రణిల్ విక్రమసింఘే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణిల్ విక్రమసింఘే
రణిల్ విక్రమసింఘే


శ్రీలంక ప్రధాన మంత్రి
పదవీ కాలం
12 మే 2022 – ప్రస్తుతం
రాష్ట్రపతి గొటబయా రాజపక్స
ముందు మహిందా రాజపక్స

వ్యక్తిగత వివరాలు

రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తొలిసారిగా 1993-1994 వరకు ప్రధానిగా పని చేసి ఆ తర్వాత 2001-2004, 2015-2018 అక్టోబర్‌ వరకు, 2018 డిసెంబర్‌ నుంచి 2019 ప్రధానిగా నాలుగుసార్లు శ్రీలంకకు ప్రధానిగా పని చేసి తిరిగి 2022 మే 12న ఐదోసారి ప్రధానికి భాద్యతలు చేపట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రణిల్‌ విక్రమసింఘే 1949 మార్చి 24న నళిని విక్రమసింఘే, ఎస్మాండ్ విక్రమసింఘే దంపతులకు కొలంబోలో జన్మించాడు. ఆయన కొలంబోలోని రాయల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్, కొలంబో యూనివర్సిటీలో పీజీ, లా పూర్తి చేసి 1972లో న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించి 1977లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

రాజకీయ అనుభవం

[మార్చు]
  • న్యాయవాది అయిన విక్రమ సింఘే 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
  • 1998లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన రణిల్ వివిధ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వశాఖలకు మంత్రిగా పని చేశాడు.
  • ఆయన 1993 నుంచి 1994, 2001-2004, 2015-18, 2018-19లో మొత్తం నాలుగు దఫాల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
  • నాయకత్వ సంక్షోభంతో 2020లో తన యునైటెడ్ నేషనల్ పార్టీలో చీలిక రావడంతో ఆయన పార్టీ రెండుగా విడిపోయింది.
  • 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో వచ్చిన విబేధాలు విక్రమ సింఘే ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అదే సమయంలో 2019లో ఈస్టర్ రోజున జరిగిన దాడిలో 260మంది ప్రాణాలు కోల్పోవడం రణిల్ ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారింది. * * *2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విక్రమ సింఘే పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 May 2022). "శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ప్రమాణం". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  2. BBC News తెలుగు (12 May 2022). "రణిల్ విక్రమసింఘే: గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు, కానీ దేశానికి ప్రధాని అయ్యారు". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.