మహ్మద్ అస్రారుల్ హక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్రారుల్ హక్

పదవీ కాలం
2009 – 7 డిసెంబర్ 2018
ముందు మహ్మద్ తస్లీముద్దీన్
తరువాత మహ్మద్ జావేద్
నియోజకవర్గం కిషన్‌గంజ్

జమియత్ ఉలమా-ఎ-హింద్ 8వ ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
29 జనవరి 1980 – 11 అక్టోబర్ 1991
ముందు సయ్యద్ అహ్మద్ హష్మీ
తరువాత ముఫ్తీ అబ్దుల్ రజాక్

వ్యక్తిగత వివరాలు

జననం (1942-02-15)1942 ఫిబ్రవరి 15
తారాబరి గ్రామం, దిఘల్‌బ్యాంక్, కిషన్‌గంజ్ జిల్లా, బీహార్
మరణం 2018 డిసెంబరు 7(2018-12-07) (వయసు 76)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం సౌద్ ఆలం ఎమ్మెల్యేతో సహా 5
నివాసం తారాబరి గ్రామం, దిఘల్‌బ్యాంక్, కిషన్‌గంజ్ జిల్లా, బీహార్
పూర్వ విద్యార్థి దారుల్ ఉలూమ్ దేవబంద్
మూలం [1]

మహ్మద్ అస్రారుల్ హక్ (15 ఫిబ్రవరి 1942 - 7 డిసెంబర్ 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఖాస్మీ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్స్ లా బోర్డు సభ్యుడు, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.

రాజకియ జీవితం

[మార్చు]

మౌలానా అస్రార్-ఉల్-హక్ ఖాస్మీ రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1998లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా, 1999లో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

ఖాస్మీ 2014 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యాయస్థానం సభ్యుడిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

మౌలానా అస్రార్-ఉల్-హక్ ఖాస్మీ గుండెపోటుతో 7 డిసెంబర్ 2018న మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (7 December 2018). "Kishanganj Congress MP Maulana Asrar-ul-Haque Qasmi passes away at 76" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. Deccan Herald. "Congress MP Maulana Asrarul Haq Qasmi dies" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.