Jump to content

మేఘాలయ చిహ్నం

వికీపీడియా నుండి
మేఘాలయ చిహ్నం
Armigerమేఘాలయ ప్రభుత్వం
Adopted2022
Shieldమూడు కొండలు, మేఘాలు, మూడు ఏకశిలాలు, వంగల్ డ్రమ్
Supportersరిక్గిటోక్, పైలా పూసలు
Mottoమేఘాలయ ప్రభుత్వం
Earlier version(s)

మేఘాలయ చిహ్నం భారతదేశం లోని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించడానికి ఉపయోగించే చిహ్నం.

చరిత్ర

[మార్చు]

రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ప్రస్తుత చిహ్నం 2022 జనవరి 19న ప్రభుత్వం ఆమోదించింది. 198 పోటీదారులను ఆకర్షించిన రాష్ట్ర-వ్యాప్త పోటీని అనుసరించి పి. మారియో కె. పాథావ్ రూపం ఎంపిక చేయబడింది.[1]ఇంతకు ముందు రాష్ట్రం అధికారిక ప్రయోజనాల కోసం భారతదేశ చిహ్నం ఆధారంగా ఒక ముద్రను ఉపయోగించింది.

రూపం

[మార్చు]

చిహ్నం క్రింది లక్షణాలను వర్ణించే వృత్తాకార ముద్ర: [2]

  • మూడు పర్వత శిఖరాలు ఆంగ్ల ఎం అక్షరం ఆకారంలో ఉంటాయి, ఇది రాష్ట్రంలోని ఖాసీ, జైంతియా, గారో కొండలను సూచిస్తుంది.
  • "మేఘాల నివాసం" అని అర్ధం వచ్చే రాష్ట్ర పేరును సూచించే మేఘాలు
  • రాష్ట్రంలోని మూడు ప్రధాన తెగలకు ప్రాతినిధ్యం వహించే మూడు ఏకశిలాలు, ఖాసీ ప్రజలు, జైంతియా ప్రజలు, గారో ప్రజలు
  • సాంప్రదాయ వంగాల పండుగ డ్రమ్
  • సాంప్రదాయ రిక్గిటోక్, పైలా పూసల నెక్లెస్‌లు
  • ఆంగ్ల భాషలో "గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ" అనే పదాలు

మేఘాలయలోని స్వయం ప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌ల చిహ్నాలు

[మార్చు]

మేఘాలయలోమూడు స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌లు ఉన్నాయి.ప్రతి ఒక్కటి తమనుతాము ప్రాతినిధ్యంవహించడానికిప్రత్యేక చిహ్నాలను స్వీకరించాయి.

ప్రభుత్వ పతాకాలు

[మార్చు]

మేఘాలయ ప్రభుత్వాన్ని తెల్లటి మైదానంలో రాష్ట్ర చిహ్నాన్ని ప్రదర్శించే పతాకంద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది [3] [4] [5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dy CM unveils State Emblem". 22 January 2022.
  2. "Meghalaya State Emblem | Meghalaya at 50". YouTube.
  3. "Meghalaya state of India flag waving on the top sunrise mist fog Stock Photo - Alamy".
  4. "Vexilla Mundi".
  5. "Flag of Emblem of Meghalaya #india". YouTube.