Jump to content

మాధురీ భట్టాచార్య

వికీపీడియా నుండి
మాధురీ భట్టాచార్య
మాధురీ భట్టాచార్య (2010)
జననం
వృత్తిమోడల్, నటి

మాధురీ భట్టాచార్య, కర్ణాటకకు చెందిన సినిమా నటి, మాజీ మోడల్. కన్నడ, హిందీ సినిమాలలో నటించింది.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

మాధురీ భట్టాచార్య కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నది. ఆ తరువాత మౌంట్ కార్మెల్ కళాశాలలో సైకాలజీ కోర్సును, రామయ్య కళాశాలలో న్యాయ విద్యను చదివింది.[3] మిస్ బెంగళూరు టైటిల్‌తో సహా అనేక అందాల పోటీలలో గెలుపొందింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వ్యాపారవేత్త అనురాగ్ ఆర్యతో మాధురీ భట్టాచార్య వివాహం జరిగింది.

నటనారంగం

[మార్చు]

ఖుషీ, బిసి బిసి వంటి కన్నడ సినిమాల ద్వారా మాధురీ భట్టాచార్య తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. సోనూ నిగమ్ రూపొందించిన రెండు వీడియోలకు మోడల్ గా చేసింది.[5] సహారా వన్ లో వచ్చిన కుచ్ లవ్ కుచ్ మస్తీ అనే టెలివిజన్ ధారావాహికలో నటించింది.[6][7] 2009లో బ్యాచిలర్ పార్టీ, 3 నైట్స్ 4 డేస్ అనే రెండు హిందీ సినిమాలలో నటించింది.[8] 2010 కామెడీ ప్రేమ్ కా గేమ్‌ సినిమాలో అర్బాజ్ ఖాన్‌తో కలిసి నటించింది.[9] 2011లో యమ్లా పగ్లా దీవానా అనే సినిమాలో చిత్రంలో ధర్మేంద్ర, బాబీ డియోల్‌లతో కలిసి "టింకు జియా" అనే ఐటెం సాంగ్‌లో నటించింది.[10] తన మూడవ కన్నడ సినిమా ప్రసాద్‌లో ఎనిమిదేళ్ళ చెవిటి-మూగ బాలుడికి తల్లిగా నటించింది.[11]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2003 ఖుషీ కన్నడ
2004 బిసి బిసి కన్నడ
2009 బ్యాచిలర్ పార్టీ పూజ హిందీ
3 నైట్స్ 4 డేస్ జోహా హిందీ
2010 ప్రేమ్ కా గేమ్ ట్వింకిల్ చోప్రా హిందీ
2011 యమ్లా పగ్లా దీవానా ఐటెం సాంగ్ "టింకు జియా" హిందీ
2011 హీరో హిట్లర్ ఇన్ లవ్ ఐటెం సాంగ్ "షబాబ్" పంజాబీ
2012 ప్రసాద్ మాలతి కన్నడ

మూలాలు

[మార్చు]
  1. "Madhuri is ready to play!". The Times of India. 24 January 2010. Archived from the original on 7 July 2012. Retrieved 2023-03-14.
  2. "Sandalwood beckons Madhuri Bhattacharya - Times of India". The Times of India. Archived from the original on 1 July 2012. Retrieved 2023-03-14.
  3. Shilpa Sebastian R. (19 March 2010). "Game on". The Hindu. Chennai, India. Archived from the original on 29 June 2011. Retrieved 2023-03-14.
  4. "Madhuri is ready to play!". The Times of India. 24 January 2010. Archived from the original on 7 July 2012. Retrieved 2023-03-14.
  5. "Arbaaz is a dear friend: Madhuri". The Times of India. 21 August 2009. Archived from the original on 1 July 2012. Retrieved 2023-03-14.
  6. Nina C George. "Unfazed by rumours". Deccan Herald. Archived from the original on 28 June 2011. Retrieved 2023-03-14.
  7. "Awesome threesome". The Hindu. Chennai, India. 16 November 2004. Archived from the original on 29 June 2011. Retrieved 2023-03-14.
  8. "Madhuri Bhattacharya: Filmography". Bollywood Hungama. Archived from the original on 21 March 2011. Retrieved 2023-03-14.
  9. "Meet the girl who plays Prem Ka Game". Bollywood Hungama. 1 May 2009. Archived from the original on 19 May 2010. Retrieved 2023-03-14.
  10. "Madhuri magic on the Deols". The Times of India. 11 January 2011. Archived from the original on 5 April 2012. Retrieved 2023-03-14.
  11. "Madhuri Bhattacharya is two-timing". The Times of India. 3 January 2012. Archived from the original on 7 July 2012. Retrieved 2023-03-14.

బయటి లింకులు

[మార్చు]