Jump to content

మీరా చోప్రా

వికీపీడియా నుండి
మీరా చోప్రా
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లునిల
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు2005-ప్రస్తుతం

మీరా చోప్రా దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త.[1] 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1983, జూలై 8న సుదేశ్ చోప్రా, నీలం చోప్రా దంపతులకు జన్మించింది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, మన్నారా చోప్రాలు మీరా చోప్రా బంధువులు.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

నటుడు సూర్య ద్వారా సినీరంగం లోకి ప్రవేశించింది. 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రం మీరా చోప్రా తొలిచిత్రం. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాలు నటించింది.

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2005అంబే ఆరూయిరేమధుతమిళం
2006బంగారంసంధ్యారెడ్డితెలుగు
2008జాంబవన్ఎళిల్తమిళం
2008లీచెల్లమ్మల్తమిళం
2008మరుధమలైమీరాతమిళం
2008కాలైతమిళంగుంత లక్కిడి పాటలో
2008వాననందిని చౌదరితెలుగు
2009అర్జున్అర్జున్ గర్ల్ ఫ్రెండ్కన్నడ
2009జగన్మోహినిఆళగు నచియార్తమిళం
2011మారోప్రియాతెలుగు
2013గ్రీకు వీరుడుమాయతెలుగు
2014గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్టినా చోప్రాహిందీ
2015ఇసైమధుతమిళంఅతిథి పాత్ర
2015కిలాడీఅంజలితమిళం
2015మొగలిపువ్వుతెలుగు
హిందీ
20161920 లండన్శివంగీహిందీ
2018 నాస్తిక్ హిందీ

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ టైమ్స్. "మీరా చోప్రా". www.tollywoodtimes.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 May 2017.[permanent dead link]
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "మీరా చోప్ర , Meera Chopra". tollywoodphotoprofiles.blogspot.in. the original నుండి 19 మార్చి 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 May 2017.