Jump to content

మారేమండ

వికీపీడియా నుండి
మారేమండ
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం విస్సన్నపేట
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి చాట్ల సావిత్రి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08598

మారేమండ గ్రామం కృష్ణా జిల్లా లోని విస్సన్నపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

"మారేమండ" అనగా "మారెమ్మతల్లి స్థలం" అని అర్థం. ఈ ప్రాంత దైవం మారమ్మతల్లి.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.

విస్సన్నపేట గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు, విజయవాడ

గ్రామ విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామ సమీపంలో వేప చెట్టు ఉంది. దీని వయస్సు 150 సంవత్సరాలు ఉంటుంది. [ఆధారం చూపాలి].
  • విస్సన్నపేటలోని ఇండేన్ గ్యాస్ కంపెనీవారు దత్తత తీసుకున్న విస్సన్నపేట మండలంలోని రెండు గ్రామాలలో ఇది ఒకటి. ఆ కంపెనీవారు ఈ గ్రామస్తులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసారు. అందువలన అధికారులు ఈ గ్రామానికి, 2016, ఫిబ్రవరి-1వ తేదీనాడు, పొగరహిత గ్రామంగా ధ్రువీకరణ పత్రం అందజేసినారు. ఈ గ్రామంలో మొత్తం 232 కుటుంబాలు ఉండగా, 46 గృహాలకు ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మిగతా 186 మందికి గూడా, "దీపం" పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడంతో గ్రామం పొగరహిత గ్రామంగా గుర్తించబడింది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

విస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, వేమిరెడ్డిపల్లి శ్రీ ప్రజ్నహైస్కూల్, విస్సన్నపేట

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

పెద్ద చెరువు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. ఈ గ్రామం 2001 వరకూ తాతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది, 2001 లో ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. 2001లో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా వడిత్యా భద్రుని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ గ్రామం అతని హయాంలో నిర్మల్ పురస్కారానికి ఎన్నికైంది.
  2. 2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు చాపలమడుగు దేవసహాయాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇతని హయాంలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి ఉత్తమ సర్పంచిగా పురస్కారం గ్రహించారు.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చాట్ల సావిత్రి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో ప్రసిద్ధ రామాలయం ఉంది. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుకుంటారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

మామిడి, వరి, చెరకు పండిస్తుంటారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

ఈ గ్రామ ప్రజల్లో అనేక మంది వ్యవసాయదారులు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మారేమండ&oldid=4130355" నుండి వెలికితీశారు