మహ్మద్ అహ్మద్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌
మహ్మద్ అహ్మద్ షరీఫ్


పదవీ కాలం
2019 ఫిబ్రవరి 7 – 2021 మే 24
ముందు నాస్యం మహమ్మద్ ఫరూఖ్, TDP

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015-05-23

వ్యక్తిగత వివరాలు

జననం (1955-01-01) 1955 జనవరి 1 (వయసు 69)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెదేపా
నివాసం నరసాపురం, [1]
పూర్వ విద్యార్థి భోపాల్ విశ్వవిద్యాలయం
వృత్తి వ్యాపారం[1]

మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్. 2019 ఫిబ్రవరి 7 బాధ్యతలు స్వీకరించాడు. అతను తెలుగు దేశం పార్టీ సభ్యుడు. [1] [2]

జీవితం తొలిదశ

[మార్చు]

మహ్మద్ ఖాసిమ్ షరీఫ్ దంపతులకు జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందినవాడు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్సు డిగ్రీ పొందాడు. అతను భోపాల్ విశ్వవిద్యాలయం నుండి 1978 లో మాస్టర్ ఆఫ్ కామర్స్, 1979 లో ఎల్ఎల్బి చేసాడు. [2] [1]

రాజకీయ జీవితం

[మార్చు]

1982లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుండి షరీఫ్ సభ్యుడిగా వున్నాడు. జాతీయ ప్రధాన కార్యదర్శితో సహా పార్టీలో వివిధ పదవులు నిర్వహించాడు.[3] షరీఫ్‌ను శాసనమండలి సభ్యునిగా, తరువాత కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్‌గా నియమించారు. [2]

2019 ఫిబ్రవరి 7న షరీఫ్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3] [2]

జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో చర్చించినపుడు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిని అధికారపక్షం వ్యతిరేకించి శాసనమండలి రద్దు చేసే ప్రయత్నం ప్రారంభించింది. తెదేపా వర్గీయులు దీనిని స్వాగతించారు. అమరావతి ప్రాంతవాసులు, షరీఫ్ చిత్రానికి పాలాభిషేకం చేశారు. [4]

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా 2021 మే 24 వరకు పనిచేసారు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Shariff Mohammed Ahmed(TDP):(ELECTED BY MLAS) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 13 August 2019.
  2. 2.0 2.1 2.2 2.3 "Mohammed Sharif elected Chairman of AP Legislative Council". Deccan Chronicle (in ఇంగ్లీష్). 8 February 2019. Retrieved 13 August 2019.
  3. 3.0 3.1 "Sharif unanimously elected Andhra Council Chairman". Business Standard India. 7 February 2019. Retrieved 13 August 2019.
  4. "షరీఫ్‌కు అచ్చెన్న పాదాభివందనం: ఛైర్మన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం: మంత్రులు ఫైర్..!". వన్ ఇండియా. 2020-01-23. Retrieved 2021-01-27.

బాహ్య లింకులు

[మార్చు]