ముత్యాల గర్భం
Appearance
ముత్యాల గర్భమనేది ఒక అసాధారణమైన గర్భం. సాధారణంగా ఆరోగ్యమైన పిండం ఏర్పడడానికి ఒక శుక్రకణం మరియూ ఒక అండంతో సంయోగం చెందుతుంది. అలా తండ్రి నుంచి ఒక జత, తల్లి నుంచి మరో జత క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి. క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో , ఆరోగ్యవంతమైన ఒక శుక్రకణం సంయోగం చెంది , తన క్రోమోజోముల్ని రెట్టింపు చేసుకుంటుంది. లేదా ఒక ఖాళీ అండంతో రెండు శుక్రకణాలు కలవడం వల్ల యేర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి. అండం తాలూకు క్రోమోజోములుండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం అంటారు. ముత్యాల గర్భం ఆరోగ్యంగా ఉండే బిడ్డ లా ఎదగలేదు. ముత్యాల వంటి బుడగల ఆకారంలో ఎదుగుతుంది.[1]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- ↑ "కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు". BBC News తెలుగు. Retrieved 27 December 2020.