Jump to content

మార్గశిర శుద్ధ పూర్ణిమ

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మార్గశిర శుద్ధ పూర్ణిమ మార్గశిరమాసములో శుక్ల పక్షములో పూర్ణిమ తిథి కలిగిన 15వ రోజు.

సంఘటనలు

[మార్చు]
  • రామాయణంలో రాముడు సీతాలక్ష్మణసమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని యైదవనాడు చిత్రకూటము జేరి యందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. పిదప జ్యేష్ఠకృష్ణాష్టమినాడు రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రామ రామ యని యేడ్చెను. ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశినాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమున బద్ధుడైనట్లు నటించెను. రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలుచుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను. పూర్ణిమ నాటికి హనుమంతుడు తిరిగి మహేంద్రగిరికివచ్చి వానరులతో గూడి యైదు దినములు నడచి యారవ దినమున మధువనము జొచ్చియందు మధువు గ్రోలి చెట్ల జెల్లాచెదరుచేసి పయనించి యేడవ దినమున రామునిజేరి యానవా లోసంగెను.[1]
  • చింతలపాడు (చందర్లపాడు మండలం) ఇక్కడ నూకానమ్మ తిరణాల ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున జరుగుతుంది. దానికి ముందు రోజు చతుర్దశి నాడు పిండి వంటలతో బోనాలు సమర్పిస్తారు.

జననాలు

[మార్చు]
  • తెలుగు సంవత్సరం పేరు : ప్రముఖ వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.

మరణాలు

[మార్చు]
  • తెలుగు సంవత్సరం పేరు : ప్రముఖ వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. బులుసు, వేంకటేశ్వర్లు (1988). అరణ్యక మహర్షి, మహర్షుల చరిత్రలు. తిరుమల తిరుపతి దేవస్థానములు. p. 5. Retrieved 25 June 2016.[permanent dead link]