Jump to content

మూస చర్చ:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వాడుక సమస్యలు

[మార్చు]

పరామితులు మార్చకుండా బాట్ తో మార్చారు. కాని మూసలో skyline బొమ్మ చూపించుట లేదు. (ఉదా:https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF&diff=prev&oldid=941735) --అర్జున (చర్చ) 06:31, 9 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తాజా infobox settlement మూస దిగుమతి తరువాత అక్షాంశరేఖాంశాలు పనిచేయటలేదు. --అర్జున (చర్చ) 23:05, 9 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

"సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం" మార్పులకు తగిన సూచనలు

[మార్చు]

అర్జున గారూ "మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం" లో కొన్ని సవరణలు ప్రతిపాదించుచున్నాను.

గమనిక:ఏదైనా ఒకపదం తెలుగుభాషలో కలిపిరాయలా, విడగొట్టిరాయాలా అనేదానిపై కొందరి రచయితల అభిప్రాయం తెలుసుకొనగా వారిలో ఒకరైన పాలకోడేటి సత్యనారాయణ తెలిపినఅభిప్రాయం ఇలా ఉంది. మనం ఉచ్చారణకు అనుగుణంగా పదరచన జరగాలి.అంటే మనం మాట్లాడేటప్పుడు వాటి మద్య విరామం ఉన్నట్లయితే అప్పడు దానిని రెండు పదాలుగా రాయాలి.విరామం లేకపోతే కలిపి రాయాలి. అంటే వ్యవహారిక భాషలో రాయాలి.రచనలు అన్నీ ఇలానా రాస్తారు అనే అభిప్రాయం వెలిబుచ్చారు.

  • మండలం కేంద్రము ను మండలకేంద్రం అని, ప్రభుత్వమును ప్రభుత్వం అని సరిచేయాలి.దీనిపై జరిగిన వ్యావహారిక భాష విభాగంలోని సబ్ విభాగం అనుస్వారం ఇక్కడ చూడండి.ఇది మనం అన్నిటిలో పాటించాల్సిన అవసరంఉంది.మీరు లోగడ గమనించారు.వికీపీడియాలో అలాంటివి ఎన్ని పేజీలు ఉన్నాయో లోగడ గుర్తించి లింకు ఇచ్చారు.
  • ప్రభుత్వం (government_type) అనే దానిదానికి గ్రామానికి పంచాయితీ ఎలాగనో, మండలానికి మండల పరిషత్ ఉంది.కావున ఆ లింకు ఇవ్వవచ్చు.leader_title కు మండల అధ్యక్షుడు అని ఏక వచనంలో సరిపోతుంది.ఇక్కడ ఏక వచనం విభాగంలో చూడండి.
  • కొన్ని చోట్ల బ్రాకెట్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఇవ్వాలి.వికీడేటా(Wikidata) వికీడేటా (Wikidata) అని ఉంటే బాగుంటుంది.కేవలం ఉదాహరణకు మాత్రమే.ఇవి అన్నిటిలో పాటించాల్సిన గమనికలు.

ఇవి చిన్న విషయాలు.మర్చిపోవుట సాధారణం.కానీ వికీపీడియా శైలి దృష్టిలో పెట్టుకుని సూచించాను.స్వీకరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:21, 31 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారికి, మీ సూచనలకు ధన్యవాదాలు. ఆంగ్లంలో Andhra Pradesh అని రాస్తున్నందున, తెలుగులో ఆంగ్లప్రభావం పడి విడదీసి రాస్తున్నాము. నేను ఇక ముందు కలిపి రాస్తాను. కొన్ని శైలి మార్పులు AWB వాడుకరులు చేస్తున్నారు. ఇక మండల అధ్యక్షుడు పురుష లింగ సూచకంగా వుంది. స్త్రీలకు కూడా వర్తించే పదం చెప్పండి. ఈ మూస పాతబడింది కొత్త మూస {{Infobox India AP Mandal}} లో తగిన మార్పులు చేయడం మంచిది. అర్జున (చర్చ) 13:17, 31 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ అక్కడ సందర్బాన్ని బట్టి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు అని వాడతాం.చట్టంలో 'మండల ప్రసిడెంట' అని ఉంటుంది. ఇది ఇద్దరికీ వాడవచ్చు.సమాచారపెట్టెలో ప్రతిసారి మార్చేది కాదు, కావున మండల ప్రెసిడెంటు అని వాడవచ్చు అని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 04:54, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు ఇలా అయితే ఆంగ్లపదాలకు ప్రాముఖ్యతపెరుగుతుంది. చట్టం తెలుగు అనువాదం లో కూడా అలా వున్నాదా? నాకు మండలాధ్యక్షుడు అన్న పదమే చాలావరకు తెలుగు వార్తలలో వాడుకలో వుందని అనుకుంటున్నాను. అందువలన మండల అధ్యక్షుడు(రాలు) అనేదే మంచిది అనిపిస్తుంది.-- అర్జున (చర్చ) 03:37, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ అదే రాయాలని నేను అనుకోవటం లేదు.మీరు అడిగారు కాబట్టి వాస్తవ పరిస్థితిని వివరించాను.ఇప్పుడు సూచించిన పదంపై మీకు ముందు ఆలోచన రాలేదనుకుంటాను.మీకు ఎలా చేయాలని ఉంటే అలా చేయండి.నాకేమి అభ్యంతరంలేదు.మండల అధ్యక్షుడు(రాలు) పదాల విషయంలో లోగడ మీకు ఒకసారి గుర్తు చేసాను.బ్రాకెట్ ఇచ్చే ముందు స్పేస్ ఉంచాలి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను.మీరు రాసే అన్ని పదాలు విషయంలో పాటించగలరు.మండల అధ్యక్షుడు (రాలు) ఇలా ఉండాలి. దీని మీద జరిగిన చర్చను విభాగంలో ఇక్కడ చూడవచ్చు.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:54, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి. మీ స్పందనకు ధన్యవాదాలు. పదానికి అనుబంధంగా బ్రాకెట్లలో వచ్చే పదం ముందు ఖాళీ వదలాలని నియమమున్నా, ఈ ప్రస్తుత విషయంలో పదానితో కలిపి చదువుకోవాల్సిన అవసరమున్నందున ఆ నిబంధనకు మినహాయింపు ఇస్తేనే మంచిది అనుకుంటాను. --అర్జున (చర్చ) 03:58, 9 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఏరియా కోడ్

[మార్చు]
@ సుజాత గారికి, ఏరియా ఫోన్ కోడ్ ను, ప్రాంతీయ ఫోన్ కోడ్ గా తరలించాను. గమనించండి.అర్జున (చర్చ) 17:23, 31 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సుజాత గారూ ప్రాంతీయ ఫోన్ కోడ్ చర్చ పేజీని కూడా గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:45, 31 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]