. ^ http://www.hindu.com/2008/07/09/stories/2008070960991200.htm
 11. న్యూయార్క్ టైమ్స్ - ఆర్టికల్ ఆన్ హంబన్‌తోట అండ్ మహీంద
 12. "How President decided on retaliation". The Sunday Times. April 30, 2006. Cite news requires |newspaper= (help)
 13. "Sri Lanka forces attack reservoir". BBC News. August 6, 2006. Cite news requires |newspaper= (help)
 14. "Fighting mars Lanka peace moves". BBC News. October 6, 2006. Retrieved May 12, 2010.
 15. "Sri Lanka President swipes at U.N. record". REUTERS. September 25, 2007. Cite news requires |newspaper= (help)
 16. "President Mahinda Rajapaksa appeals to unnamed political elements not to betray motherland to foreign interests". Asian Tribune. August 13, 2007. Cite news requires |newspaper= (help)
 17. శ్రీలంకన్ ట్రూప్స్ సెర్చ్ ఫర్ రెబల్ లీడర్, జిన్‌హువా
 18. ఫస్ట్ లేడీ ఆఫ్ శ్రీలంక
 19. హిజ్ ఎక్సెలెన్సీ ది ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్ ఎట్ ది కమీషనింగ్ పెరేడ్ హెల్డ్ ఎట్ ది నేవల్ అండ్ మారిటైమ్ అకాడమీ
 20. "Lanka president wins tsunami case". BBC News. March 27, 2006. Cite news requires |newspaper= (help)
 21. http://web.archive.org/web/20061122084937/http://www.rsf.org/article.php3?id_article=19391
 22. http://www.hrw.org/en/video/2008/03/06/sri-lankas-ghosts
 23. "Hardliner wins Sri Lanka election". BBC News. November 18, 2005.
 24. http://www.adaderana.lk/news.php?nid=7507

బాహ్య లింకులు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

అధికారిక సైట్‌లు[మార్చు]

ప్రసార సాధనాల్లో వార్తలు[మార్చు]

ఇతర లింక్‌లు[మార్చు]

మూస:S-dip
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
Ranil Wickremesinghe
Prime Minister of Sri Lanka
2004–2005
తరువాత వారు
Ratnasiri Wickremanayake
అంతకు ముందువారు
Chandrika Kumaratunga
President of Sri Lanka
2005–present
Incumbent
అంతకు ముందువారు
A. P. J. Abdul Kalam
Chair of SAARC
2008–present
Incumbent
అంతకు ముందువారు
Mahmoud Ahmadinejad
Chair of G-15
2010-present
Incumbent

మూస:SriLankaPresidents మూస:SriLankaPrimeMinisters మూస:Current SAARC Leaders