మూస చర్చ:18+ కి మాత్రమే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యిది వరకు తెవికీలో {{పెద్దలకు మాత్రమే}} మూస ఉన్నది. గమనించగలరు. వాడుకరి:veera.sj గారూ ఏ వికీలో కూడా ఇటువంటి మూసలు వినియోగిస్తున్నట్లు లేదు. ఒకసారి ఈ మూస ఆవశ్యకతను పరిశీలించండి.-- కె.వెంకటరమణ 09:15, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మూసను ఉపయోగించే వ్యాసాలలో వ్యాసం చాలా క్రిందికి వస్తుంది. వెంటనే కనబడదు. మూస నిర్మాణంలో

ట్యాగులు అధికంగా వాడినట్లు గమనించితిని. వాటిని తొలగించాలి.-- కె.వెంకటరమణ 09:28, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@వాడుకరి:veera.sj, వికీపీడియాకు సెన్సారు లేదు. సెన్సారు చెయ్యకూడదు. కాబట్టి ఈ మూస అవసరం లేదనుకుంటాను. --వైజాసత్య (చర్చ) 03:31, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణగారు మరియు వైజాసత్య గారు, ఈ మూస చేసే ముందు ఆ మూస మునుపే ఉన్నదని నాకు తెలియదు. తీరా చేసిన తర్వాత కొన్ని వ్యాసాలలో ఈ మూసని ఉంచుదామని అనుకొంటే అక్కడ వాల్రెడీ ఆ మూస ఉన్నది. ఈ మూసని నేను థాయ్ వికీ లో నుండి కాపీ చేశానో, మలయ్ వికీ లో నుండి కాపీ చేశానో నాకు సరిగా గుర్తు లేదు. పోతే, నేను కావాలనే ఈ మూసలో అన్ని

లు ఉంచాను. ఎందుకంటే పొరబాటున చిన్నపిల్లలు ఈ వ్యాసములలోకి వచ్చిననూ ఇది చదువుకొని క్రిందకి వెళ్ళకుండా నిష్క్రమిస్తారని! (అంటే సిగరెట్ పెట్టెల మీద పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికారం అని వ్రాసినట్టు). ఏ మూస బాగుంటే దానినే ఉంచి అంతగా బాగోలేని మూసని తొలగించటం నేను నిర్వాహకుల విచక్షణకే వదిలేశాను!! (ఈ వాడుకరి నిర్వాహకులు కారు, మరియు వీరికి నిర్వహణ పట్ల ఆసక్తి లేదు! :-) ) చర్చకి ధన్యవాదాలు. - శశి (చర్చ) 03:06, 6 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
• వైజాసత్య గారూ వికీపీడియాలో సెన్సారు లేదు, సెన్సారు చేయకూడదు అన్నది కరెక్టే. కానీ భారతదేశంలోని చట్టాల ప్రకారం అశ్లీలమైన అంశాలను ఆన్లైన్లో ప్రచురించడం చట్టవ్యతిరేకం(అయితే వాటిని వీక్షించడం చట్టవ్యతిరేకం కాదు). ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పున:పరిశీలించాలని నా అభిప్రాయం. వికీ కామన్స్‌లో కూడా వివిధ దేశాల చట్టాలను ఆకళించుకుని, తదనుగుణంగా వ్యవహరించడం ఇక్కడ ఉదహరిస్తున్నాను. ఇక అమెరికాలోనో, యూకేలోనో మరెక్కడో ఉన్నవారైతే అక్కడి చట్టాలను పరిశీలించుకోవాల్సివుంటుంది. ఐతే ప్రస్తుతానికి అత్యధికశాతం తెవికీపీడియన్లు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జీవిస్తూ, ఇక్కడి సర్వర్ల ద్వారానే పనిచేస్తున్నారు, కనుక ఇక్కడి చట్టాలను వారు శిరసావహించాల్సివస్తుందని నా అభిప్రాయం. ఇది వీలైనంత త్వరగా చర్చించాల్సిన అంశం.--పవన్ సంతోష్ (చర్చ) 09:45, 2 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]