ముజ్గి మల్లన్న జాతర నిర్మల్
ముజ్గి మల్లన్న ఆలయం - నిర్మల్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°04′N 78°17′E / 19.06°N 78.29°E |
పేరు | |
ఇతర పేర్లు: | మల్లన్న జాతర |
ప్రధాన పేరు : | ముజ్గి మల్లన్న |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నిర్మల్ |
ప్రదేశం: | నిర్మల్ గ్రామీణ మండలంలోని ముజ్గి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మల్లన్న |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా, నిర్మల్ గ్రామీణ మండలంలోని ముజ్గి గ్రామంలో కొలువైన మల్లన్న స్వామి వారి ప్రాచిన ఆలయం ఉంది. మాఘ పౌర్ణిమను పురష్కరించుకోని ఇచట ఐదు రోజుల పాటు మల్లన్న జాతర అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు[1].
నిర్మల్ జిల్లాలో ప్రాచీన సంస్కృతి[2] కి జానపద సాహిత్యానికి ఆట పాటలకు కాళలకు మల్లన్న ఆలయాలు నిలయాలు
మల్లన్న లు ఏడుగురు
[మార్చు]తెలంగాణలో మల్లన్న లు ఏడుగురు అన్నదమ్ములు అని జానపద కథల్లో పెద్దావారు చెపుతారు.1 మల్లన్న,2.మైలారదేవుడు 3.మల్లిఖార్జున స్వామి 4.మల్హహర్ రాయుడు 5.ఖండోబ దేవుడు 6.ఖండేల్ రాయుడు 7 .మున్నీశ్వరన్ ఇలా వివిధ పేర్లతో మల్లన్న స్వామిని పిలుస్తారు. మల్లన్నను భక్తులు శివ స్వరూపంగా కొలుస్తారు.మల్లన్న బోనాలు ,మల్లన్న జాతరలు మన తెలంగాణ పల్లె, పల్లెలో జరుపుతారు. అందువల్ల మల్లన్న మన తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం.
జాతర
[మార్చు]నిర్మల్ జిల్లా ముఖ్యమైన జాతరలలో మల్లన్న జాతర ఒకటి. జాతరకు భక్తులు హాజరై దైవ సన్నధిలో రాత్రాంత జాగారం చేస్తారు. ఆలయంలో ఏటా మాఘమాసం లో సట్టి పౌర్ణిమ నుండి ఐదు రోజులు పాటు జాతర జరుగుతుంది[3].మొదటి రోజు స్వామివారి కల్యాణం, రెండో రోజు సల్ల కుండల ఉత్సవం ,ముడో రోజు స్వామి వారి రథయాత్ర[4], నాల్గవ రోజున నాగవేల్లి, ఐదో రోజున అన్నదానం ఇలా ఐదు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చిన భక్తులు తప్పకుండా అక్కడ ఉన్న పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పిస్తారు. పోచమ్మ అమ్మవారు మల్లన్న దేవునికి అక్కయ్యగా భావిస్తారు. భక్తులు మల్లన్న ఆలయాల్లో "బండారిని" గొప్ప ప్రసాదంగా భావించి పసుపు చెల్లుకుంటారు.డమరుకానికి అచ్చు తెలుగు మాట ఒగ్గు ఒగ్గు కథలో మల్లన్న గురించి చెప్పేటప్పుడు శ్రీశైలం మల్లన్న ,కొమురవెల్లి మల్లన్న ను,ఐనవోలు మల్లన్న లను తలుచుకుంటూ ఉయ్యాల పాటల్లో ఉయ్యాల, జంపాల ముజిగ మల్లన్న యెముడాల రాజన్న అని పాటలు పాడుతారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రద్దీన దృష్టిలో ఉంచుభకొని బారీకేడ్లు నిర్మిస్తారు.జాతరకు ప్రతి ఏటా లక్షల పై భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు.
సల్లకుండ ఉత్సవాలు
[మార్చు]ఐదు రోజుల కార్యక్రమంలో రెండో రోజు మల్లన్న స్వామికి సల్లకుండల పండుగ అత్యంత వైభవంగా జరపడం ఆనవాయితి [5]. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి సల్లకుండలను తలపై ఎత్తుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయం చుట్టు సల్లకుండలు ,దీపాలతో ప్రదక్షిణలు చేస్తారు. బోనాలతో భాజాభజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. బోనాలను స్వామివారికి సమర్పించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఈ ఆలయాన్ని మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాదు, నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాల నుండి వచ్చే భక్తులు నిర్మల్ చేరుకోవాలి. నిర్మల్ నుండి 5 కిలోమీటర్లు దూరంలో ముజ్గి గ్రామం ఉంది. ఆలయానికి బైకులో గాని, ఇతర ప్రైవేటు వాహనాల్లో స్వామి ఆలయాన్ని చేరుకో వచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Bharat, E. T. V. (2021-02-26). "నేటి నుంచి ముజ్గి మల్లన్న జాతర". ETV Bharat News. Retrieved 2024-10-10.
- ↑ "ఈ మల్లన్న జాతర లో ప్రత్యేక వేషధారణ.. ఎందుకు ఇలా ఉంటారో తెలుసా." telugu.news18.com. 2024-02-26. Retrieved 2024-10-11.
- ↑ ABN (2021-03-01). "కన్నులపండువగా ముజ్గి మల్లన్న జాతర". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-10.
- ↑ Telugu, TV9 (2021-03-01). "ముజ్గి మల్లన్న స్వామి రథోత్సవంలో అపశృతి." TV9 Telugu. Retrieved 2024-10-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Bharat, E. T. V. (2021-02-27). "కనువిందుగా ముజ్గి మల్లన్న సల్లకుండల జాతర". ETV Bharat News. Retrieved 2024-10-10.