ముత్యాలపాడు (లింగసముద్రము)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ముత్యాలపాడు
రెవిన్యూ గ్రామం
ముత్యాలపాడు is located in Andhra Pradesh
ముత్యాలపాడు
ముత్యాలపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°05′42″N 79°42′04″E / 15.095°N 79.701°E / 15.095; 79.701Coordinates: 15°05′42″N 79°42′04″E / 15.095°N 79.701°E / 15.095; 79.701 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంలింగసముద్రము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,448 హె. (8,520 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం8,460
 • సాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523115 Edit this at Wikidata

ముత్యాలపాడు, ప్రకాశం జిల్లా, లింగసముద్రము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 115., ఎస్.టి.డి.కోడ్ = 08598.

  • ఈ గ్రామవాసియైన శ్రీ యల్లావుల కోటేశ్వరరావు కూలీ చేసి తన కుటుంబాన్ని పోషించుచున్నారు. వీరు తన కుమార్తె రేవతిని అతికష్టం మీద చదివించుచున్నారు. ఈమె ప్రస్తుతం కావలిలో ఇంటరు 2వ సం. చదువుచున్నది. ఈమెకు చిన్నప్పటినుండి, టెన్నికాయిట్ అంటే చాలా ఇష్టం. ఈమె చదువు కొనసాగించుచూనే ఆ క్రీడలో నిరంతర సాధనచేసి, తిరుగులేని విధంగా రాణింంచుచున్నది. ఈమె దేశంలోని పలు ప్రాంతాలలో తన సత్తా చాటి, బంగారు పతకాలు సాధించుచున్నది. జాతీయస్థాయిలో 3వ ర్యాంకు కైవసంచేసుకున్నది. కొంతమంది మనదేశపు క్రీడాకారులతోపాటు ఈమె అంతర్జాతీయ క్రీడాకారుల సరసన చేరినది. ప్రతి రాష్ట్రం నుండి కొంతమంది టెన్నికాయిట్ క్రీడాకారులను ఎంపికచేసి, బెంగళూరు, చెన్నై, డిల్లీ లలో 15 రోజులపాటు "ఇండియా క్యాంప్"కి ఎంపికచేశారు. వీరిలో రాష్ట్రం నుండి ఎంపిక చేసిన ముగ్గురిలో ఈమె ఒకరు. వీరికి శిక్షణ ఇచ్చిన తరువాత, త్వరలో దక్షిణ ఆఫ్రికాలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు వీరిని పంపించెదరు. ఈమె టెన్నికాయిట్లోనేగాక చదువులో గూడా ప్రథమ స్థానం సాధించుచున్నది . [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,460 - పురుషుల సంఖ్య 3,960- స్త్రీల సంఖ్య 4,500 - గృహాల సంఖ్య 1,973

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,313.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,323, మహిళల సంఖ్య 3,990, గ్రామంలో నివాస గృహాలు 1,707 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,448 హెక్టారులు.

సమీప పట్టణాలు[మార్చు]

వోలేటివారిపాలెం 9.6 కి.మీ, గుడ్లూరు 17.2 కి.మీ, పొన్నలూరు 21.3 కి.మీ, కందుకూరు 23.8 కి.మీ.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014,ఫిబ్రవరి-20; 11వ పేజీ.