మృత్యుంజయ చిలువేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృత్యుంజయ చిలువేరు
జననం1974, జనవరి 14
భూదాన్ పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా,
ప్రసిద్ధికార్టూనిస్ట్
మతంహిందూ
తండ్రిరామలింగం
తల్లిఅనసూయ

మృత్యుంజయ చిలువేరు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్టూనిస్ట్. గత 25 ఏళ్ళుగా కార్టూనిస్టుగా సుమారు పదహారువేల కార్టూన్లు, క్యారికేచర్లు గీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, పురస్కారాలు అందుకున్నాడు. పొలిటికల్ కార్టూన్లు ఇతని ప్రత్యేకత.[1]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

మృత్యుంజయ 1974, జనవరి 14న రామలింగం, అనసూయ దంపతులకు యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, భూదాన్ పోచంపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రి రామలింగం చేనేత కళాకారుడిగా అగ్గిపెట్టెలో పట్టే చీరెను, కుట్టులేకుండా మూడుకొంగుల చీరెను, రాజకీయనాయకుల పోట్రయిట్లను, కొత్తకొత్త డిజైన్స్ తో చీరలను నేసేవాడు.[2] అమ్మ అనసూయ విద్యావంతురాలు. అమ్మ నుండి చదవడం, తండ్రి నుంచి బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు.

కళారంగం

[మార్చు]

కట్టెల పొయ్యిమీద చేసే వంటతో ఇంటి గోడలు నల్లగా మసిబారినపుడు, ఆ గోడలనే బ్లాక్ బోర్డుగా చేసుకొని బూడిదతో చిన్నచిన్న బొమ్మలు గీసేవాడు.[3] బడి వయసులోనే ‘చిలువేరు మృత్యుంజయ’ పేరుతో సోషల్ కార్టూన్లు గీసిన మృత్యుంజయ, 1990లో పదవతరగతి చదువుతున్న సమయంలో వేసిన సోషల్ కార్టూన్ ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో అచ్చయ్యింది.

ఉద్యోగ జీవితం

[మార్చు]

1996లో దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో వచ్చిన ‘బొబ్బిలి పులి‘ పొలిటికల్ వీక్లీలో ఎడిటర్ కె.ఎన్.వై. పతంజలి ద్వారా స్టాఫ్ కార్టూనిస్టుగా అవకాశం రావడంతో అక్కడ మూడేళ్ళపాటు ఉద్యోగం చేశాడు. ఆ తరువాత ఎం.వి.ఆర్. శాస్త్రి సంపాదకత్వంలో వచ్చిన ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో చేరి 2007 వరకు పనిచేసాడు. తర్వాత ‘టివీ5’లో హెడ్ ఆఫ్ ది యానిమేషన్’గా చేరాడు. డైలీ వేసే పొలిటికల్ కార్టూన్లను ‘యానిమేషన్’ రూపంలో 3డి, 2డిలలో ‘రాజకీయ భేతాళం’, ఇదండి సంగతి’ పేర్లతో నాలుగు సంవత్సరాలపాటు కొనసాగించాడు. 2011 ఉగాది రోజున నమస్తే తెలంగాణ దినపత్రికలో చేరాడు. అందులో తెలంగాణ ఉద్యమ అంశాలమీద రకరకాల భావోద్వేగాలతో కూడిన కార్టూన్లు గీసి, తెలంగాణ ఉద్యమంలో తనవంతు కృషిచేశాడు.[1]

కార్టూన్ ప్రదర్శనలు

[మార్చు]
  1. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జూన్ 8వ తేదిన కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మృత్యంజయ గీసిన తెలంగాణ ఉద్యమ కార్టూన్లను 'నా కార్టూన్ ప్రదర్శన అరవైఏళ్లు – అరవై కార్టూన్లు' పేరుతో ప్రదర్శించబడ్డాయి.[4]
  2. బెంగుళూరులో ఐఐసీ వారి ఆధ్వర్యంలో ‘లైన్స్ బిహైండ్ ది స్మైల్స్' పేరుతో క్యారికేచర్ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది.[5]

పురస్కారాలు

[మార్చు]
  1. యూత్ అండ్ ఎయిడ్స్ నేషనల్ కార్టూన్ కాంటెస్ట్ (సత్యం ఫౌండేషన్)
  2. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు (నవతెలంగాణ)
  3. కళారత్న అవార్డు (వంశీ ఆర్ట్స్)
  4. మాయా కామత్ అవార్డు (బెంగుళూరు)[3]
  5. బెస్ట్ పొలిటికల్ కార్టూనిస్టు అవార్డు (హైబిజ్ టీవీ)
  6. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2020 (కార్టూన్ వాచ్ పత్రిక)
  7. 2024: కార్టూనిస్ట్ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[6]

పుస్తకాలు

[మార్చు]
  1. ఉద్యమ గీత (తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే కార్టూన్ల సంకలనం)
  2. ఎకోస్ ఆఫ్ లైన్స్ (మృత్యుంజయ గీసిన కార్టూన్లు, క్యారికేచర్ల ఇంగ్లీషు సంకలనం)
  3. హరితహాసం (కార్టూన్ సంకలనం)

పై రెండు పుస్తకాలను 2021, ఆగస్టు 25న, మూడవ పుస్తకంను 2023, జూన్ 19న ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Telangana, Explore (2014-04-03). "Mrityunjay Cartoonist - The man credited with making Telangana smile". Telangana Tourism | Hyderabad Tourist places (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-27. Retrieved 2021-08-27.
  2. నమస్తే తెలంగాణ, వార్తలు (31 August 2018). "సెప్టెంబర్ 8 నుంచి కార్టూన్ ఎగ్జిబిషన్‌". Dailyhunt. Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
  3. 3.0 3.1 The Hindu, ART (17 September 2018). "Smile a while: tête-à-tête with cartoonist Mrityunjay Chiluveru" (in Indian English). Nikhil Varma. Archived from the original on 6 August 2021. Retrieved 27 August 2021.
  4. Pratap (2014-06-10). "అరవై ఏళ్ల కల: మృత్యుంజయ్ కార్టూన్లు (పిక్చర్స్)". telugu.oneindia.com. Retrieved 2021-08-27.
  5. Indian Express, Indulgexpress (7 September 2018). "Cartoons exibition of works by Mrityunjay Chiluveru". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
  6. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.
  7. నవ తెలంగాణ, హైదరాబాద్‌ (26 August 2021). "'ఉద్యమ గీత...' ఆవిష్కరణ..." NavaTelangana. Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.