Jump to content

మహ్మద్ మొజం ఖాన్

వికీపీడియా నుండి
(మహ్మద్‌ మొజం ఖాన్‌ నుండి దారిమార్పు చెందింది)
మహ్మద్‌ మొజం ఖాన్
మహ్మద్ మొజం ఖాన్


తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
ముందు నియోజకవర్గం ఏర్పాటు
నియోజకవర్గం బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
నియోజకవర్గం బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం ఆసిఫ్ నగర్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1970-09-10) 1970 సెప్టెంబరు 10 (వయసు 54)[1]
హైదరాబాదు, తెలంగాణ
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
తల్లిదండ్రులు నసీబ్ ఖాన్ - ఖన్నా ఖాతూన్
జీవిత భాగస్వామి జెహ్రా ఖాటూన్
సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు, తెలంగాణ
పూర్వ విద్యార్థి సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల (హైదరాబాద్)
వృత్తి రాజకీయ నాయకుడు

మహ్మద్‌ మొజం ఖాన్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

మహ్మద్‌ మొజం ఖాన్‌ 1970, సెప్టెంబరు 10న నసీబ్ ఖాన్ - ఖన్నా ఖాతూన్ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహ్మద్‌ మొజం ఖాన్‌ కు జెహ్రా ఖాటూన్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

మహ్మద్‌ మొజం ఖాన్‌ 2004లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం నుండి 12వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. పోటీచేసి సిపిఐ పార్టీ అభ్యర్థి మీర్ అహ్మద్ ఆలీపై 54,582 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2009లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం నుండి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అబ్దుల్ రహమాన్ పై 95,045 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[5] 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఇనాయత్ ఆలీ బక్రీ పై 82,518 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]

పదవులు

[మార్చు]
  • వక్ఫ్ బోర్డు సభ్యుడు

ఇతర వివరాలు

[మార్చు]

కెనడా, మలేషియా, సౌదీ అరేబియా, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Nawab Mohammad Moazam Khan". All India Majlis-e-Ittehadul Muslimeen. Archived from the original on 6 ఏప్రిల్ 2015. Retrieved 1 October 2016.
  2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. "Mohd. Moazam Khan MLA of Bahadurpura Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  4. "Nawab Mohammad Moazam Khan | MLA | AIMIM | Bahadurpura | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-01. Retrieved 2021-10-28.
  5. "Mohd. Moazam Khan(All India Majlis-E-Ittehadul Muslimeen):Constituency- BAHADURPURA(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.
  6. Reporter, Our Staff (2004-09-21). "Moazam Khan is MIM nominee for Asifnagar". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-28.
  7. "Mohd Moazam Khan(All India Majlis-E-Ittehadul Muslimeen):Constituency- BAHADURPURA(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.