మీనాక్షి లేఖి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనాక్షి లేఖి
మీనాక్షి లేఖి


విదేశీ వ్యవహారాలు శాఖ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జూలై 7 (2021-07-07)
సంయుక్తంగా వి. మురళీధరన్, రాజ్ కుమార్ రంజన్ సింగ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సాంస్కృతిక శాఖ సహాయమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జూలై 7 (2021-07-07)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రహ్లాద్ సింగ్ పటేల్

లోక్‌స‌భ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జూన్ 2014
ముందు అజయ్ మాకెన్
నియోజకవర్గం న్యూఢిల్లీ

బ్లిక్ అండర్ టేకింగ్స్ చైర్‌పర్సన్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 అక్టోబర్ 2019
నియమించిన వారు ఓం బిర్లా
ముందు శాంతా కుమార్

ప్రివిలిజేస్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌
పదవీ కాలం
20 జులై 2016 – 29 అక్టోబర్ 2019
ముందు ఎస్.ఎస్.అహ్లువాలియా
తరువాత హరివంశ్ నారాయణ్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-04-30) 1967 ఏప్రిల్ 30 (వయసు 57)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అమన్ లేఖి
సంతానం 2
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి
  • న్యాయవాది
  • రాజకీయ నాయకురాలు

మీనాక్షి లేఖి ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 7 జూలై 2021 నుండి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మీనాక్షి లేఖి 1967 ఏప్రిల్ 30న న్యూ ఢిల్లీలో భ‌గ‌వాన్ ఖ‌న్నా, అమ‌ర్‌ల‌తా ఖ‌న్నా దంపతులకు జన్మించింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసింది.

వృత్తి జీవితం[మార్చు]

మీనాక్షి లేఖి ఎల్.ఎల్.బి పూర్తి చేశాక 1990లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో ఆమె న్యాయవాదిగా తన పేరును న‌మోదు చేసుకొని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టు, ఇత‌ర కోర్టులు, ఢిల్లీ మ‌రియు దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లోని ట్రిబ్యున‌ళ్లు మ‌రియు ఫోరంల‌లో న్యాయ‌వాదిగా ప్రాక్టీసును ప్రారంభించి అనేక‌ ర‌కాలైన వ్యాజ్యాలు బెయిళ్లు, రివిజ‌న్లు, ట్ర‌య‌ల్సు, అప్పీళ్లు, అవినీతి నిరోధ‌క చ‌ట్టం/ క‌స్ట‌మ్స్ చ‌ట్టం/ ఫెరా ప్రాసిక్యూష‌న్లు, గృహ హింస మ‌రియు కుటుంబ న్యాయ వివాదాలకు సంబంధించిన కేసుల‌ను వాదించింది.

రాజకీయ జీవితం[మార్చు]

మీనాక్షి లేఖి రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌) అనుబంధ సంస్థ, స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్‌లో మీనాక్షి లేఖీ ప‌ని చేసింది. ఆమె 2010లో నితిన్ గ‌డ్క‌రీ ఆమెను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించగా, ఆమె బీజేపీలో చేరి బీజేపీ మ‌హిళా విభాగం మ‌హిళా మోర్చాలో కొంతకాలం పనిచేసి బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితురాలైంది. మీనాక్షి లేఖి 2014లో ఢిల్లీ లోక్‌స‌భ‌ నియాజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఆమె 2016 జూలై 20న పార్లమెంట్ లో ప్రివిలిజేస్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా, న‌వంబ‌రు 3, 2017న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్‌గా నియమితురాలైంది.[2]

మీనాక్షి లేఖి 2014లో ఢిల్లీ లోక్‌స‌భ‌ నియాజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి రెండవసారి ఎంపీగా గెలిచింది.[3][4] ఆమె 7 జూలై 2021 నుండి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[5]

మూలాలు[మార్చు]

  1. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  2. "Rudy, Lekhi, Hari Nominated to Press Council" in Outlook, 3 September 2014.
  3. DelhiMay 24, Press Trust of India New; May 24, 2019UPDATED; Ist, 2019 07:38. "New Delhi Lok Sabha results 2019: Victory for BJP's Meenakshi Lekhi, Ajay Makan trails behind". India Today (in ఇంగ్లీష్). Retrieved 24 May 2019. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "New Delhi Lok Sabha Election Results 2019 LIVE: BJP's Meenakshi Lekhi wins". The Indian Express (in Indian English). 24 May 2019. Retrieved 24 May 2019.
  5. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏశాఖ". Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.