మేఘాలయ ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Government of Meghalaya
StateShillong
చట్ట వ్యవస్థ
SpeakerThomas A. Sangma
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorPhagu Chauhan
Chief MinisterConrad Sangma
Chief SecretaryDonald Phillips Wahlang, IAS
Judiciary
High CourtMeghalaya High Court
Chief JusticeS. Vaidyanathan

మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా పిలువబడే మేఘాలయ ప్రభుత్వం, మేఘాలయ రాష్ట్ర 11 జిల్లాలకు అత్యున్నత పాలనా అధికారం అందించే సంస్థ. ఇందులో మేఘాలయ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, మేఘాలయ రాష్ట్ర అధిపతి గవర్నరు, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నరు పదవి ఎక్కువగా ఆచారబద్ధమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ప్రధాన అధిపతి. అతనికి చాలా వరకు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. షిల్లాంగ్ మేఘాలయ రాజధాని. ఇక్కడ శాసనసభ, సచివాలయం ఉన్నాయి. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉన్న మేఘాలయ హైకోర్టు, మేఘాలయ రాష్ట్రంలో తలెత్తే కేసులకు సంబంధించి అధికార పరిధిని, అధికారాలను అమలు చేస్తుంది.

ప్రస్తుత మేఘాలయ శాసనసభ ఏకసభ. ఇందులో 60 మంది శాసనసభ సభ్యులు (ఎం. ఎల్.ఎ.) ఏదేని పరిస్థితులలో గవర్నరు శాసనసభను ముందుగానే రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. "Meghalaya Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-10.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • మేఘాలయలో ప్రభుత్వం, రాజకీయాలు, ఆర్.ఎస్. లింగ్డోహ్ ద్వారా. సంచార్ పబ్. హౌస్, 1996.ISBN 81-7203-029-0ISBN 81-7203-029-0 .