మాగాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాగాయ

మాగాయ పచ్చడి : కొత్త మాగాయ (తాత్కాలికం)

కావాల్సిన పదార్థాలు[మార్చు]

మామిడికాయలు

కావాల్సిన పదార్థాలు పాళ్ళు మీ పెద్దలను అడిగి తెలుసుకో గలరు.

  1. మామిడికాయలు
  2. ఉప్పు
  3. పసుపు
  4. ఎండు మిర్చి
  5. ఆవాలు
  6. మెంతులు
  7. ఇంగువ
  8. నూనె
  9. ఎండు కారం

తయారీ విధానం[మార్చు]

మాగాయ ముక్కలు

మామిడికాయలు చెక్కు తీసి పలుచని పొడవాటి ముక్కలుగా కోసుకోవాాలి. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక గట్టి మూత ఉన్న సీసా లేదా జాడీలో పెట్టుకోవాలి. మూడు రోజుల తరువాత ఊరిన ముక్కలు బయటకు తీసి చేత్తో ముక్కల్ని గట్టిగా రసం పిండాలి. పిండిన ముక్కలు, రసం విడివిడిగా ఎర్రటి ఎండలో పెట్టాలి. రసం ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుంది. ముక్కలు మాత్రం రెండు రోజులు బాగా గలగలమనే వరకు ఎండలో పెట్టాలి. తదుపరి, స్టవ్‌మీద బేసిన్ పెట్టి ముక్కలను బట్టి కాస్త ఎక్కువ నూనె పోసి కాచి, అందులో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసి వేయించి, చివరలో ఇంగువ కూడా వేసి బేసిన్ మంట నుండి దింపి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత కారం, సరిపడా వేయించిన మెంతిపొడి వేసి, చల్లారిన ఈ మొత్తాన్ని ముక్కలు, రసం కలిపిన పాత్రలోకి వేసి, బాగా కలియబెట్టాలి. ఈ పచ్చడిని ఒక గట్టి మూత ఉన్న సీసా లేదా జాడీలో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. [1] [2]

ఇవి కూడా చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాగాయ&oldid=2323988" నుండి వెలికితీశారు