మానవ శాస్త్రం
మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము (Anthropology) మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం.. (గ్రీక్ భాష లో "Anthropos-" అంటే "మనిషి", "-logy" అంటే "శాస్త్రము" అని అర్థం).
మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన భేదాలను కూడ తెలిపే సాంఘిక శాస్త్రం కూడా. మానవ శాస్త్రజ్ఞులు అనేక ప్రాంతాలలో పరిశోధనలు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో పురావస్తు శాస్త్రము (Archealogy) ప్రకారంగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే తెగల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం సమయాన్ని, స్థలాన్ని, జీవన శైలిని ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.
అనువర్తిత మానవ శాస్త్రం (Applied Anthrology) అనే విభాగం సైన్సు ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. దక్షిణ అమెరికా లో ఉత్తమమైన పురాతన వ్యవసాయ ప్రక్రియలను అధ్యయనం చేసరుద్ధానం చేయదం ఈ మధ్య ఈ శాస్త్రం సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరుగున పడిపోతున్న ప్రాచీన భాషలను నేర్చుకునే విధానాలను ఆ యా భావి తరాల వారికి అంద జేయడం కూడ ఈ విభాగం కిందికే వస్తుంది.
మానవ శాస్త్రంలో ఇతర విభాగాలు
[మార్చు]- పురావస్తు శాస్త్రం - పూర్వ కాలం లో ప్రజలు ఎలా బ్రతికారో అధ్యయనం చేసే విభాగం. ఇది ఆ యా నాగరికతల పనిముట్లు, పాత్రలు ఇతర వస్తువుల ఆధారంగా ఈ పరిశోధన చేస్తుంది.
- వివిధ ప్రాంతాలలోని పరిసరాలకు అనుగుణంగా మానవాళి మనుగడ, శరీర భౌతిక లక్షణాలు కాలక్రమేణా లో ఎలా మార్పు చెందాయో పరిశీలించే శాస్త్రమే భౌతిక మానవ శాస్త్రం (Physical Anthropology). మానవాళితో పాటుగా భౌతిక మానవ శాస్త్రజ్ఞులు జీవ పరిణామం లో పూర్వీకులైన వానర జాతులను కూడ పరిశోధిస్తారు.
- భాషాపర మానవశాస్త్రం (Linguistic Anthropology) - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
- జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) ప్రయత్నిస్తుంది. ఈ విభాగం సామాజిక శాస్త్రం (Sociology), సాంఘిక మనస్తత్వ శాస్త్రము(Social Psychology) లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.
చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.
జీవ మానవ శాస్త్రం (Bio-Anthropology)
[మార్చు]ఇవి కాక కొన్ని సందర్భాలలో జీవ మానవశాస్త్రాన్ని ప్రత్యేక విభాగంగానో, జీవ శాస్త్రంలో భాగంగానో కూడ అధ్యయనం చేయటం పరిపాటి.